cpi

‘లౌకికవాద ధృక్పథంతో సాగితే అది అభ్యుదయం’

కడప: ప్రజాస్వామ్య దేశంలో రచనలు లౌకికవాద ధృక్పథంతో సాగితే అది అభ్యుదయంగా చెప్పవచ్చని కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. ఎర్రముక్కపల్లెలోని స్థానిక సీపీబ్రౌన్ భాషాపరిశోధన కేంద్రంలో ‘ప్రగతిశీల సాహిత్యోద్యమం- కడప జిల్లా వారసత్వం’ అనే అంశంపై సీపీఐ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం  జరిగిన చర్చా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ…

కడప జిల్లా వారసత్వం అనే అంశంపై చెప్పుకోవాల్సినపుడు 1968లో ప్రారంభమైన ‘సంవేదన’ గుర్తు చేసుకోవాలన్నారు. సమకాలీన అంశాలపై చర్చలు, రచనలు చేస్తున్న అభ్యుదయ రచయితల రచనలు వామపక్షభావజాలం కలిగిన యువనాయకులు చదవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమాలకు పరోక్షంగా వామపక్షభావ రచయితలు దోహద పడుతూనే ఉంటారన్నారు.

చదవండి :  సైనిక పాఠశాలల్లో 6,9తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

యువత సమకాలీన సాహిత్యాన్ని చదవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ అభిప్రాయపడ్డారు. సమాజంలో ధనిక పేద వర్గాలు ఉన్నన్ని రోజులు మార్క్సిజం ఉంటుందని ఆచార్య రాచపాళెం తన అధ్యక్ష ప్రసంగంలో వివరించారు. డా. ఎన్.ఈశ్వర్‌రెడ్డి ‘ప్రగతిశీల సాహిత్యోద్యమం- కడప జిల్లా వారసత్వం’పై, డా. సంజీవమ్మ ఉద్యమ వికాసంపై పంపిన వ్యాసాన్ని సభకు చదివి వినిపించారు.

ఉద్యమ పురోగమనానికి సాహిత్యానికి ఉన్న సంబంధం చాలా బలమైందని అందుకుకోసం జిల్లాలో ప్రతినెల ఒక సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పేర్కొన్నారు. రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డిని సీపీఐ జిల్లా పార్టీ తరపున సత్కరించారు.

చదవండి :  హైకోర్టును కడపలో ఏర్పాటు చేయాల

కార్యక్రమంలో డా.మల్లెమాల, పలువురు సాహితీవేత్తల పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

samvedana magazine

సంవేదన (త్రైమాసిక పత్రిక) – ఏప్రిల్ 1968

పుస్తకం : సంవేదన ,  సంపాదకత్వం: రాచమల్లు రామచంద్రారెడ్డి , ప్రచురణ : యుగసాహితి, ఏప్రిల్ 1968లో ప్రచురితం. చదవండి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: