జులై 2న కడప విమానాశ్రయం ప్రారంభం కానుందా?

కడప విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించి ఈనాడు దినపత్రిక ఇవాల్టి కడప టాబ్లాయిడ్లో ఒక కధనాన్ని ప్రచురించింది. ఆ కధనం ప్రకారం …

జులై 2న కడప విమానాశ్రయంలో విమానాలు దిగనున్నాయి. ఢిల్లీ అధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. విమానాశ్రయ సంబంధిత ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రారంభ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.

ఇదివరకు కూడా ఈనాడు, సాక్షి దినపత్రికలు ఇదే మాదిరి కధనాలను చాలా సార్లు ప్రచురించాయి. గత సంవత్సరం ఆగస్టులో, మార్చిలో సైతం ఇలాంటి వార్తలు వెలువడ్డాయి. కనీసం ఈ కధనమైనా వాస్తవరూపు దాల్చాలని కోరుకుందాం.

అనేక సార్లు విమానశ్రయం ప్రారంభం అవుతోంది అని కధనాలు ప్రచురించిన మన పత్రికలూ… జరుగుతున్న తీవ్ర జాప్యం పైన, అందుకు గల కారణాలపైన కూడా కదనాలు వేస్తే బాగుంటుంది కదా!

2009లోనే దాదాపుగా విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ పూర్తి అయ్యాయి. వైఎస్ మరణించటంతో తరువాతి ప్రభుత్వాలు, అధికారులు విమానాశ్రయంపైన శ్రద్ధ పెట్టలేదు.

ఇంకేముంది విమానయాన మంత్రిత్వ శాఖ వారూ… ఏర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఈ విమానాశ్రయం విషయం అలవి కాని నిర్లిప్తత ప్రదర్శించారు. మిగిలి ఉన్న ప్యాచ్ వర్కులు, విద్యుదీకరణ పనులు పూర్తి చేయటానికి సంవత్సరాలు తీసుకున్నారు.

2009 నుండి 2012 వరకూ కూడా అతి నెమ్మదిగా పనులు చేసేశారు. ఆ తరువాతనైతే ఒక్కో పనికీ ఒక్కోసారి టెండర్ పిలిచారు. ఉదాహరణకి 2012 ఏప్రిల్ లో టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. తరువాత అదే సంవత్సరం జూన్ లో ఏసీ ల కోసం, ఆగస్టులో ఆఫీసు ఫర్నీచర్ కోసం,  విమానాశ్రయ నిర్వహణ కోసం డిసెంబర్ లో టెండర్లు పిలిచారు.

చదవండి :  27న కడప జిల్లా భవిష్యత్ పై సదస్సు

వీటిలో కొన్నిటికి అన్నీ ఒకేసారి కలిపి టెండర్లు పిలిచి ఉండొచ్చు. ఎందుకనో ఏఏఐ వారు అనేకమార్లు అనేకమైన టెండర్లు పిలిచారు. ఇలా టెండర్ల కారణంగా ఒక్కో పనీ పూర్తవటానికి చాలా సమయమే పట్టిందీ.

2012 నుండి కడప విమ్మనాశ్రయం కోసం పిలిచిన టెండర్ల జాబితా చూడండి (చివర రూపాయలలో సూచించినది టెండరు పిలిచిన పని విలువ):

19-Jun-14 – Miscellaneous civil works at various locations at Kadapa Airport – 14.90 Lacs INR

18-Jun-14 – Construction of New Prefabricated Terminal Building, Fire Station cum Control Tower and Allied Works at Kadapa Airport SH : Bituminous works for car park & approach road to ATC (Risk & Cost) 46.99 Lacs INR

13-Jun-14 – Providing and fixing false flooring in control tower at Kadapa Airport  1.33 Lacs INR

28-Mar-14 – Operation and Maintenance of Electrical and Mechanical Insallations at Kadapa Airport  1,29,579 INR

చదవండి :  హృదయమున్న విమర్శకుడు - రారా!

21-Feb-14 – Permission for Development /Maintenance/ Beautification / Landscaping of Lawn , Garden, Islands etc. in front/around Terminal Building and at entry of Kadapa Airport      –

18-Feb-14 – Providing and Fixing informatory sign Boards at various locations in Kadapa Airport – 613000 INR

12-Feb-14 – Providing False Flooring of control tower area at Kadapa Airport.  567300 INR

24-Jan-14 – M/R to Runway, Taxiways & Apron at Kadapa Airport during 2013-14. SH: Clearing of bushes and grasses in and around the basic strip of runway at Kadapa Airport – 252772.00 INR

03-Apr-13 – Construction of NDB building at Kadapa Airport. SH: civil works – 8.17 Lacs INR

03-Apr-13 – Shifting of 5KVA D/G set from Rajahmundry Airport and ITC at Kadapa Airport     –

02-Apr-13 – Construction of NDB Building at Kadapa Airport SH: Electrical Works –  722951 INR

చదవండి :  ఎండాకాలమొచ్చింది!

20-Mar-13 – Providing chain link fencing around ATC cum Fire Station, Sub station and HT Yard at Kadapa Airport – 22.64 Lacs INR

25-Feb-13- Supply and Installation of Computers and Peripherals at Kadapa Airport –      –

03-Dec-12 – Annual Maintenance Contract of E&M Installations at Kadapa Airport – 230064 INR

17-Oct-12 – Providing secretarial & techncail services to Engineering Directorate at Kadapa Airport – 79166.00 INR

10-Aug-12 – Procurement of Office Furniture for Kadapa Airport – 1582505 INR

11-Jun-12 – SITC of Split/Cassette Air conditioners / water coolers in ATC building at Kadapa Airport –  2108630.00 Lacs INR

04-Jun-12  – Provision of Hard standing around ATC cum Fire station at Kadapa Airport – 101.50 Lacs INR

27-Apr-12 – Construction of new fabricated terminal building fire station cum control and alied works sH: Provision of internal signages – 577952 INR

ఇదీ చదవండి!

బుగ్గవంక

బుగ్గవంక రిజర్వాయర్ సొగసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: