హోమ్ » సాహిత్యం » జానపద గీతాలు » సుక్కబొట్టు పెట్టనీడు… జానపదగీతం
సుక్కబొట్టు పెట్టనీడు

సుక్కబొట్టు పెట్టనీడు… జానపదగీతం

అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు. విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు అతని సూటిపోటి మాటలు భరించలేకపోయింది.  సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా, సహించలేని తన భర్తను గురించి ఆమె ఇలా చెప్తోంది…

వర్గం: జట్టిజాం పాట

పాడటానికి అనువైన రాగం: శుద్ధ సావేరి స్వరాలు (దేశాది తాళం)

సుక్కబొట్టు పెట్టనీడు
సుట్టాల సూడనీడు
ఎన్నాళ్ళు కాయిలుంటడో ఈనాకుసించ
ఎన్నాళ్ళు కాయిలుంటడో

పచ్చబొట్టు పెట్టనీడు
పసుపుసీరె కట్టనీడు
ఎన్నాళ్ళు కాయిలుంటడో ఈనాకుసించ
ఎన్నాళ్ళు కాయిలుంటడో

నల్లబొట్టు పెట్టనీడు
నలుగుర్లో తిరగనీడు
ఎన్నాళ్ళు కాయిలుంటడో ఈ నాకుసించ
ఎన్నాళ్ళు కాయిలుంటడో

అడ్డబొట్టు పెట్టనీడు
అద్దంలో సూడనీడు
ఎన్నాళ్ళు కాయిలుంటడో ఈనాకుసించ
ఎన్నాళ్ళు కాయిలుంటడో

పాటను సేకరించిన వారు: కీ.శే. కలిమిశెట్టి మునెయ్య, దొమ్మరనంద్యాల, జమ్మలమడుగు తాలూకా

ఇదీ చదవండి!

బుంగ ఖరీదివ్వరా

బుంగ ఖరీదివ్వరా పిల్లడ – జానపదగీతం

అందమైన ఆ పల్లె పిల్ల ఆకు వేసి, తమ్మ పుక్కిట పెట్టి చెంగావి రంగు సీర కట్టుకొని బుంగ తీసుకుని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: