రోజా సస్పెన్షన్

మంది బలంతో అమలౌతున్న ప్రజాస్వామ్యం

నగరి శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్ చినికి చినికి గాలివానగా మారడం తెలిసిందే. సభలో రోజా మాట్లాడిన తీరు అభ్యంతరకరమే. తను వాడిన మాటలకు సాటి సభ్యులు నొచ్చుకున్నప్పుడు క్షమాపణ చెప్పకపోవడమూ హుందాతనం కాదు. ఆమెతోబాటు అసభ్యపదజాలం వాడినవాళ్ళందరి మీదా ఒకేరకమైన చర్య తీసుకుని ఉంటే బాగుండేది. అదలా ఉంచితే, సభ్యులను అసలు ఎన్నిరోజుల వరకు సస్పెండ్ చెయ్యొచ్చు అనేదొక ప్రశ్న.

సభ్యుల సస్పెన్షన్ను ఒక సెషనుకు మాత్రమే పరిమితం చెయ్యడం వెనుక బలమైన కారణముంది. ఇది ఆయా సభ్యుల హక్కులకు సంబంధించింది కాదు. వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు చట్టసభల్లో తమ వాణిని విన్పించడానికి గల అవకాశాలకు సంబంధించింది (ఎంతమంది సభ్యులు ఆ బాధ్యతను పట్టించుకుంటున్నారు అనేది వేరే ప్రశ్న). అందుకే ఆర్నెల్లకు మించి చట్టసభల్లో ఏ స్థానమూ ఖాళీగా ఉంచరు.

చదవండి :  తప్పుదోవలో 'బస్సు ప్రయాణం'

అంతే కాదు, ఏ సభ్యుడైనా స్పీకర్ అనుమతి లేకుండా 60 రోజులకు మించి సభకు రాకుండా ఎగ్గొడితే ఆ స్థానంలో ఉపయెన్నిక జరుపుతారు. ఏ కారణం వల్లనైనా ఒక సభ్యుడు/సభ్యురాలిని ఒక సెషను కంటే ఎక్కువకాలం సస్పెండ్ చెయ్యదగ్గ కారణం ఉందని సభ భావిస్తే ఆ సభుడు/సభ్యురాలి సభ్యత్వాన్ని రద్దుచెయ్యడం ఉత్తమం. తద్వారా ఉత్పన్నమయ్యే ఉపయెన్నికకు అయ్యే ఖర్చును కూడా సదరు సభ్యుడు/సభ్యురాలి నుంచే రాబట్టవచ్చు.

అంతే తప్ప కోర్టు ఇచ్చిన తీర్పును అమలుచెయ్యవలసిన బాధ్యత ఉన్న సభలోనే ఆ కోర్టుతీర్పు అమలు కావడాన్ని పశుబలంతో అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానం. అసలు కర్ర ఉన్నవాడిదే బర్రె అన్న చందాన ఏ చర్యనైనా భుజబలంతో అడ్డుకోజూడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం.

చదవండి :  వెనుకబడిన జిల్లాల మీద ధ్యాస ఏదీ?

ఈ సందర్భంగా రాజ్యంగంలోని 193వ సెక్షన్ను ప్రస్తావించుకోవాలి. దాంట్లో ఏముందంటే…

193. If a person sits or votes as a member of the Legislative Assembly or the Legislative Council of a State … when he knows … that he is prohibited from so doing by the provisions of any law made by Parliament or the Legislature of the State, he shall be liable in respect of each day on which he so sits or votes to a penalty of five hundred rupees to be recovered as a debt due to the State.

చదవండి :  రాయలసీమకు మిగిలేదేమిటి?

ఐదువందలనేది చాలా చాలా చిన్న మొత్తం. ఆ సభ్యుడి/సభ్యురాలి ఒక నెలజీతమో సంవత్సరజీతమో ఫైనుకింద కట్టమనేలా రాజ్యాంగాన్ని సవరించవచ్చు.

–  త్రివిక్రమ్

(trivikram@kadapa.info)

ఇదీ చదవండి!

మిడిమేలపు మీడియా

పైత్యకారి పత్రికలు, మిడిమేలపు మీడియా

కడప జిల్లా విషయంలో విస్మయపరిచే తీరు పుష్కరం కిందట 2007లో ప్రొద్దుటూరికి చెందిన చదువులబాబు అనే రచయిత జిల్లాలోని అన్ని మండలాలూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: