పట్టిసీమ మనకోసమేనా? : 1

సన్నివేశం 1: ఈ మధ్య ఒక రోజు (సోమవారం అని గుర్తు) కడప జిల్లాలో తెలుగుదేశం నేతలందరూ ఒకేసారి మేల్కొన్నారు. మెలకువ రాగానే అంతా తమ అనుచరగణాన్ని వెంటేసుకొని పులివెందుల వైపు పరిగెత్తారు. పొద్దున్నే పులివెందుల పట్టణమంతా పచ్చ జెండాలూ, పచ్చ కండువాలు – పూల అంగళ్ళ కూడలి వద్ద పూలమ్ముకునే వాళ్ళు హాశ్చర్యపోయేంతగా!

పొద్దున్నే పూలు కొనటానికి వచ్చిన ఒక పల్లెటూరి రైతు ‘ఏంటీ పసుపు పరిమళాల సందడి?’ అని అడిగేడుట. అందుకు ఆ పూలమ్మే ఆయన ‘మనకు గోదారి నీళ్ళు తెప్పిచ్చే దాని కోసం తెదేపా వాళ్ళు వీధుల్లో తిరుగబోతున్నారు’ అని చెప్పేడుట. ఇంతవరకూ ‘కృష్ణా నీళ్ళు తెప్పిస్తాం – పులివెందుల దప్పిక తీరుస్తాం’ అని తెదేపా వాళ్ళు చెప్పిన మాటలను బుర్రలో పెట్టుకున్న ఆ రైతు మళ్ళీ ఆ పూలాయనను అడిగేడుట ‘అన్నా కృష్ణా నీళ్ళు కదా! గోదారి నీళ్ళు అంటావేమిటీ’ అనీ. ‘అదంతా నాకు తెల్దు. నిన్న ఈడ ఎవరో మాటాడుకుంటే వింటిని. పొద్దున్న వచ్చిన పసుపు చొక్కాయన కూడా అదే మాట చెప్పిండు’ అని రోంత అసహనం వ్యక్తం చేసేడుట ఆ పూలాయన. అయినా నాకెందుకొచ్చిన గోలరా బాబూ అనుకున్న ఆ రైతన్న పూలు కొనుక్కుని ఇంటి దోవ పట్టినాడట.

చదవండి :  వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత..

కొద్దిసేపటి తర్వాత ఆ కూడలికి జెండాలు పట్టుకుని ప్రదర్శనగా వచ్చిన తెదేపా నేతలు ఇలా చెప్పేరు – ‘పట్టిసీమ ద్వారా రాయలసీమకు కృష్ణా జలాలను తీసుకురావడానికి సీఎం చంద్రబాబు మహాయజ్ఞం చేస్తుంటే, విపక్ష నేత జగన్ దీనికి అడ్డుపడుతున్నారు’ అని. అంతేనా పులివెందులకు కృష్ణా జలాలు రావడం జగన్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని తేల్చేశారు.

సన్నివేశం 2: కోస్తా వారి ఆధిపత్యంలో కొనసాగుతున్న ‘తెలుగు’ మీడియాకు రాయలసీమ మీద అమాంతం ప్రేమ పొంగుకొచ్చింది. రాయలసీమ కరువు నివారణకు ‘పట్టి సీమ’ మార్గం సుగమం చేస్తుందట. పట్టిసీమ పూర్తయితే రాయలసీమకు వరద జలాలు లేదా మిగులు జలాల స్థానే నికర జలాలు దోసిల్లలోకి వస్తాయని తేల్చేశాయి. తద్వారా సీమ ముఖచిత్రం మారనుందంటూ ఊదరగొట్టాయి.

సన్నివేశం 3: మేధావులుగా చెప్పుకుంటున్న కొంతమంది పట్టిసీమ వల్ల జరుగబోయే ఉపయోగాలను గుర్తించాలంటూ సెలవిచ్చేరు. విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పట్టిసీమను చూడాలన్నారు.  

చదవండి :  కవయిత్రి మొల్ల - మా ఊరు

సన్నివేశం 4: పట్టిసీమకు సంబంధించి శాసనసభలో, బయటా విపక్షాలు, వివిధ రాజకీయ పార్టీలు అడిగిన ప్రశ్నలకు/ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానాలు చెప్పకుండా పెడచెవిన పెట్టి, రాయలసీమకు నీళ్ళు ఇవ్వటం వీళ్ళకు ఇష్టం లేదు అని దబాయించిన  గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదివారం నాడు (29 మార్చి) ‘పట్టిసీమ’కు శంకుస్థాపన చేసి  అదే రోజు సాయంత్రం సింగపూరు బయలు దేరి వెళ్లనున్నారు. ఎందుకూ అంటే ‘రాజధాని నగర బృహత్తర ప్రణాళికను గురించి చర్చించేదానికి’ అట (http://www.thehansindia.com/posts/index/2015-03-24/Chandrababu-puts-Pattiseema-before-Singapore-139498).

చంద్రాబాబు గారి నేతృత్వంలో కొనసాగుతున్న తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగు మీడియాకు, తెలుగు మేధావులకూ రాయలసీమ మీద ప్రేమ పొంగుకురావడం విశేషమైతే అది తట్టుకోలేక ఓర్వలేకపోవడం వివిధ రాజకీయ పక్షాల (వామపక్షాలు సహా) వంతయింది – స్థూలంగా ఇదీ పై నాలుగు సన్నివేశాల ద్వారా తెదేపా ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రజలకు చెప్పదలుచుకున్న విషయం. పై సన్నివేశాలలోని వాస్తవం ఏమిటో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం…

చదవండి :  మత్తులో జోగిన రాయలసీమ ముఖ్యమంత్రులు

తెదేపా చిత్తశుద్ధి

కడప జిల్లా తెదేపా నేతలకు తమ ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదంటే – కడప జిల్లా వాళ్ళను ఎవరు తిట్టిపోసినా వాళ్లకు వినపడదు. కడప జిల్లాలో ఏర్పాటు కావాల్సిన ఉక్కు పరిశ్రమ (చట్టంలో భాగంగా ఉన్నప్పటికీ) ఊసు లేకుండా పోయినా వీరికి నోరు పెగలదు. శాసనసభ సాక్షిగా కడప జిల్లాకు ఇస్తామని చెప్పి వేరే జిల్లాలో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే ఎందుకిలా అని అడగలేరు. బడ్జెట్లో సీమ సాగునీటి ప్రాజెక్టులకు డబ్బులు కేటాయించకపోతే ప్రశ్నించలేరు. కడప జిల్లా పైన జిల్లా కలెక్టర్ గా ఉన్న వ్యక్తి అవాకులూ, చవాకులూ పేలితే నోరు మెదపలేరు. పోతిరెడ్డిపాడు వెడల్పును సొంత పార్టీ నేతలు వ్యతిరేఖిస్తే కనీసం మాట మాత్రం కూడా అడ్డుచెప్పని వివేకులు. బ్రాహ్మణి ఉక్కు కర్మాగారాన్ని రద్దు చేసేందుకు పార్టీతో కోరస్ కలిపిన వీళ్ళు దానిని తిరిగి వేరే వాళ్లకు అప్పగించమనో, పునరిద్ధరించమనో చెప్పలేరు. ఇంకా చెప్పాలంటే…

(ఇంకా వుంది)

ఇదీ చదవండి!

రాయలసీమపై టీడీపీ

రాయలసీమపై టీడీపీ కక్ష తీర్చుకుంటోంది : బిజెపి

కడప : రాయలసీమ కోసం తెలుగుదేశం నేతలు దొంగ దీక్షలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్థన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: