హోమ్ » వార్తలు » ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం సీమ జిల్లాల బంద్‌

ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం సీమ జిల్లాల బంద్‌

కడప: రాయలసీమ ప్రజల చారిత్రక హక్కు అయిన రాజధానిని రెండు జిల్లాల కోస్తాంధ్రకు తరలించి సీమ ప్రజల ఆకాంక్షలను, హక్కులను ప్రభుత్వం హరిస్తున్నందుకు నిరసనగా రాయలసీమ విద్యార్థి వేదిక (ఆర్.ఎస్.ఎఫ్) గురువారం రాయలసీమ జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు వేదిక కన్వీనరు ఎం.భాస్కర్, కోకన్వీనరు దస్తగిరి, జిల్లా కన్వీనరు ప్రసాద్, వైవీయూ కన్వీనరు నాగార్జున ఓ ప్రకటన విడుదల చేశారు.

రాయలసీమలోని అన్ని పాఠశాలలు, కాలేజీలకు చెందినా విద్యార్థులు, కవులు, కళాకారులు, ప్రజలు మరియు మేధావులు బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

మూడు నెలలుగా రాజధాని కోసం రాయలసీమ ప్రజలు ఉద్యమిస్తుంటే పట్టించుకోకుండా కోస్తాంధ్రలో ఏర్పాటు చేస్తూ సీమ ప్రజలను అవమానించారన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు, పారిశ్రామిక కారిడార్, ఎయిమ్స్, పోలవరం ఇలా ప్రతి ప్రాజెక్టు కోస్తాంధ్రాకే తరలించి సీమ ప్రజలకు కన్నీళ్లు మిగుల్చుతున్నారన్నారు

ఇదీ చదవండి!

చంద్రన్నకు

చంద్రన్నకు ప్రేమతో …

చంద్రన్నకు రాయలసీమ ప్రజల బహిరంగ లేఖ మేధావీ,అత్యంత ప్రతిభావంతుడూ, సంపన్నుడూ అయిన మా రాయలసీమ ముద్దుబిడ్డకు… అన్నా! చంద్రన్నా!! మీరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: