ys birth anniversary kadapa
వైఎస్ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఆకేపాటి

జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్ జయంతి

కడప: వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతిని బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైకాపా శ్రేణులు జిల్లా వ్యాప్తంగా విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్‌లో వైఎస్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

వైఎస్ సతీమణి, వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుమార్తె షర్మిల, కోడలు వైఎస్ భారతి, అల్లుడు అనిల్‌, మేనత్త కమలమ్మ, సొదరి విమలమ్మ, సోదరుడు సుధీకర్‌రెడ్డి, చిన్నాన్న వైఎస్ పురుషోత్తంరెడ్డి, బావ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, వదిన భారతీరెడ్డి, మరదలు సౌభాగ్యమ్మ, సోదరుడు వైఎస్ మనోహర్‌రెడ్డి, సోదరుని కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఇడుపులపాయలోని ఘాట్‌లో నివాళులు అర్పించారు.

పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న విగ్రహానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైఎస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

చదవండి :  అద్వితీయ ప్రతిభాశాలి పుట్టపర్తి

కడప నగరంలో వైఎస్ జయంతిని పార్టీ శ్రేణులు నిర్వహించాయి. నగరంలోని పెద్దపోస్టాపీసు వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్ బాష, పార్టీ జిల్లా యూత్ అధ్యక్షుడు చల్లా రాజశేఖర్, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ys birth anniversary

రైల్యేకోడూరులో ఎమ్మెల్యే శ్రీనివాసులు, రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెడ్డిరెడ్డి మిధున్‌రెడ్డి, జెడ్‌పీటీసీ సభ్యురాలు రాజేశ్వరి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి వైఎస్ గెస్ట్‌లో విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తిరుపతి-రాజంపేట ప్రధాన రహదారిలో ఉన్న వైఎస్ విగ్రహానికి నిలువెత్తు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

చదవండి :  కడపకు 70 కంపెనీల కేంద్ర బలగాలు

రాజంపేటలో నిర్వహించిన వైఎస్ జయంతిలో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పాల్గొని అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాజంపేటలోని వైఎస్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, డాక్టర్ గంగిరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

బద్వేలు నియోజక వర్గంలోని మండలాల్లో మండల కన్వీనర్లు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గోపవరంలోని పాఠశాలలోని పిల్లలకు స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు సుధాకర్ ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు.

మైదుకూరులోని బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ప్రొద్దుటూరులో మైదుకూరు రోడ్డులో ఉన్న వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విఎస్‌ముక్తియార్, పార్టీ జిల్లా నాయకుడు ఈవీ సుధాకరరెడ్డి, జడ్పీటీసీ రామలక్షుమ్మ, నాయకుడు నాగేంద్ర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఎర్రగుంట్ల సమీపంలోని తిప్పలూరులో జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, గ్రామ సర్పంచ్ అంబటి కృష్ణారెడ్డి వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

చదవండి :  14వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా పద్మ విభూషణ్ డాక్టర్ వై.వి.రెడ్డి

జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు హనుమంత్‌రెడ్డి ప్రధాన రహదారిలో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. పట్టణంలోని మనోవికాస కేంద్రంలో, ఆసుపత్రిలో బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు.

రామాపురం-రాయచోటి ప్రధాన రహదారిలో ఉన్న వైఎస్ విగ్రహానికి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాయచోటి పట్టణంలో పార్టీ సీనియర్ నాయకులు చిదంబర్‌రెడ్డి, కౌన్సిలర్ ఫయాజుల్లా రహమాన్, మున్సిపల్ చైర్మన్ నషీబ్‌ఖానం బస్టాండ్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి!

అల్లరి నరేష్

కడప పెద్దదర్గాలో ‘అల్లరి’ నరేష్

కడప: కథానాయకుడు ‘అల్లరి’ నరేష్ ఈ రోజు (ఆదివారం) కడప నగరంలోని ప్రఖ్యాత అమీన్‌పీర్ దర్గాను దర్శించుకున్నారు. నరేష్ పూల చాదర్‌లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: