ఈ పొద్దు మాయిటాల జమ్మలమడుగుకు బాబు

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు జమ్మలమడుగులో బుధవారం సాయంత్రం జరిగే రోడ్‌షోలో పాల్గొంటున్నారు. ఆయన పర్యటన వివరాలను జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి వివరించారు.

సాయంత్రం 3.30 గంటలకు పీఆర్ హైస్కూలులో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చంద్రబాబు హెలికాఫ్టర్‌లో చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి నీళ్లట్యాంకు వద్ద నుంచి రోడ్‌షో ప్రారంభం అవుతుంది. పాత బస్టాండు, మార్కెట్‌వీధి, మెయిన్‌బజార్, అమ్మవారిశాల వీధి, పలగాడి వీధి, తేరు రోడ్డు, పెద్దపసుపుల జంక్షన్, సంజాముల మోటు, ఎస్‌బీఐ ద్వారా పాత బస్టాండు చేరుకుంటారు.

చదవండి :  జిల్లా అభివృద్ధికి పోరుబాటే శరణ్యం: అఖిలపక్షం

అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పీఆర్ హైస్కూల్లోని హెలిప్యాడ్ వద్దకు సాయంత్రం 5.15 గంటలకు చేరుకొని తిరుపతిలో జరిగే మోదీ సభకు బయల్దేరి వెళ్తారు.

బాబు  రోడ్‌షో నేపధ్యంలో జమ్మలమడుగు పట్టణంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఆయా రూట్లలో ప్రయాణించే ప్రజలు షో సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లడం లేదా షో  ముగిసే వరకు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది!

ఇదీ చదవండి!

గండికోట కావ్యం

తొలి ఆధునిక క్షేత్రప్రశస్తి కావ్యం – ‘గండికోట’ – మొదటి భాగం

గండికోట కావ్యం సమీక్ష తెలుగులో ఆధునిక క్షేత్రప్రశస్తి కావ్యాలు స్వాతంత్య్రోద్యమ కాలంలోనూ, ఆ తర్వాత చాలా వచ్చాయి. వీటిని చారిత్రక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: