ఆ.. మాటలంటదే కోడిపిల్ల…! – జానపదగీతం

కోడి పిల్లో… అబ్బో కోడి పిల్లా..
ఆ మాటలంటదే కోడిపిల్ల

ఆ.. మాటలంటదే
ఆ..లాగనంటదే
ఆ..మైన అంటదే
ఆ.. లయ్యబడ్తదే కోడిపిల్ల!

కోయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి
కైలాసం నేనూ పోయినానంటదే
ఆ మాటలంటదే కోడిపిల్ల!!

దిబ్బమీదికొంచబోయి …
బొచ్చు గిచ్చు ఈకుతాంటే (౩)
అహా.. సిలంకూరి సిన్నప్ప.. శవరం సేసినానంటదే (2)

ఆ మాటలంటదే
ఆ..లాగనంటదే
ఆ మైన అంటదే
ఆ లయబడ్తదే కోడిపిల్ల!

కోయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి
కైలాసం నేనూ పోయినానంటదే
ఆ మాటలంటదే కోడిపిల్ల!!

పోయ్యికాడికొంచబోయి తిప్పి తిప్పి కాలుచ్చాంటే (2)
ఆహ … సాకిరేవు పొయి కాడ సలిమంటలంటదే

చదవండి :  నీళ్ళకు బోర తిమ్మ - జానపదగీతం

ఆ మాటలంటదే
ఆ..లాగనంటదే
ఆ మైన అంటదే
ఆ లయ్యబడ్తదే కోడిపిల్ల!

కొయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి
కైలాసం నేనూ పోయినానంటదే
ఆ మాటలంటదే కోడిపిల్ల!!

మిద్దెపక్కకొంచబోయి..
రుద్ది రుద్ది కడుగుతాంటే
యమ్మ కాశీ గంగలోన జలకమాడతినన్నదే

ఆ మాటలంటదే
ఆ..లాగనంటదే
ఆ మైన అంటదే
ఆ లయబడ్తదే కోడిపిల్ల!

కొయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి
కైలాసం నేనూ పోయినానంటదే
ఆ మాటలంటదే కోడిపిల్ల!!

మొద్దుమీదికి తీసకబొయ్యి
తుంటల్గింటల్ నరుకుతాంటే (2)
యమ్మ కోడిపందెం ఆటగాడు.. ఆరె జివిరెనన్నదే

చదవండి :  ఆశలే సూపిచ్చివా - వరుణా.... జానపదగీతం

ఆ మాటలంటదే
ఆ..లాగనంటదే
ఆ మైన అంటదే
ఆ లయ్యబడ్తదే కోడిపిల్ల!

కొయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి
కైలాసం నేనూ..పోయినానంటదే
ఆ మాటలంటదే కోడిపిల్ల!!

మీర్యాలు… గీర్యాలు
ఆహ మీర్యాలు…మిరపకాయలు
మీర్యాలు… గీర్యాలు
మసాల నూరుతాంటే (3)
యమ్మ పునుగు జవ్వాది సెంటు పూసుకుంటానంటదే

ఆ..మాటలంటదే
ఆ..లాగనంటదే
ఆ..మైన అంటదే
ఆ..లయ్యబడ్తదే కోడిపిల్ల!

కోయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి
కైలాసం నేనూ పోయినానంటదే
ఆ మాటలంటదే కోడిపిల్ల!!

ఒక్కా గంటేడు కూర
కూటిపైన పోసుకుంటే… బువ్వపైన పోసుకుంటే (2)
యమ్మ మల్లెపరుగు పైన నేను పండుకున్న్యానంటదే

చదవండి :  దొరవారి నరసింహ్వరెడ్డి! - జానపదగీతం

ఆ..మాటలంటదే
ఆ..లాగనంటదే
ఆ..మైన అంటదే
ఆ..లయ్యబడ్తదే కోడిపిల్ల!

కోయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి
కైలాసం నేనూ పోయినానంటదే
ఆ మాటలంటదే కోడిపిల్ల!!

ఎంకలన్ని కొంచబోయి దిబ్బమీద పోచ్చాంటే (2)
అదుగో నాదొక్కటి – వైకుంఠమన్నదే

ఆ..మాటలంటదే
ఆ..లాగనంటదే
ఆ..మైన అంటదే
ఆ..లయ్యబడ్తదే కోడిపిల్ల!

కోయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి
కైలాసం నేనూ పోయినానంటదే
ఆ మాటలంటదే కోడిపిల్ల!!
అహ ఆ లయ్యబడ్తదే కోడిపిల్ల
అహ ఆ మాటలంటదే కోడిపిల్ల

పాటను సేకరించిన వారు: కీ.శే. కలిమిశెట్టి మునెయ్య (దొమ్మర నంద్యాల)

ఇదీ చదవండి!

కల్లు గుడిసె

కల్లు గుడిసెల కాడ – జానపదగీతం

వాడు వ్యసనాలకు బానిసై చెడ తిరిగినాడు. ఇల్లు మరిచినాడు. ఇల్లాలిని మరిచినాడు. తాగుడుకు బానిసైనాడు. చివరకు అన్నీ పోగొట్టుకుని చతికిల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: