హోమ్ » చరిత్ర » ముస్లింల పేర్లు కలిగిన ఊర్లు

ముస్లింల పేర్లు కలిగిన ఊర్లు

కడప జిల్లాకు ఇస్లాం మత సంపర్కం 14వ శతాబ్దిలో జరిగినట్లు ఆధారాలున్నాయి (APDGC, 143). కుతుబ్ షాహీ, మొగల్, మయాణా, అసఫ్ జాహీ, హైదర్ అలీ, టిప్పు సుల్తాను ప్రభువుల పరిపాలనా కాలాల్లో ఇస్లాం మతం, జాతుల వ్యాప్తీ, ఉర్దూ భాషా వ్యాప్తం జరిగినాయి. (కడప జిల్లాలో మహమ్మదీయ రాజ్య స్థాపన వివరాలకు చూడండి Ibid 100-113). 1961 జనాభా లెక్కల ప్రకారం కడప జిల్లాలో 1,87,945 మంది మహమ్మదీయులు ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం కడప జిల్లాలో మహమ్మదీయుల జనాభా 3,86,900 – వీరిలో షియా, సున్నీ, వహాబ్ శాఖలకు చెందిన వాళ్ళున్నారు.

కడప జిల్లాలో ఉర్దూ/మహమ్మదీయ ప్రభావాన్ని సూచించే మొత్తం గ్రామాలు 108. వీటిలో ఇస్లాం మతాన్ని సూచించే గ్రామాలు 20 – అవి ‘తురకపల్లె’లు. ఇవికాక 88 గ్రామాలు మహమ్మదీయ వ్యక్తి నామాలు కలిగి ఉన్నాయి. అవి:

మహమ్మదీయ వ్యక్తి నామాలు కలిగిన ఊర్లు:

అబ్బూ‌సాహెబ్ : అబ్బూ‌సాహెబ్ పేట

అమీనా : అమీనాబాదు

ఆదంఖాన్ : ఆదంఖాన్ పల్లె

ఆలంఖాన్ : ఆలంఖాన్ పల్లె

ఇబ్రహీం : ఇబ్రహీంపురం, ఇబ్రహీంపేట

కుల్లాయి : కుల్లాయిపల్లె

ఖాజీ : ఖాజీపల్లె, ఖాజీపేట

ఖాదర్ ఖాన్ : ఖాదర్‌ఖాన్ కొట్టాలు

ఖాదర్ : ఖాదర్‌పల్లె

గోసాసాహెబ్ : గోసాసాహెబ్ కొట్టాలు

జమాల్ : జమాల్ పల్లె

జాఫర్ సాహెబ్ : జాఫర్‌సాహెబ్ పల్లె

దాయంఖాన్ : దాయంఖాన్ పల్లె (డాంఖాన్ పల్లె)

దౌలత్ : దౌలతాబాదు, దౌలతాపురం

నజర్ బేగ్ : నజర్‌బేగ్ పల్లె

నేక్ నాం :నేకనాంపేట, నేకనాపురం

పాపాసాహెబ్ :  పాపాసాహెబ్ పేట

పీర్ సాహెబ్ : పీరుసాహెబ్ పల్లె

బరంఖాన్ : బరంఖాన్ పల్లె

బాకర్ : భాకరాపురం, భాకరాపేట

బిస్మిల్లా : బిస్మిల్లాబాదు

బీబీసాహేబ్ : బీబీసాహేబ్ పేట

మహమ్మద్ : మహమ్మద్ గుంటపల్లె

మహమ్మద్ భాయ్ : మహమ్మద్ భాయ్ పల్లె

మాసా (మహబూబ్ సాహెబ్) : మాసాపేట, మాసాగారిపల్లె

మీర్ : మీరాపురం

మీర్జాఖాన్ : మీర్జాఖాన్ పల్లె

మొహిద్దీన్ : మొహిద్దీన్ పురం

మొహిద్దీన్ సాహెబ్ : మొహిద్దీన్ సాహెబ్ పల్లె

యాకుబ్ ఖాన్ : యాకుబ్‌ఖాన్ పల్లె

రసూల్ : రసూల్ పల్లె

రహమత్ ఖాన్ : రహమత్ ఖాన్ పల్లె (ఖాజీపేట మండలం, కడప తాలూకా)

రాజాసాహెబ్ : రాజాసాహెబ్ పేట

సయ్యద్ : సైదాపురం

సయ్యద్ మీర్ : సయ్యద్‌మీర్ కొట్టాలు

సర్వర్ ఖాన్ : సరంఖాన్ పేట

నవాజ్ ఖాన్ : నవాజ్‌ఖాన్ పల్లె

సూరత్ ఖాన్ : సూరత్‌ఖాన్ పల్లె

హసన్ : హసనాపురం (రాయచోటి తాలూకా)

ఫకీర్ సాహెబ్ : ఫకీర్‌సాహెబ్ పల్లె

ఫాతిమా (స్త్రీ నామం) : ఫాతిమాపురం

తెలుగుతనాన్ని సంతరించుకొన్న రెండు పేర్లు:

మస్తానయ్య : మస్తానయ్య పేట

మీరబ్దులయ్య : మీరబ్దుల్లాయపల్లె

హిందూ వ్యక్తినామాలపై మహమ్మదీయుల ప్రభావం:

కరీంరెడ్డి : కరీంరెడ్డిగారిపల్లె

పక్కీరారెడ్డి : పక్కీరారెడ్డిపల్లె

బిరుద సూచక గ్రామాలు:

నవాబు (ప్రభువు) : నవాబుపేట

ఫకీర్ :పక్కీరుపల్లె

హవల్దార్ ( సైన్యం లేదా పోలీసు శాఖలో చిన్న అధికారి, మూలం: ఉర్దూ-తెలుగు నిఘంటువు (లక్ష్మణ్‌రావు పతంగే) 2010 ) : హవల్దారుపేట

అమాని (దొరతనమువారు తమంతఁదాము కనుగొనినది, మూలం: సీమపలుకువహి-అచ్చతెనుగుమాటలపేరుకూర్పు (ఆదిభట్ల నారాయణదాసు) 1967 ) : అమానిరామచంద్రాపురం, అమానివిశ్వనాధపురం

పూజ్యార్ధక విశేషణం ‘కిబిలే’ గల గ్రామాలు మూడు – కిబిలే బొమ్మేపల్లె, కిబిలే వెంకటాపురం, కిబిలే సుగుమంచుపల్లె

ఆబాదు, చౌకు అనే ద్వితీయవయవాలు కలిగిన ఊర్లు కూడా మహమ్మదీయ నామాలు సూచించే గ్రామాలే.. ఉదా : చిన్నచౌకు, సాలాబాదు

– డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

(పరిశోధనా గ్రంధం ‘కడప ఊర్లు పేర్లు’ నుండి చిన్నపాటి మార్పులతో)

ఇదీ చదవండి!

ప్రాణుల పేర్లు

కడప జిల్లాలో ప్రాణుల పేర్లు కలిగిన ఊర్లు

కడప జిల్లాలో 16 రకాలయిన ప్రాణులను (Animals, Birds, reptiles etc..) సూచించే ఊర్ల పేర్లున్నాయి. ప్రాణుల పేర్లు సూచించే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: