కడప జిల్లాలో వాడుకలో ఉన్న తాపలు అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms of the word ‘తాపలు‘ in Telugu Language.
తాపలు :
నామవాచకం (noun), బహువచనం (plural)
- మెట్లు
- అంచీలు
- చీడీలు
- పాంటికెలు
- మెటికలు
- Stairs or Steps (ఆంగ్లం)
- सीढ़ियों (హిందీ)
వివరణ :
కడప జిల్లాలో తాపలు అనే పదాన్ని stairs అనే ఇంగ్లీషు పదానికి సమానార్థకంగా వాడతారు. దీనినే కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ‘మెటికలు’ అని కూడా వ్యవహరిస్తారు. కోస్తా ప్రాంతంలో ‘మెట్లు’ అని తెలంగాణా ప్రాంతంలో ‘అంచీలు’ అని వ్యవహరిస్తారు.
వాడుక :
- తాపలు చూసుకుని ఎక్కండి
- ఎత్తైన తాపలు
- వాడు తాపలెక్కుతూ పడినాడు
తాప :
నామవాచకం (noun), ఏకవచనం(Singular)
- మెట్టు (కోస్తా మాండలికం)
- ప్రతి సంవత్సరం [తెలంగాణ మాండలికం]
- అంచీ
- చీడీ
- పాంటికె
- నిచ్చెన
- మెటిక
- Stair or Step (ఆంగ్లం)
-
सीढ़िय (హిందీ)