హోమ్ » సాహిత్యం » సంకీర్తనలు » ఆడరాని మాటది – అన్నమయ్య సంకీర్తన

ఆడరాని మాటది – అన్నమయ్య సంకీర్తన

కలహించిన కడపరాయడు తిరస్కరించి పోగా వాని ఊసులని, చేతలని తలచుకొని మన్నించమని అడుగుతూ ఆ సతి,  చెలికత్తెతో వానికిట్లా సందేశం పంపుతోంది…


వర్గం
: శృంగార సంకీర్తన
రాగము: శంకరాభరణం
రేకు: 0958-4
సంపుటము: 19-334


‘ఆడరాని మా టది’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి.

ఆడరాని మా టది గుఱుతు
వేడుకతోనే విచ్చేయుమనవే ||పల్లవి||

చదవండి :  మాటలేలరా యిక మాటలేల - అన్నమయ్య సంకీర్తన

కాయజకేలికిఁ గడుఁ దమకించఁగ
ఆయము లంటిన దది గుఱుతు
పాయపుఁబతికినిఁ బరిణాము చెప్పి
మోయుచుఁ దన కిటు మొక్కితిననవే ||ఆడరాని ||

దప్పిమోవితో తా ననుఁ దిట్టఁగ-
నప్పుడు నవ్విన దది గుఱుతు
యిప్పుడు దనరూ పిటు దలఁచి బయలు
చిప్పిలఁ గాఁగిటఁ జేర్చితిననవే ||ఆడరాని ||

పరిపరివిధములఁ బలుకలు గులుకఁగ
అరమరచి చొక్కినది గుఱుతు
పరగ శ్రీవేంకటపతి కడపలోన
సరవిఁగూడె నిఁక సమ్మతియనవే ||ఆడరాని ||

చదవండి :  మాడుపూరు చెన్నకేశవ స్వామిపై అన్నమయ్య సంకీర్తన


‘ఆడరాని మా టది’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి.

ఇదీ చదవండి!

దూరం సేను

దూరం సేను దున్న‌మాకు – జానపదగీతం

దూరం సేను దున్న‌మాకు దిన్నెలెక్కి సూడ‌మాకు ఊరి ముందర ఉల‌వ స‌ల్ల‌య్యో కొండాలరెడ్డి ||దూరం సేను|| అత‌డుః కొత్త ప‌ల్లె చేల‌ల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: