హోమ్ » ఆచార వ్యవహారాలు » కడప ప్రజల మతసామరస్యం ప్రపంచానికే ఆదర్శం

కడప ప్రజల మతసామరస్యం ప్రపంచానికే ఆదర్శం

కడప పెద్ద దర్గాను సందర్శించినాక ప్రశాంతత

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవి శంకర్ గురూజీ

కడప: కడప ప్రజల మతసామరస్యం ప్రపంచానికే ఆదర్శమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ కొనియాడారు. రవిశంకర్ గురువారం కడప నగరంలోని అమీన్‌పీర్ దర్గా (పెద్ద దర్గా)ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

కడప ప్రజల మతసామరస్యంఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడప పెద్ద దర్గా మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు. ఈ దర్గాకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. అంతేకాకుండా పెద్దదర్గాకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. కడప నగరంలోని హిందువులు దర్గాలో ప్రార్థనలు చేయడం, ముస్లిం లు దేవుని కడపకు వెళ్లి ప్రార్థనలు చేయడం ప్రత్యేకతను సంతరించుకుందన్నారు.

చదవండి :  14వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా పద్మ విభూషణ్ డాక్టర్ వై.వి.రెడ్డి

కడప ప్రజల మతసామరస్యం ప్రపంచానికే ఆదర్శమన్నారు. కడప ప్రజలు కలసిమెలసి జీవించడం కడప గడ్డ అదృష్టమన్నారు. కడప పెద్ద దర్గాను సందర్శించిన తరువాత మనసులో ప్రశాంతత ఏర్పడిందన్నారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఏ కార్యక్రమాన్నైనా విజయవంతంగా పూర్తి చేయవచ్చునన్నారు.

ఇదీ చదవండి!

శెట్టిగుంట

కడప జిల్లా ప్రజలు ఎలాంటివారంటే?

కడప జిల్లా ప్రజలు ఎలాంటివారో చెబుతూ ఆయా సందర్భాలలో ఈ ప్రాంతంతో అనుబంధం కలిగిన అధికారులూ, అనధికారులూ వెలిబుచ్చిన కొన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: