అధికారిక లెక్కల ప్రకారం జిల్లా జనాభా 28, 82,469

2011 జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మంగళవారం విడుదల చేసింది. 2001తో పోల్చితే జిల్లా జనాభా వృద్ధి రేటు 10.87 శాతంగా నమోదైంది. 2001లో జిల్లా జనాభా 26,01,797 మంది ఉంటే, తాజా జనాభా లెక్కల ప్రకారం 28, 82,469 మంది ఉన్నారు. వీరిలో 14,51,777మంది పురుషులు, 14,30,692 మంది స్త్రీలు ఉన్నారు. అంటే స్త్రీ, పురుష జనాభా నిష్పత్తి పోల్చితే స్త్రీల కంటే 21085మంది పురుషులు అధికంగా ఉన్నారు. అయితే 2001తో పోల్చితే జనాభా వృద్ధిరేటు గణనీయంగా తగ్గింది. 1991కి 2001కి 14.78 శాతం జనాభా పెరిగింది. అయితే 2001తో పోల్చితే ప్రస్తుతం 10.87 శాతం మాత్రమే పెరిగింది.census2011అంటే 2001కి ఇప్పటికీ జనాభా వృద్ధి రేటు 3.91శాతం తగ్గింది. జనసాంద్రత మాత్రం పెరిగింది.

చదవండి :  మన జిల్లా జనాభా 28,84,524

2001లో చదరపు కి లోమీటరుకు 169 మంది ఉంటే, ప్రస్తుతం 188 మంది ఉన్నారు. అంటే పదేళ్లలో చదరపు కిలోమీటరుకు 19 మంది పెరిగారు. మొత్తం జనాభాలో 19,03,337 మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. తక్కిన 9,79,132 మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. అలాగే తాజా జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో 4,65,794 మంది ఎస్సీలు ఉన్నారు. 75,886 మంది ఎస్టీలు ఉన్నారు. జిల్లాలో 7,06,204 కుటుంబాలు ఉన్నాయి. ఇందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో 4,77,712, అర్బన్ ప్రాంతాల్లో 2,28,492 కుటుంబాలు నమోదయ్యాయి.

చదవండి :  మన జిల్లా జనాభా 28,84,524

పెరిగిన అక్షరాస్యత :

పదేళ్లతో పోల్చితే అక్ష్యరాస్యత శాతం గణనీయంగా పెరిగింది. 2001తో పోల్చితే 5.05 శాతం పెరిగింది. దీన్నిబట్టే ప్రజలు తమ పిల్లలను చదివించుకోవాలని ఎంత తాపత్రయ పడుతున్నారో ఇట్టే తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 65.90 శాతం, పట్టణ ప్రాంతాల్లో 34.10 శాతం అక్షరాస్యులు ఉన్నారు. మహిళల అక్షరాస్యత కూడా పెరిగింది. మొత్తం జనాభాలో 17,45,178మంది అక్షరాస్యులు ఉన్నారు.

వీరిలో 9,94,699మంది పురుషులు, 7,22,067మంది స్త్రీలు ఉన్నారు. అంటే స్త్రీలతో పోల్చితే పురుషులే అధిక శాతం అక్షరాస్యులుగా ఉన్నారు. తక్కిన 11,65,703మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. నిరక్షరాస్యుల్లో 4,57,078మంది పురుషులు, 7,08,625 లక్షల మంది మహిళలు ఉన్నారు. నిరక్షరాస్యుల్లో పురుషులతో పోల్చితే 2,51,547మంది మహిళలు అధికంగా నిరక్షరాస్యులు ఉన్నారు. దీంతో పాటు మొత్తం జనాభాలో 48 శాతం మంది కూలీలుగానే జీవిస్తున్నారు. 13,20,404 మంది కూలీలు జిల్లాలో ఉన్నారు.

చదవండి :  మన జిల్లా జనాభా 28,84,524

తగ్గిన చిన్న పిల్లల వృద్ధి రేటు:

తాజా లెక్కల ప్రకారం ఆరేళ్లలోపు వయస్సు ఉన్న చిన్నపిల్లల వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది. 2001లో 3,40,663 మంది చిన్నపిల్లలు ఉంటే, ప్రస్తుతం 3,13,455మంది చిన్నపిల్లలు ఉన్నారు. వీరిలో 1,63,371మంది మగపిల్లలు ఉండగా, 1,50,084మంది ఆడపిల్లలు ఉన్నారు. అంటే బాలుర నిష్పత్తి 11.23 శాతం ఉంటే, బాలికల నిష్పత్తి 10.49 శాతంగా ఉంది. 0.45 శాతం బాలికల నిష్పత్తి తక్కువగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: