అప్పులేని సంసారమైన… అన్నమయ్య సంకీర్తన

అప్పులేని సంసార మైనపాటే చాలు
తప్పులేని జీతమొక్క తారమైన జాలు // పల్లవి //

కంతలేని గుడిసొక్క గంపంతైన జాలు
చింతలేని యంబలొక్క చేరెడే చాలు
జంతగాని తరుణి యేజాతైన నాదె చాలు
వింతలేని సంపదొక్క వీసమే చాలు // అప్పులేని //

తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదే చాలు
ముట్టులేని కూడొక్క ముద్దడే చాలు
గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైన చాలు
వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలు // అప్పులేని //

చదవండి :  నరసింహ రామకృష్ణ : అన్నమయ్య సంకీర్తన

లంపటపడని మేలు లవలేసమే చాలు
రొంపికంబమౌకంటె రోయుటే చాలు
రంపపు గోరికకంటే రతి శ్రీవేంకటపతి
పంపున నాతని జేరే భవమే చాలు // అప్పులేని //

ఇదీ చదవండి!

కన్నుల మొక్కేము

కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ – అన్నమయ్య సంకీర్తన

పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. వాని అందచందాలు చూసి కన్నెలు పరవశించినారు. వాని చేతలకు బానిసలైనారు. కడపరాయని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: