కూల్‌డ్రింక్స్ వల్ల అనారోగ్య సమస్యలు

కడప: జనవిజ్ఞానవేదిక కడప జిల్లా కమిటీ ప్రచురించిన ‘కూల్‌డ్రింక్స్ మానేద్దాం.. సహజ పానీయాలే తాగుదాం’ అన్న కరపత్రాలను ఇన్‌ఛార్జి జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి అరుణ సులోచనాదేవి శుక్రవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషక విలువలు లేని, అనారోగ్య సమస్యలు సృష్టించే శీతల పానీయాలను తాగడం మానేయడం మంచిదన్నారు. శీతల పానీయాల్లో అదనపు క్యాలరీలు స్థూలకాయానికి దారితీస్తాయన్నారు. వాటిని ఎక్కువకాలం తాగితే మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువన్నారు. చిన్నారులు శీతలపానీయాలు తాగకుండా తల్లిదండ్రులు నిరుత్సాహపరచాలని సూచించారు.

చదవండి :  జేసీ దివాకర్‌రెడ్డికి, పులివెందులకు ఉన్న సంబంధం...

జవివే జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాధరెడ్డి మాట్లాడుతూ నిమ్మరసం, చెరకురసం, మసాల మజ్జిగ, కొబ్బరినీళ్లు, గంజితో షర్బత్, రాగి అంబలి, వేసవి పానకం వంటి సహజ పానీయాలు తాగాలని సూచించారు. ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా జిల్లాలోని 30 మండలాల్లో ప్రచారం నిర్వహించనున్నామన్నారు.

కరపత్రమిదే: cool drinks

మొదటి పుట

cool drinks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: