హోమ్ » వార్తలు » రేపు వేంపల్లెలో ‘తలుగు’ పుస్తకావిష్కరణ
talugu

రేపు వేంపల్లెలో ‘తలుగు’ పుస్తకావిష్కరణ

కడప: వేంపల్లెలో బేస్తవారం (ఫిబ్రవరి 5వ తేదీన) ‘వేంపల్లె షరీఫ్’ రాసిన ‘తలుగు’ కథ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. లిటిల్‌ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో 5వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో  కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, కథారచయిత, శాసనమండలి సభ్యుడు షేక్ హుసేన్, కర్నూలుకు చెందిన కథా రచయిత హిదాయతుల్లా, ప్రముఖ కవి వెంకటకృష్ణ, కడపకు చెందిన విమర్శకుడు తవ్వా వెంకటయ్య, ప్రముఖ కథా రచయితలు తవ్వా ఓబుళరెడ్డి, దాదా హయాత్ తదితరులు హాజరు పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమంలో ‘రాయలసీమలో ముస్లిం కథాసాహిత్యం’ అనే అంశంపై ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి ప్రసంగిస్తారు.

షరీఫ్ స్వస్థలం కడప జిల్లాలోని వేంపల్లె. వీరు రాసిన ‘జుమ్మా’ కథ పలువురు విమర్శకుల ప్రశంసలు పొందింది. వీరు ఈ మధ్యే జుమ్మా పేరుతో తన కథలను సంకలనంగా వెలువరించారు. ఈ సంకలనానికి గాను వీరు కేంద్ర సాహిత్య అకాడమీ నుండి ‘యువపురస్కారం’ అందుకున్నారు.

ఇదీ చదవండి!

మురళి వూదే పాపడు

‘మురళి వూదే పాపడు’ని ఆవిష్కరించిన రమణారెడ్డి

మురళి వూదే పాపడు కథల సంపుటి ఆవిష్కరణ సామాజిక మార్పును ప్రతిబింబించే దాదా హయాత్ కథలు : సింగమనేని  ప్రొద్దుటూరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: