హోమ్ » చరిత్ర » 1921లో కడపలో మహాత్మాగాంధీ చేసిన ఉపన్యాసం …

1921లో కడపలో మహాత్మాగాంధీ చేసిన ఉపన్యాసం …

1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు.

అప్పటికే సన్మాన సంఘం వారు అక్కడ సభకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. దాదాపుగా 40వేల మంది సభకు హాజరైనారు. జనసందోహం కారణంగా అక్కడ సుమారు ఒక గంట సేపు గందరగోళం జరిగింది. ఈ సభలో కడప మండల సంఘం వారు, మండల సహోదర బృందం వారు, వైశ్య సంఘం వారు వేర్వేరు సన్మాన పత్రాలను సమర్పించినారు. దీనితో పాటు కొందరు కవులు గాంధీజీని ప్రశంసిస్తూ పద్యాలు కూడా చదివినారు. ఇందుకు ప్రత్యుత్తరంగా గాంధీజీ కొద్దిసేపు ఉర్దూలోను, మరికొంత సేపు ఆంగ్లంలోనూ ఉపన్యసించినారు. ఈ ఉపన్యాసాన్ని గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు సభికులకు తెలుగులోకి అనువదించారు. ఆ నాటి ఈ ఉపన్యాసం కడప.ఇన్ఫో సందర్శకుల కోసం యధాతధంగా …

న్మాన పత్రాలతో కాలహరణం చేయడం మనకు ఎక్కువగా అభ్యాసమైపోయింది. ఈ సంవత్సరం ముగిసే లోపల పంజాబ్, ఖలాఫత్ ల సమస్యా పరిష్కారం, స్వరాజ్య సంపాదనం, అలీ సోదరులు మొదలయిన మన మిత్రుల విడుదల జరగాలని మనం తీర్మానిన్చుకోన్నట్లయితే మనం చాలా కట్టుదిట్టంగా వ్యవహరించవలసి ఉన్నది.

ఈ సభ మన కార్యాచరణలోని లోపం తెలియచేస్తున్నది. ఒక గంట కాలం మనమంతా వృధా చేసినాము. అట్లా చేయకుండా ఈ గంట సేపు మనమంతా నూలు వడికి ఉంటే కొన్ని వేల రూపాయలు సంపాదించి కరువు ప్రదేశాలలో ఆకలితో బాధపడుతున్న మన సోదరులకెంతో  సహాయం చేయగలిగి ఉండేవారము. ఇటువంటి కార్యాసక్తి లేకపోతే స్వరాజ్యం సంపాదించటం చాలా కష్టం. ఇక్కడి వారు స్వరాజ్య సంపాదన కోసం పాటుపడటం లేదు. స్వదేశీకి మీరు చేయగలిగినంత సహాయం చేయడం లేదు. ఇది బాధాకరమైన విషయము.

ఆంద్ర దేశములో నాయకులు ప్రజాశక్తిని కేంద్రీకరించి జనసమూహాలను శాంతముగా ఉండేటట్లు చేయవలె. ఆంధ్రదేశ ప్రజలపై నాకెంతో అభిమానమున్నది. ఈ సంగతి నేనెన్ని పర్యాయాలో రాసినాను. ఇప్పుడు కూడా ఇటువంటి అభిమానమే ఉన్నదని తిరిగి నేను చెబుతున్నాను. మనసును, తదితర శక్తులను మన స్వాధీనంలో ఉంచుకోకపోతే – దుర్జన్యంను మనం ఎదుర్కోలేము. ఈ సన్మాన సంఘం వారు, ఇక్కడి స్వచ్చంద సేవకులు, ఈ ప్రజా సమూహం శాసనోల్లంఘనకు వర్కింగ్ కమిటీ వారి అనుజ్ఞ కోరితే – మీ కోరికను అంగీకరించకూడదని నేను గట్టిగా వాదిస్తాను. ఈ సమూహంలో ఐదారుగురు దుర్జన్యానికి పూని ఉంటే ఇక్కడ రక్తం ప్రవహించి ఉండేది. వెంటనే వార్తా విలేఖరులు ఈ విషయం పత్రికల్లో వ్రాసి మనం స్వరాజ్యనిదికి అనర్హులమని నిరూపించి ఉండేవారు. ఇంత చిన్న జన సమూహంలోనే శాంతిని చేకూర్చలేకపోయినప్పుడు దేశంలో ముప్పై కోట్ల జనసమూహాన్ని ఎట్లా శాంతంగా ఉంచగలం?

అయినా దేవుడు మన పక్షాన ఉన్నాడు. దైవ సహాయం వల్లనే ఇంత పనినైనా చేయగలిగినాము. కానీ మనం దైవాన్ని నమ్మి పురుష ప్రయత్నం చేయకుంటే బుద్ది హీనులమూ, క్రుతఘ్నులమూ అవుతాము. కాబట్టి మనం మన శక్తులను కేంద్రీకరించుకోవలసి ఉన్నది. దౌర్జన్య రాహిత్యము, స్వదేశీ, హిందూ మహమ్మదీయ సఖ్యత.. మొదలైన విషయాలను గురించి నా అభిప్రాయాలు పత్రికలలో ప్రకటించడం జరిగింది. ఇక ముందు కూడా ప్రకటించడం జరుగుతుంది.

సోదరీమణులారా! మీ సోదర సోదరీమణులు మీ జిల్లా సమీపములోనే క్షామంవల్ల బాధపడుతున్నారు. మీరందరూ నూలు వడకడం బాగా నేర్చుకొని రాట్నాలను క్షామ ప్రదేశాలలో పంచిపెట్టండి.

మీరు ధనాన్ని, ఆభరణాలను కరువుతో బాధపడేవారి సహాయం కోసం ఇవ్వవలెనని తిరిగి కోరుతున్నాను.

ఇదీ చదవండి!

నేర గణాంకాలు 1992

జిల్లాల వారీ నేర గణాంకాలు 2008

కడప జిల్లా నేర గణాంకాలు 2008 2008 నాటి కడప జిల్లా నేర గణాంకాలు మరియు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో …

ఒక వ్యాఖ్య

  1. Cuddapah lo Gandhiji upanysa bhaagaalanu kallaku kattincharu.Abhinandanalu!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: