నిడుజువ్విలో సుందర సూర్య విగ్రహం!

సూర్య విగ్రహంభారతీయ సంస్కృతిలో సూర్యారాధనకు ఉన్న ప్రాధాన్యత అమితమైనది. కోణార్క్ లోని సూర్యదేవాలయాన్ని ఇందుకు ప్రతీకగా చెప్పుకుంటాం. మన రాష్ట్రంలో ‘అరసవెల్లి’ సూర్య దేవాలయం కూడా బహుళ ప్రాచుర్యం పొందింది.

రాయలసీమలో సైతం సూర్యారాధనకు విశిష్ట ప్రాధాన్యత ఉందని చెప్పడానికి అనేక చోట్ల సూర్య దేవాలయాలు ఉన్నాయి. ‘తిరుచానూరు’లోని సూర్య నారాయణ దేవాలయం,ఉరవకొండ సమీపం లోని ‘బూదగవి’ సూర్యనారాయణ ఆలయం, భక్తుల పూజలను అందుకుంటున్నాయి.

సూర్య విగ్రహంకడప జిల్లా ఎర్రగుంట్ల సమీపంలోని “నిడుజువ్వి” లో ఈ సూర్య విగ్రహం ఉంది. అత్యంత నిపుణుడైన శిల్పి చేతి విన్యాసానికి ఈ సుందర సూర్య విగ్రహం తార్కాణంగా నిలుస్తుంది. సూర్యుడితో పాటు చాయాదేవి, సంధ్యాదేవి, రథసారథి అనూరుడి తోపాటు ఏడు గుర్రాలు ఈ శిల్పంలో అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి.

చదవండి :  ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించాలి...

తవ్వా ఓబుల్‌రెడ్డి

 

ఇదీ చదవండి!

తిరువత్తూరు

నాటి ‘తిరువత్తూరై’ నే నేటి అత్తిరాల !

*అత్తిరాల పరశురామేశ్వర ఆలయం – తమిళ పాలన *అత్తిరాలలోని పరశురామేశ్వర ఆలయం ప్రాంగణంలో గోడలపై ఏడు తమిళ శాసనాలు తంజావూరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: