దూరి సూడు

దూరి సూడు దుర్గం సూడు మామా – జానపదగీతం

దూరి సూడు దుర్గం సూడు మామా
దున్నపోతుల జాడ జూడు
మైలవరమూ కట్టా మీద మామా
కన్నె పడుచుల బేరీ జూడు

అంచుఅంచుల చీరగట్టి మామా
సింతపూల రయికా తొడిగీ
కులికి కులికీ నడుస్తుంటే మామా
పడుసోల్ల గోడు జూడు ||దూరి||

కడవ సంకనబెట్టుకోని నేను
ఊరబాయికి నీళ్ళకు పొతే
కపెల దోలే సిన్నవాడు మామా
కడవనెత్తి కన్నూ గొట్టే ||దూరి||

కండ్ల కాటుక పెట్టూకోని మామా
కోమిటింటికి నేనే పొతే
కోమిటింటి శెట్టీ కొడుకు మామా
సైగా జేసి రమ్మన్నాడే ||దూరి||

చదవండి :  ఆశలే సూపిచ్చివా - వరుణా.... జానపదగీతం

కాళ్ళకు గజ్జేలూ కట్టూకోని మామా
కంసాలింటికి నేనే పొతే
కంసలన్నా చిన్నకొడుకూ మామా
కౌగిలింతాలిమ్మన్నాడే ||దూరి||

రాళ్ళ గాజులు తొడుక్కొని మామా
రోడ్డు మీదికి నేనే పొతే
రౌడిమూకలు నన్ను జూసీ మామా
ఈల వేసి గోలా జేసే ||దూరి||

– సేకరణ : భజన పుల్లయ్య

ఇదీ చదవండి!

చిన్న క్షేత్రాలనూ

చిన్న క్షేత్రాలనూ ఎదగనివ్వండి

నిన్నమొన్నటిదాకా కడప జిల్లా మొత్తానికి ప్రసిద్ధిచెందిన దేవాలయం అంటే ‘దేవుని కడప’ ఒక్కటే గుర్తొచ్చేది. ఇప్పుడు స్వదేశ్ దర్శన్ కింద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: