హోమ్ » వార్తలు » ప్రత్యేక వార్తలు » జీవో 120కి నిరసనగా శనివారం తిరుపతిలో ధర్నా

జీవో 120కి నిరసనగా శనివారం తిరుపతిలో ధర్నా

సీమ విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం

కడప: శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాల ప్రవేశాలలో రాయలసీమ విద్యార్థులకు అన్యాయం చేస్తూ కోస్తా వారికి ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 120కి నిరసనగా శనివారం (సెప్టెంబర్ 5న) తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ధర్నా నిర్వహించనున్నట్లు గ్రేటర్ రాయలసీమ పోరాట సమితి, రాయలసీమ సామాజిక మాధ్యమాల ఫోరంలు ఒక ప్రకటనలో తెలియచేశాయి.

రాయలసీమ విద్యార్థులకు చెందాల్సిన 107 సీట్లను 13 జిల్లాల వారికి కేటాయిస్తూ ప్రభుత్వం ఏర్పడ్డ రెండు నెలలలోపే జీవో ఇవ్వడం దుర్మార్గమని, అర్హులైన రాయలసీమ విద్యార్తినుల పాలిట ఈ జీవో శాపంగా మారిందని వారు ఆక్షేపించారు. రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రి అన్యాయంగా ఇటువంటి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నా ఇదే ప్రాంతానికి చెందిన పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ప్రతిపక్షనేత జగన్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు కానీ, ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు కానీ ప్రశ్నించకుండా మిన్నకుండిపోయారన్నారు.

చదవండి :  జీవో 120 ధర్నాపైన వార్తాపత్రికల కవరేజీ తీరుతెన్నులు

ఈ నేపధ్యంలో రాయలసీమ విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు గ్రేటర్ రాయలసీమ పోరాట సమితి, రాయలసీమ సామాజిక మాధ్యమాల ఫోరంల అధ్వర్యంలో ధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు రెండు సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాల నుండి విద్యార్థులు, మేధావులు, ప్రజలు ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ధర్నాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9052667668, 9849047880, 9490493436 నెంబర్లలో సంప్రదించవచ్చు.

ఇదీ చదవండి!

సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన

భారీగా మోహరించి…చెక్ పోస్టులు పెట్టి … రోడ్లను తవ్వి…

ఆటంకాలు దాటుకొని అలుగుకు శంకుస్థాపన నిర్భందాలు దాటుకుని వేలాదిగా తరలి వచ్చిన జనం అడుగడుగునా అడ్డంకులు కల్పించిన ప్రభుత్వం సిద్దేశ్వరం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: