సై..రా నరసింహారెడ్డి – జానపదగీతం

వర్గం: వీధిగాయకుల పాట

పాడటానికి అనువైన రాగం: కాంభోజి స్వరాలు (ఆదితాళం)

పాటను సేకరించినవారు: కీ.శే. కలిమిశెట్టి మునెయ్య

సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ
నీ పేరే బంగారు కడ్డీ.. రెడ్డీ
సై.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ
నీ పేరే బంగారూ కడ్డీ..రెడ్డీ

అరెరే రాజారావు రావుబహద్దర్ నారసింహరెడ్డి
ఏయ్..రెడ్డి కాదు బంగారపు కడ్డీ.. నారసింహరెడ్డి
అరెరే.. ముల్కుల్ కట్టె సేతిలో
ఉంటే మున్నూటికి మొనగాడు
ఆ.. పెట్టి మాటలు ఏదాలూర రండి శూరులారా..

సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ
నీ పేరే బంగారూ కడ్డీ.. రెడ్డీ
సై.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ
నీ పేరే బంగారూ కడ్డీ.. రెడ్డీ

మొనగాండ్రకు రేనాటి గడ్డరా – రోషగాండ్రకూ పెద్ద పేరురా
ఆ..దానధర్మములు దండిగాసేసే – పురిటిగడ్డలో పుట్టినావురా
కల్వటామల దండదిగోరా సై – ముక్కముళ్ళ దండదిగోరా సై
ఆ..సంజామల దండదిగోరా సై – కానాల దండదిగోరా సై

చదవండి :  సీతా కళ్యాణం - హరికథ

సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ
నీ పేరే బంగారూ కడ్డీ.. రెడ్డీ
సై.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ
నీ పేరే బంగారూ కడ్డీ.. రెడ్డీ

ఆ.. గడ్డ మానమూ … రెడ్డి మానమూ తీసిన ఆ తొత్తు
హేయ్..కోయిలకుంట్లలో గొంతు కోసిరి.. ఖజాన తీసిరి
అరెరే..దొరల పేరుతో గడ్డను దోచిన ధనమంతా
ఆ పేదసాదలకు పంచినాడురా నారసింహరెడ్డి

సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ
నీ పేరే బంగారూ కడ్డీ.. రెడ్డీ
సై.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ
నీ పేరే బంగారూ కడ్డీ.. రెడ్డీ

బానిసగుండి పాశం తాగుట మేలుకాదురన్నా
పచ్చులనాగా బతికితె రెండే గింజలు మేలన్నా
ఆ..బయపడి బయపడి బతికేకంటే సావే మేలన్నా
ఈరుడు సచ్చిన జగతిలో ఎప్పుడు బతికే ఉండన్నా

చదవండి :  ఏమే రంగన పిల్లా - జానపదగీతం

సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ
నీ పేరే బంగారూ కడ్డీ.. రెడ్డీ
సై.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ
నీ పేరే బంగారూ కడ్డీ.. రెడ్డీ

గడ్డకోసమూ పాణం పోయిన సొర్గం వత్తుంది
ఈ పొద్దిదియ రేపు తదియరా నరుని పాన మోయూ
నీటిమీదను బుగ్గవంటిది నరుని శరీరము
పదపదరా తెల్లోల్ల తలలు నరుకుదాము

సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ
నీ పేరే బంగారూ కడ్డీ.. రెడ్డీ
సై.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ
నీ పేరే బంగారూ కడ్డీ.. రెడ్డీ

బుగ్గ మీసమూ దువ్వినాడు రా… నారసింహరెడ్డి
ఏయ్.. తేజిని ఎక్కి దండు ముందర నడిచినాడు రెడ్డి
అరెరే .. నొస్సం కోటను ముట్టడించెరా… నారసింహరెడ్డి
ఏయ్.. తెల్లోల్లందరి గుండెలదిరెరా దండు కదలజూచి

చదవండి :  సుక్కబొట్టు పెట్టనీడు... జానపదగీతం

సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ..
నీ పేరే బంగారూ కడ్డీ.. రెడ్డీ
సై.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ..
నీ పేరే బంగారూ కడ్డీ.. రెడ్డీ

హేయ్.. నరసిమ్మా అని దూకినాడురా రణములోన రెడ్డి
ఏయ్… తెల్లోల్లందరి కుత్తుకలన్నీ కోసినాడు రెడ్డి
ఏయ్… కొబలీయనీ తెల్ల సర్కరును నరికెను దండంతా
ఆ.. గడ్డ కోసమూ సావో బతుకో తేల్సుకున్నరంత

సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ
నీ పేరే బంగారూ కడ్డీ.. రెడ్డీ
సై.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ
నీ పేరే బంగారూ కడ్డీ.. రెడ్డీ
సై.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ
సై.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ

(గమనిక: ఈ పాటను మునెయ్య గారి స్వరంతో పల్లవి రికార్డింగ్ కంపెనీ వారు రికార్డు చేసినారు. అది ఇప్పుడు ‘జానపద నవరత్నాలు’ పేరుతో టి-సిరీస్ వారి ద్వారా లభ్యం. )

ఇదీ చదవండి!

సుక్కబొట్టు పెట్టనీడు

సుక్కబొట్టు పెట్టనీడు… జానపదగీతం

అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు. విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు అతని సూటిపోటి మాటలు భరించలేకపోయింది.  సుక్కబొట్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: