హోమ్ » పదకోశం » గోవాకు లేదా గొవాకు అనే పదానికి అర్థాలు, వివరణలు
గోవాకు

గోవాకు లేదా గొవాకు అనే పదానికి అర్థాలు, వివరణలు

కడప జిల్లాలో వాడుకలో ఉన్న గోవాకు లేదా గొవాకు అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘గోవాకు’ in Telugu Language.

గోవాకు లేదా గొవాకు :

నామవాచకం (noun), ఏకవచనం (Singular)

  • గోగాకు
  • గోగ్గూర
  • పుండుకూర
  • గోంగూర (కోస్తా వాడుక)
  • పుంటి కూర (తెలంగాణా వాడుక)
  • జనపకూర (ఉత్తరాంధ్ర వాడుక)
  • leaves of hibiscus cannabinus (ఆంగ్లం)

వివరణ :

గొవాకు లేదా గోగాకు అనేది కూర కోసం ఉపయోగించే గోగు చెట్టు ఆకు. కడప జిల్లాలో ‘గోవాకు’ లేదా గొవాకు లేదా అనే పదాన్ని గోంగూర అనే పదానికి సమానార్థకంగా వాడతారు. గోగు చెట్టు ఆకులను సేకరించి వాటితో కురాకు తయారు చేస్తారు.

వాడుక :

  • గోవాకు కారెంలో ఉప్పు ఎక్కువైంది
  • వాఁటితోపాటు జాలాట్లో నాలుగు టమాటాచెట్లు, గెనాల మింద గోగాకు, చిన్న పెడలో మిరపజెట్లు గూడా.
  • మిరప సేలో గొవాకు సెట్లు

ఇదీ చదవండి!

పారకోల

పారకోల లేదా పారకాల అనే పదానికి అర్థాలు, వివరణలు

కడప జిల్లాలో వాడుకలో ఉన్న పారకోల లేదా పారకాల అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: