హోమ్ » సాహిత్యం » సంకీర్తనలు » రామభద్ర రఘువీర … అన్నమయ్య సంకీర్తన
పాదుకా పట్టాభిషేకము

రామభద్ర రఘువీర … అన్నమయ్య సంకీర్తన

సంకీర్తన:296

రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ
నామమే కామధేనువు నమో నమో॥

కౌసల్యానందవర్ధన ఘనదశరథసుత
భాసుర యజ్ఞరక్షక భరతాగ్రజ
రాసికెక్క కోదండ రచన విద్యా గురువ
వాసితో సురలు నిను వడి మెచ్చేరయ్యా॥

మారీచసుబాహు మర్దన తాటకాంతక
దారుణవీరశేఖర ధర్మపాలక
కారుణ్య రత్నాకర కాకాసుర వరద
సారెకు వేదవిదులు జయవెట్టేరయ్యా॥

సీతారమణ రాజశేఖర శిరోమణి
భూతలపుటయోధ్యాపుర నిలయా
యీతల శ్రీవేంకటాద్రి నిరవయిన రాఘవా
ఘాత నీ ప్రతాపమెల్ల కడునిండెనయ్యా॥

ఇదీ చదవండి!

annamayya

అన్నమయ్య కథ : ఐదో భాగం

అన్నమయ్య ఆలయ ప్రవేశం: అన్నమయ్య ఆదివరాహస్వామిని సేవించుకొని వేంకటేశ్వరస్వామి కోవెలకు వెళ్లాడు. పెద్ద గోపురాన్ని ఆశ్చర్యంగా చూశాడు. అక్కడ పెద్ద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: