‘శివరామక్రిష్ణన్’కు నాయకుల నివేదనలు

అందుబాటులో భూమి

కడపలో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. రిమ్స్‌ను ఎయిమ్స్‌గా మార్చుకోవచ్చు. చెన్నై, తిరుపతి ప్రాంతాలు దగ్గరగా ఉన్నాయి. విదేశీయులు వచ్చేందుకు అనువుగా ఉంటుంది. పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. జాతీయ రహదారి, కృష్ణపట్నం ఓడరేవు, విమానాశ్రయాలు దగ్గరలోనే ఉన్నాయి. జిల్లాను అభివృద్ధి చేస్తామంటే మా పార్టీ ప్రజాప్రతినిధులందరం రాజీనామ చేసి వెళ్తాం.

– ఆదినారాయణరెడ్డి, శాసనసభ్యులు, జమ్మలమడుగు

అన్యాయం చేయొద్దు

కడపకు అన్యాయం చేయొద్దు. రాజధాని ఏర్పాటుకు అనువుగా ఉంటుంది. భూములు ఉన్నాయి. ఇదివరకే కొన్ని పరిశ్రమలున్నాయి. విమానాశ్రయం, రైల్వేలైన్, నీరు, అన్ని అందుబాటులో ఉన్నాయి. కమిటీ అన్ని వినతులను, ఇక్కడ వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి.

– రఘురామిరెడ్డి, మైదుకూరు శాసనసభ్యులు

వందేళ్ల భవిష్యత్తును..

రాష్ట్ర రాజధాని ఏర్పాటంటే వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. అందుకు 50 వేల ఎకరాలు భూమి ఉండే వెనుకబడిన ప్రాంతాన్ని ఎంచుకుంటే బాగుంటుంది. రాయలసీమ చాలా వెనుకబడి ఉంది. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. కమిటీ అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. కడపను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి.

చదవండి :  24న రిమ్స్‌లో వాక్-ఇన్-ఇంటర్వ్యూలు

– శ్రీకాంత్‌రెడ్డి, రాయచోటి శాసనసభ్యులు

కమిటీ వేయడమే కుట్ర

శ్రీబాగ్ ఒడంబడికలో చేసుకున్న ఇరుప్రాంత ఒప్పంద మేరకు ఎలాంటి చర్చలేకుండానే కర్నూలును రాజధానిని చేయాల్సిందే. అలా కాకుండా రాష్ట్ర విభజన ఉత్తర్వులోనే కర్నూలును ప్రకటించాల్సి ఉంది. కోస్తా వారి ఒత్తిళ్లకు తొలొగ్గి మోడీ ప్రభుత్వం కమిటీ వేయడమే కుట్రపూరితం. విజయవాడ- గుంటూరుల్లో రాజధాని ఏర్పాటుకు అర్హతలేదు.

– సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్టీసీ యూనియన్ నేత

కడప పేరు లేకుండా ప్రభుత్వ కుట్ర

రాష్ట్రంలో 11 సంస్థలు ఏర్పాటుకు కేంద్రం అనుమతిస్తే అందులో కడప పేరులేకుండా ప్రభుత్వం కుట్రపన్నింది. సెయిల్ ఇస్తామన్నారు. ఇప్పటికి ఆ వూసేలేదు. 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తామంటారు.. కడప మాత్రం కనిపించడంలేదు. చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అశ్రద్ధ చేస్తే తవ్విన కాలువలు కనిపించకుండా పోతాయి. ఇలానే కొనసాగితే ఉద్యమాలు ఆరంభమవుతాయి.

చదవండి :  గైర్హాజరుపై వైకాపా నేతల వివరణ

– నారాయణరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి

అభివృద్ధి అవసరం

కడపను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి. ఆరు జిల్లాలకు కడప కేంద్రంగా ఉంది. ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేసుకునేందుకు అనువైన ప్రాంతం. కమిటీ అన్నింటిని గమనించాల్సిన అవసరం ఉంది. లేదంటే రెండో రాజధానినైనా ఏర్పాటు చేయాలి. హైకోర్టు ఏర్పాటు చేసుకోవచ్చు. కొప్పర్తి దగ్గర ఆరువేల ఎకరాల ప్రభుత్వం భూమి సేకరించింది. బెంగుళూరు, చెన్నైలు దగ్గరగా ఉన్నాయి.

– లింగారెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు

రాజధానికి అనువైన ప్రాంతం

కడపను వెనుకబాటుకు గురిచేయడం మంచిదికాదు. రాజధానికి కడప అనువైన ప్రాంతం. వందేళ్లను దృష్టిలో పెట్టుకుని రాజధానిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

– నజీర్అహ్మద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు

మోసం చేయకండి

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకంటే రాయలసీమ జిల్లాలు చాలా వెనుకబడి ఉన్నాయి. అన్నింటికి అనువైన ప్రాంతాలుకూడా.. రాజధాని ఏర్పాటుకు చాలా అనువుగా ఉంటుంది. గతంలో మోసం చేసినట్లు ఇప్పుడు కూడా మోసం చేయకుండా చూడాలి.

చదవండి :  '14న బాబు విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు'

– డాక్టర్ ఓబుల్‌రెడ్డి, రాయలసీమ రాజధాని సాధన సమితి ప్రతినిధి

రాజధానితో పాటు హైకోర్టు ఏర్పాటు చేయాలి

రాజధానితో పాటు హైకోర్టు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన అన్ని వనరులు  కడపలో ఉన్నాయి.1956కు పూర్వం ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలి. రాజధానితో పాటు హైకోర్టును కూడా రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి.

– నాగరాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు

 పోగొట్టుకున్న రాజధానిని మళ్లీ ఇవ్వండి

అనాదిగా రాయలసీమ వెనుకబాటుతో ఉంది. వర్షాభావ పరిస్థితులు కరవు కాటకాలతో తల్లడిల్లుతోంది. ఈ పరిస్థితిని గమనించే అప్పట్లో సీమ జిల్లాలోని కర్నూలును రాష్ట్ర రాజధానిగా చేశారు. వెనువెంటనే రాజధాని హైదరాబాద్‌కు పోవడంవల్ల ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఆ రోజు పోగొట్టుకున్న రాజధానిని మళ్లీ ఇచ్చి సీమను ఆదుకోవాలి.

–  జయరామయ్య, రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు

ఇదీ చదవండి!

ఎదురెదురు

ఎదురెదురు ! (కథ) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

ఎదురెదురు ‘‘ఎంత ధైర్యం సార్‌ సురేష్‌కు! యాభైవేల రూపాయలు పోగొట్టుకొన్నే .. లెక్కజెయ్యకుండా పేకాటకాన్నించి లెయ్యనే లెయ్యడంట… అబ్బా … …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: