హోమ్ » చరిత్ర » వైఎస్ హయాంలో కడపకు దక్కినవి
వైఎస్ హయాంలో

వైఎస్ హయాంలో కడపకు దక్కినవి

వైఎస్ హయాంలో కడప అభివృద్ధి

వైఎస్‌గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.

విధి నిర్వహణలో ఉండగానే అసువులు బాసిన వైఎస్ తన అయిదేళ్ళ పరిపాలనా కాలంలో కడప జిల్లాకు మంజూరు చేసిన/చేయించిన కొన్ని అభివృద్ది పనులు ఇవే…

విద్యారంగం:

 • యోగివేమన విశ్వవిద్యాలయం
 • సిపిబ్రౌన్ భాషాపరిశోధనా కేంద్రానికి ఏటా ౩౦ లక్షల రూపాయల గ్రాంట్ ఇన్ ఎయిడ్ (విశ్వవిద్యాలయాలకు అనుసంధానించడం, ప్రస్తుతం యోవేవికి అనుబంధంగా ఉంది)
 • ప్రభుత్వ పశు వైద్య కళాశాల, ప్రొద్దుటూరు (GO Number MS 72, Dated: 18/07/2008, Dept of ANIMAL HUSBANDRY AND FISHERIES)
 • యోగి వేమన ఇంజనీరింగ్ కళాశాల, ప్రొద్దుటూరు (యోవేవి వారి సొంత కళాశాల, G.O.Ms.No.121, Dated: 21/07/2008, Dept of Higher Education)
 • ట్రిపుల్ ఐటి, ఇడుపులపాయ
 • రాజీవ్ గాంధీ వైద్య కళాశాల (రిమ్స్), కడప
 • రిమ్స్ నర్సింగ్ కళాశాల, కడప
 • రిమ్స్ దంత వైద్య కళాశాల, కడప
 • జెఎన్టియు ఇంజనీరింగ్ కళాశాల, పులివెందుల
 • ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజి, పులివెందుల (ఆచార్య ఎన్.జి.రంగా వ్యావసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాల)
 • వైఎస్ఆర్ ఉద్యాన కళాశాల (Horticulture College), అనంతరాజుపేట (రాయలసీమలోని ఏకైక ఉద్యాన కళాశాల, 06/06/2007న ప్రారంభమైంది)
 • ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు – కమలాపురం, రాయచోటి, రాజంపేట, ఓబులవారిపల్లి (GO No MS 45, Dated 10/04/2008 & RT 405, Dated: 03/05/2008)
 • Govt. College for Men, Kadapa became autonomous (the first autonomous college in Rayalaseema)
 • పదికి పైగా ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుకు అనుమతి
 • కడప నగరంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూలు ఏర్పాటు
 • కడప నగరంలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు
 • వైఎస్ వెంకటరెడ్డి మెమోరియల్ మహిళా జూనియర్ కళాశాల, పులివెందుల (ప్రయివేటు కళాశాలను ప్రభుత్వపరం చేసినారు) (GO No. MS 164, Dated: 14/08/2008, Dept of Higher Education)
 • సైనిక పాఠశాల ఏర్పాటుకు అనుమతి (వైఎస్ చనిపోయినాక అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ దీనిని చిత్తూరు జిల్లాలోని కలికిరికి తరలించినారు)
 • నియోజకవర్గానికి ఒకటి చొప్పున 11 ఆదర్శ పాఠశాలలు

పారిశ్రామిక రంగం:

 • భారతి సిమెంటు కర్మాగారం
 • దాల్మియా సిమెంటు కర్మాగారం
 • బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం (ప్రస్తుతం రద్దయింది)
 • గోవిందరాజ స్పిన్నింగ్ మిల్, పులివెందుల
 • సజ్జల పాలిమర్స్
 • యుసిఐఎల్, తుమ్మలపల్లె
 • చెన్నూరు సహకార చెక్కెర కర్మాగారం పునరుద్ధరణ (వైఎస్ చనిపోయినాక మూతపడింది)
 • రాయలసీమ తాప విద్యుత్ కేంద్రం విస్తరణ, ఈ కేంద్రానికి నీటి కొరత తీర్చడానికి బ్రహ్మం సాగర్ నుండి ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు
 • బద్వేలు సమీపంలో తోళ్ళ శుద్ది కర్మాగారం
 • కడప నగరంలో ఆం.ప్ర.పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు (ఇప్పుడు దీన్ని తిరుపతికి తరలించారు)
 • మైలవరంలో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు (ఇది వాడుకలోకి రాలేదు)

క్రీడా రంగం:

 • వైఎస్సార్ ఇండోర్ స్టేడియం
 • వైఎస్సార్ క్రీడా పాఠశాల (రాష్ట్రంలోని ఏకైక క్రీడా పాఠశాల)
 • వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం

మౌలిక సదుపాయాలు:

 • కడప విమానాశ్రయం ఏర్పాటు
 • కడప రైల్వే స్టేషన్ ఆధునీకరణ
 • కడప – బెంగుళూరు రైల్వే లైను మంజూరు
 • కడప మీదుగా చెన్నై – హైదరాబాదుల నడుమ కాచిగూడ/ఎగ్మోర్ రైలు
 • ఓబులవారిపల్లి – కృష్ణపట్నం రైల్వేలైను మంజూరు (2006). రాయలసీమ జిల్లాలను సముద్ర మార్గానికి అనుసంధానించేందుకు దోహదం చేస్తుంది.
 • కడప – పులివెందుల నాలుగు వరుసల రహదారి (జీవో నెం. MS 348, తేదీ: 03/12/2008, రోడ్లు మరియు భవనాల శాఖ)
 • నెల్లూరు – గుంతకల్ నాలుగు వరుసల రహదారి
 • కడప – కర్నూలు జాతీయ రహదారి విస్తరణ
 • కడప నగరంలో శాటిలైట్ టౌన్ షిప్, సింగపూర్ టౌన్ షిప్పులు
 • ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పెంపు (350 పడకలతో జిల్లా స్థాయి ఆసుపత్రిగా మార్పు)
 • ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి పట్టణాలలో ఆం.ప్ర. హౌసింగ్ బోర్డు/రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ నివాస సముదాయాలు
 • కడప నగరంలో రాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహం, అధునాతన సౌకర్యాలతో జిల్లా పరిషత్ సమావేశ మందిరం
 • కడప నగరంలో వైఎస్సార్ ప్రెస్ క్లబ్
 • కడప నగరంలో నూతన కలెక్టరేట్ సముదాయం
 • కడప నగరంలో బుగ్గవంక రక్షణ గోడల నిర్మాణం, రహదారుల విస్తరణ మరియు వంతెనల ఏర్పాటు
 • కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటి పట్టణాలలో బయటి రహదారుల (ఔటర్ రింగ్ రోడ్/బైపాస్ రోడ్) ఏర్పాటు
 • కడపలో రాయలసీమ జైళ్ళ శాఖ డి.ఐ.జి కార్యాలయం ఏర్పాటు
 • ప్రొద్దుటూరులో 5 ఎకరాల విస్తీర్ణంలో RTO కార్యాలయాల నిర్మాణం (GO No: RT 1552, Dated: 17/10/2008, Dept of Transports Roads & Buildings)
 • కమలాపురం, యర్రగుంట్ల, రైల్వేకోడూరు, పెనగలూరు, నాయుడువారిపల్లి, ఓబిలి గ్రామాలలో ఉర్దూ ఘర్/షాదీఖానాల నిర్మాణం (GO nos:  RT668,669 Dt: 12/11/2008 & RT 580, Dated: 29092008, మైనారిటీ సంక్షేమ శాఖ)
 • Establishment of Additional District & Sessions court at Rayachoty (GO No: MS 50, Dated: 17/04/2008, Dept of Law – Home – Courts)
 • కుందు నదిపైన ప్రొద్దుటూరు-చాగలమర్రి (వెల్లాల వద్ద), గుండ్లకుంట్ల-సత్రం, పెద్దపసుపుల-నెమళ్లదిన్నె రోడ్ల పైన హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణం (జీవో నెంబర్లు RT 1756, 1643, 509 Dept of Transports Roads & Buildings)
 • కడప నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (కోటిరెడ్డి మహిళా కళాశాల)కు అదనపు తరగతి గదులు, హాస్టల్ భవనాలు
 • ఎర్రగుంట్ల రైల్వే క్రాసింగ్ వంతెన

వ్యవసాయరంగం:

 • కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు
 • ఐజీ కార్ల్, పులివెందుల ఏర్పాటు (దీనిని ప్రభుత్వం పూర్తిగా వినియోగంలోకి తీసుకురాలేదు)
 • ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, కడప
 • మహిళా డెయిరీల ఏర్పాటు
 • యోగివేమన విశ్వవిద్యాలయ ప్రాంగణాలలో (ఇడుపులపాయ, కడప)అగ్రిసైన్సెస్ పార్క్ ఏర్పాటు (GO MS No 69, Dated: 12/03/2008, Dept of Industries and Commerce)

పర్యాటక రంగం:

 • కడప నగరం, గండికోట, గండి, ఇడుపులపాయ, ఒంటిమిట్టలలో పర్యాటక శాఖ విశ్రాంతి గృహాల (lodge/rest house/cottages) ఏర్పాటు
 • కడప, పులివెందులలో శిల్పారామాలు
 • కడప, తాళ్ళపాకలలో పర్యాటక శాఖ హోటళ్ళు
 • కడప నగర శివారులో రామకృష్ణ మఠం కోసం స్థలం కేటాయింపు
 • తాళ్ళపాక ముఖద్వారం వద్ద అన్నమయ్య విగ్రహ ఏర్పాటు
 • దేవుని కడప, గండి ఆలయాలను తితిదే పరిధిలోకి తీసుకురావటం
 • మోపూరు భైరవేశ్వర ఆలయం అభివృద్ది
 • అల్లాడుపల్లె వీరభద్ర స్వామి దేవాలయ జీర్ణోద్ధరణకు 73 లక్షల కేటాయింపు (CGF నిధుల నుండి)
 • బ్రహ్మం సాగర్ జలాశయం, దేవుని కడపలలో బోటింగ్
 • పదివేల కోట్ల వ్యయంతో గండికోట అభివృద్దికి మంత్రివర్గ నిర్ణయం (వైఎస్ మృతితో అటకెక్కింది)
 • ఇడుపులపాయలో ఎకో టూరిజం పార్కు, నెమళ్ళ పునరుత్పత్తి కేంద్రం ఏర్పాటు
 • రామేశ్వరం (ప్రొద్దుటూరు) మసీదు పునర్నిర్మాణానికి పది లక్షల గ్రాంట్ ఇన్ ఎయిడ్ (జీవో నెం. RT 756, 06/12/2008, మైనారిటీ సంక్షేమ శాఖ)

పట్టణీకరణ:

 • కడపకు నగరపాలిక హోదా
 • బద్వేలు, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, యర్రగుంట్లలకు పురపాలిక హోదా
 • రాయచోటి పట్టణానికి వెలిగల్లు జలాశయం నుండి తాగునీటి సరఫరా కోసం పైప్ లైన్ ఏర్పాటు
 • కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటిలలో రహదారుల విస్తరణ
 • కడప, ప్రొద్దుటూరు, పులివెందులల్లో భూగర్భ మురుగునీటిపారుదల వ్యవస్థ

సాగునీరు:

 • పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ
 • గండికోట జలాశయానికి (80%) నిధుల కేటాయింపు
 • పులివెందుల బ్రాంచి కెనాల్ పూర్తి
 • పిబిఆర్ జలాశయం పూర్తి
 • బ్రహ్మంసాగర్ జలాశయం పూర్తి
 • వెలిగల్లు జలాశయం పూర్తి
 • కుందు నదిపైన నక్కలదిన్నె లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఏర్పాటుకు అనుమతి
 • ఇడుపులపాయ సమీపంలోని గజ్జలరెడ్డి చెరువు పునరుద్ధరణ (GO Number RT 1130, Dated:29082008, Dept of Minor Irrigation)

ఇదీ చదవండి!

ఆరోగ్యశ్రీ

బినామీ కంపెనీ (బ్రాహ్మణి) ఆరోపణల గురించి (02 April 2008)

బ్రాహ్మణిని తన బినామీ కంపెనీగా పేర్కొంటూ తెలుగుదేశం తరపున ఆనాటి విపక్షనేత చంద్రబాబు శాసనసభలో చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి వైఎస్ ఇచ్చిన సమాధానం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం ...

3 వ్యాఖ్యలు

 1. Pl add HPS,Singapore township at kadapa and 350 beded hospital at proddatur

  • వార్తా విభాగం

   RMR గారూ,
   మీరు తెలిపిన విషయాలు జతచేయబడ్డాయి. ఒకసారి పరిశీలించండి.

 2. సుబ్బయ్య యాదవ్

  ఈ వెబ్ సైట్ చూసి చాలా సంతోషం కలిగింది. మీ ప్రయత్నం అభినందనీయం. వ్యాసం బాగా రాశారు.వైఎస్ లాంటి వ్యక్తి మరణించటం మన జిల్లాకు తీరని లోటు…:(

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: