మాధవరంపోడు

మాధవరంపోడులో గబ్బిలాలకు పూజలు

మాధవరంపోడు –  కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలో కడప – రేణిగుంట రహదారిని ఆనుకుని ఉన్న ఒక  గ్రామం.

ఏంటీ ఊరు ప్రత్యేకత ? 

జిమ్మటాయిలకు (గబ్బిలాలు), వాటి ఆవాసాలైన చెట్లకు ఈ ఊరోళ్లు పూజలు చేస్తారు.

ఎందుకలా ?

గబ్బిలాలకు పూజలు చేస్తే రోగాలు తగ్గిపోతాయని, పక్షి దోషం పోతుందని మాధవరంపోడో ల్ల  నమ్మకం. ఈ నమ్మకం చుట్టుపక్కల ఊళ్లకు కూడా వ్యాపించింది.

జిమ్మటాయిలను ఎట్లా పూజిస్తారు?

  • పాలుమాలిన పిల్లోళ్లను ఆదివారం రోజున గబ్బిలాలు ఉండే చెట్టుకాడికి తీసుకొచ్చి  వాటి పెంటను ఒళ్లంతా పూసి అక్కడే స్నానాలు చేయిస్తారు .
  • బలహీనంగా ఉన్న పిల్లలకు గబ్బిలం కళేబరం, ఎముకలను పూసలు మెడలో వేస్తారు
చదవండి :  'మురళి వూదే పాపడు'ని ఆవిష్కరించిన రమణారెడ్డి

ఈ ఆచారం/నమ్మకం ఎప్పటి నుంచి ఉంది ?

సుమారుగా 30 ఏళ్ళ నుండి.

ఈ నమ్మకం వెనుక నేపథ్యం 

35 ఏళ్ల క్రితం రెండువర్గా ల మధ్య కొట్లాటలతో  మాధవరంపోడు నలిగేది. అలాంటి స్థితిలో ఊరి చివరన ఉన్న అమ్మదేవతా చెట్టుపైకి , ఊర్లోని చింత, కొబ్బరి, రావి తదితర చెట్లపైకీ గబ్బిలాలు వచ్సి  నివాసం ఏర్పరచుకున్నాయి. అప్పటి నుంచి మాధవరంపోడు గ్రామంలో గ్రామంలో కక్షలు తొలిగిపోయాయని ఊరోళ్ళ నమ్మకం.

మాధవరంపోడు

అంతేకాకుండా అప్పటి నుంచి ఊరు అభివృద్ధి బాట పట్టిందని భావించి అవి తమ దేవతా పక్షులని మాధవరంపోడో ల్లు  నమ్ముతున్నారు. గబ్బిలాలు వచ్చాకే పంటలు బాగా పండుతున్నాయని, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని, పూరి గుడిసెల్లో ఉన్నవారంతా పక్కా ఇళ్లు కట్టుకున్నారని వాళ్ళ నమ్మకం.

చదవండి :  రాచపాలెం చంద్రశేఖరరెడ్డికి కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు

సైన్సు ఏం చెబుతోంది?

గబ్బిలాలను , చెట్లను పూజించటం వల్ల రోగాలు తగ్గవు  అని.

ఈ మాధవరంపోడు  విశేషాలు మీకు ఆసక్తిని కలిగిస్తే మీరూ పోయి సూసి రావచ్చు.

మాధవరంపోడుకు ఇట్లా  చేరుకోవచ్చు :

వాయు మార్గంలో:

దగ్గరి విమానాశ్రయం: కడప (106 కి.మీ), తిరుపతి (40.8 కి.మీ), బెంగుళూరు (297కి.మీ), చెన్నై (176 కి.మీ),  హైదరాబాదు (430 కి.మీ)

రైలు మార్గంలో:

దగ్గరి రైల్వేస్టేషన్: రైల్వేకోడూరు (5.6 కి.మీ), రాజంపేట (43 కి.మీ), కడప (95 కి.మీ), ఓబులవారిపల్లె (25 కి.మీ)

చదవండి :  గవర్నర్ చేతులమీదుగా కోదండరామ కళ్యాణం

రోడ్డు మార్గంలో:

దగ్గరి బస్ స్టేషన్: రైల్వేకోడూరు (5.6 కి.మీ), రాజంపేట (43 కి.మీ)

రైల్వేకోడూరు – రాజంపేట మధ్యన తిరిగే స్టాపింగ్ ఆర్టీసీ బస్సులు, ప్యాసింజర్ ఆటోలు మాధవరంపోడులో ఆగుతాయి.

ప్రయివేటు వాహనాలలో:

బెంగుళూరు వైపు నుండి : చింతామణి, మదనపల్లి, రాయచోటి, గువ్వలచెరువు, కడప మీదుగా

చెన్నై వైపు నుండి : తిరువళ్ళూరు, ఊత్తుకోట, పుత్తూరు, రేణిగుంట, రైల్వేకోడూరు మీదుగా

హైదరాబాదు వైపు నుండి : జడ్చర్ల, కర్నూలు, నంద్యాల, మైదుకూరు, కడప, రాజంపేట మీదుగా

విజయవాడ వైపు నుండి : గుంటూరు, ఒంగోలు, కావలి, ఉదయగిరి, బద్వేలు, కడప, రాజంపేట మీదుగా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: