హోమ్ » సాహిత్యం » జానపద గీతాలు » నలుగూకు రావయ్య నాదవినోదా! – జానపదగీతం

నలుగూకు రావయ్య నాదవినోదా! – జానపదగీతం

నలుగు పెట్టేటప్పుడు పెండ్లి కొడుకును వేణుగోపాలునిగా భావించి ముత్తైదువులు పాడే పాట ఇది…

వర్గం: నలుగు పాట

నలుగూకు రావయ్య నాదవినోదా
వేగామె రావయ్య వేణూగోపాల ||నలుగూకు||

సూరి గన్నెరి పూలు సూసకము కట్టించి
సుందరుడ నాచేత సూసకమందుకో ||నలుగూకు||

సన్నమల్లెలు దెచ్చి సరమూ కట్టించి
సరసూడ నాచేత సరమందవయ్య ||నలుగూకు||

చెండుపూలూ దెచ్చి చెండు గుట్టించి
చెందురుడ నాచేత చెండందువయ్య ||నలుగూకు||

సిరిచందనపు చెక్క గంధము తీయించి
కామూడ నాచేత గంధము అందుకో ||నలుగూకు||

జాజికాయ జాపత్రి మడుపె చుట్టించి
మన్మధుడ నాచేత మడువందవయ్య ||నలుగూకు||

నలుగూకు రావయ్య నాదవినోదా
వేగామె రావయ్య వేణూగోపాల

పాడినవారు: కల్లమడి కమలమ్మ, నాగసముద్రం, గుత్తి తాలూకా, అనంతపురం జిల్లా

ఇదీ చదవండి!

అందమైన దాన

అందమైన దాన … జానపద గీతం

అందమైన దాన,, సందమామ లాంటి దాన నీ అందమంతా సూసి నేను వాలిపోయాను పొద్దుటూరు లోనా పట్టు సీరలంగడి నాది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: