హోమ్ » పదకోశం » బీగం లేదా బీగము అనే పదానికి అర్థాలు, వివరణలు
బీగం

బీగం లేదా బీగము అనే పదానికి అర్థాలు, వివరణలు

కడప జిల్లాలో వాడుకలో ఉన్న బీగం లేదా బీగము అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘బీగము’ in Telugu Language.

బీగం లేదా బీగము :

నామవాచకం (noun), ఏకవచనం (Singular)

  • పోల
  • తాళం
  • తాళపు చెవి
  • తాళం చెవి (కోస్తా వాడుక)
  • a Key or A padlock key (ఆంగ్లం)

బీగాలు లేదా బీగములు  (Plural)

వివరణ :

కడప జిల్లాలో బీగం లేదా బీగము అనే పదాన్ని Key అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా వాడతారు. తలుపు లోనగువానికి వేసెడు తాళము (శబ్దరత్నాకరము).

వాడుక :

  • గిరివల్లభులారా శరణాగతత్రాణ బిరుదు వేల్పుని నగరు బీగముద్రలాయె. (అన్నమాచార్య సంకీర్తన)
  • సదా నాగ బంధముతో బీగము వేయ బడి యుండును. ఎలాగో ఆ బీగము తెరిచి మీ కొరకు ఒక దివ్య నాగ మణి ని గొని వచ్చెదను. (‘నాగలోక యాగం’ సీరియల్)
  • ఇంటికి పదిలము బీగము వింటికి పదిలంబు నారి,వివరింపంగా చంటికి పదిలము రవికెయు కంటికి పదిలంబు కుందవరపు కవి చౌడప్పా ! (చౌడప్ప శతకం)
  • మర్సిపోకుండా బీగాలు తీసకరా
  • బయటికి పోయేప్పుడు బీగమేసి పో

ఇదీ చదవండి!

ఎరగడ్డ

ఎర్రగడ్డ లేదా ఎరగడ్డ లేదా యరగడ్డ అనే పదానికి అర్థాలు, వివరణలు

కడప జిల్లాలో వాడుకలో ఉన్న ఎర్రగడ్డ లేదా ఎరగడ్డ లేదా యరగడ్డ అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: