హోమ్ » వార్తలు » ప్రత్యేక వార్తలు » వాళ్ల గులాములుగా బ్రతాకాల్సి వస్తుంది

వాళ్ల గులాములుగా బ్రతాకాల్సి వస్తుంది

హైదరాబాదు: రాయలసీమను ఎట్టి పరిస్థితిలోనూ విడదీసేందుకు అంగీకరించేది లేదని రాయలసీమ ఐకాస పేర్కొంది. సీమ చరిత్ర తెలియకుండా, ప్రజల మనోభావాలను గుర్తించకుండా, నిర్దిష్ట ఆలోచన లేకుండా చేసిన ప్రకటన ద్వారానే నేడీ పరిస్థితి నెలకొందని సమితి నేతలు అన్నారు. బుధవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఐకాస నేతలు మాట్లాడుతూ రాయల తెలంగాణ అనేది రాయల్‌సీమ ప్రజల ఉనికిని దెబ్బతీయటానికేనని తెలిపారు.

ప్రత్యేక తెలంగాణకు రాయలసీమ ఐకాస వ్యతిరేకం కాదని, పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే మేమంతా సర్కార్‌ ఆంధ్ర వాళ్లక్రింద గులాములుగా బ్రతాకాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీలో రాయలసీమ కు చెందిన ఎమ్మెల్యేలు 53 మంది మాత్రమే ఉంటారని, అదే కోస్తా ఆంధ్రలో 112 మంది ఎమ్మెల్యే లు ఉంటారని, ఒకవేళ రాయల్‌ తెలంగాణ అయినా, తెలంగాణకు చెందినవారు 119 మంది ఎమ్మెల్యేలు ఉంటారని, అలాంటప్పుడు మాకు ఎలా న్యాయం జరిగిద్దని వారు ప్రశించారు.

ఇప్పటికే రాయ లసీమ రాజధానిని పోగొట్టుకుందని, నీటిని కోల్పోయిందని, రాష్ట్ర ప్రభుత్వ రంగంలో 12 లక్షల మంది ఉద్యోగులుంటే, మాకు దక్కింది కేవలం 1.60 లక్షల ఉద్యోగాలు మాత్రమేనని, రాష్ట్ర సచివా లయంలో 3900 ఉద్యోగాలకుగాను రాయలసీమకు దక్కింది 305 ఉద్యోగాలు మాత్రమేనని, రాయలసీమ అభివృధ్దికి తోడ్పడే శ్రీబాగ్‌ ఒడంబడిక నీరు గారి పోయిందని,

ఈవిధంగా రాయలసీమ అన్ని రకాలుగా నష్టపోయిందని, ఇప్పటికైనా మేల్కొనక పోతే మాబ్రతుకు ఎడారిగా మారుతాయన్నారు. రాయలసీమనుంచి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు ఉన్నా, వారంతా వారి అభివృద్ది నే కోరుకున్నారుకాని, రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ది చేయలేదన్నారు. కనీసం రాయలసీమ అభివృద్ది కోసం, నికరజలాల నిల్వలకోసం ఒక్క ప్రాజెక్టును కూడా సాధించలేక పోయారని వారు విమర్శించారు.

కృష్టా జలాలలో మాకు వాటా ఉన్నా, దాన్ని సాధించటంలో రాయలసీమ ప్రజా ప్రతినిధులు పూర్తిగా విఫలమైయ్యారన్నారు. ముఖ్యంగా సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్న టిజి వెంకటేశ్‌, కావూరి సాంభశివరావు, లగడపాటి, రాయపాటి, మేకపాటి మొదలైన వారంతా వారి ఆస్తులు, వ్యాపారాలు, పదవులు కాపాడుకోవటా నికే చేస్తున్నారని, అంతేగాని వారి ప్రాంతాల ప్రజల పై ప్రేమతో, ఆప్రాంతాల అభివృద్దికోసం కాదని తెలిపారు. ప్రత్యేక ఆంధ్రతో సీమ దెబ్బతింటుందన్నారు.

రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం అయితే అన్ని విధాలుగా అభివృద్ది చేసుకుంటామన్నారు. ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ర్టంగా చేయటానికి అన్ని రకాల వసతులు ఉన్నాయని, రాష్ట్ర జనాభాలో 5 వంతు ఉందని, 67,299 చదరపు కిలో మీటర్ల వైశాల్యం కలిగి, దేశంలోని12 రాష్ట్రాలకంటే పె ద్దదిగా ఉందని, ఎన్నో సహజవనరులు ఉన్నాయని, బంగారు గనులు, వజ్రపు గనులు, బైరటీస్‌, యాజ్‌బెస్టాస్‌, లైమ్‌స్టోన్‌, గ్రానైట్‌స్టోన్‌, ఐరన్‌స్టోన్‌, కడప స్టోన్‌లతో పాటు, ఎర్రచందనం ఎక్కువగా లభిస్తుందని, ఎంతో అటవీ సంపద, ఎన్నొ పర్యాట క కేంద్రాలు, ప్రపంచ ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రా లు రాయల సీమలో ఉన్నాయని, 10 సంవత్సరా లలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచే విధంగా రాయల రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకుంటామన్నారు.

అందుకే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ ఐకాస చీఫ్‌ కో-కన్వీనర్‌ ఉపాధ్యక్షులు భూమన్, తమ్మడపల్లి విజయరాజ్‌, వైస్‌ ప్రసెడెంట్‌ యం. వెంకట శివారెడ్డి, తరిమెల శరత్‌ చంద్రారెడ్డి, కార్యదర్శి బొజ్జా దశరధరామిరెడ్డి, అర్జన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

రాయలసీమ జీవన్మరణ సమస్య

ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య

ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాల వినియోగంలో సమస్యలు రాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: