పాలెగాళ్ల పాలనకు సజీవ సాక్ష్యం “దుర్గం కోట “

పులివెందుల: రాజులు పోయారు. రాజ్యాలూ పోయాయి. కాని వారి నిర్మించిన కట్టడాలు మాత్రం మనకు సజీవ సాక్ష్యాలు గా కనిపిస్తాయి. అప్పట్లోనే కారడవుల్లో విశాలమైన కోటలు నిర్మించారు. కానీ వాటి గురించి నేడు పట్టించుకొన్ననాధుడే లేడు. కాల గర్భంలో ఒక్కొక్కటే కలసి పోతున్నాయి. ఈ పురాతన కట్టడాలు ఉన్న ప్రాంతాలను పర్యాట కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే ప్రజలు కొంత వరకైనా వీటి పట్ల మక్కువ పెరిగే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం. కట్టడాలూ బాగుపడతాయి…

చారిత్రక కట్టడాలు.. పురాతనమైన కోటల ు శిధిలావస్థకు చేరాయి. దట్టమైన అటవీ ప్రాంతం, దండకారణ్యాలలో కోటల నిర్మాణం కనిపిస్తుంది. వీటి గురించి పట్టించుకునే నాధుడు కరువైపోవడంతో వాటి స్వరూపాలే మారాయి కేవలం శిధిలావస్థకు చేరిన మొండి గోడలు దర్శనమిస్తాయి. పర్యాటక క్షేత్రాలు వెలసిల్లాల్సిన ప్రాచీన కోటలు, వాటి కట్టడాలు గుర్తిపట్టని స్థితికి చేరాయి. అటువంటి వాటిలో దుర్గం కోట, శత్రుదుర్బేద్యమైన కోటలా కనిపిస్తుంది. పులివెందుల పట్టణానికి సుమారు 15కిలోమీటర్ల దూరంలో పాల కొండలపైన ఈ కోటను నిర్మించారు. ఇప్పటికీ అలనాటి పాలెగాళ్ల పాలనకు ఈ దుర్గం కోట సజీవ సాక్ష్యంగా నిలిచింది. సీనియర్‌ పాత్రికేయులు, రచయిత మరకా సూర్యనారాయణరెడ్డి, మైదుకూరు పంచాయతీ కార్యదర్శి బి మల్లికార్జునరెడ్డిలు పర్యటించి, కోటపై అధ్యయనం చేశారు. దుర్గం కోట వైభవాన్ని చరిత్ర ఆధారంగా వారు విశదీకరించారు. చరిత్ర పూర్వాపరాల వివరాలిలావున్నాయి రాయలసీమలో బ్రిటిష్‌ పాల ప్రారంభమైన తొలిదినాల వరకు సుమారు 80మంది పాలెగాళ్లు పాలన సాగించారు. ఈ పాలెగాళ్ల వ్యవస్థ విజయనగర సామ్రాజ్య పాలనా కాలంలో ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం విజయనగర రాజుల కాలంలో వారి అధీనంలో ఉండేది. సహజంగా ఈ ప్రాంతం అరాచక ప్రాంతం కావడంతో సుస్థిర పాలన కోసం విజయనగర రాజులు స్థానిక యుద్ధవీరులను పాలెగాళ్లుగా నియమించి, వారి ద్వారా కప్పం రాబట్టుకుంటూ పరిపాలించారు. స్థానికంగా పులివెందుల చుట్టూ వంద చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో మీదిపెంట్లకో, దుర్గంకోట, పులివెందుల కోట, కోమన్నూతల, పాలెం ఈ ఐదు ప్రాంతాలలో పాలెగాళ్లు కోటలు నిర్మింతుకుని స్థానికంగా పన్నులు వసూలు చేస్తూ, అరాచకాలను అణచివేస్తూ విజయనగర సామ్రాజ్యానికి అధిపతులై పాలించారు. కడప, అనంతపురం జిల్లా సరిహద్దుల్లో శేషాచలం కొండలు(పాలకొండలు) ఈ పాలెగాళ్ల స్థావరాలుగా ఉండేవి. వీరందరూ పట్ల, ఇకిలి కులానికి చెందినవారుగా చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్‌ పాలనలోకి ఈ ప్రాంతం వెళ్లడంతో ఈ ప్రాంతానికి తొలి కలెక్టర్‌ గా థామస్‌ మన్రో మదరాసు2.4.1800న మదరాసు గవర్నర్‌ నియమించారు. విజయనగర సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత ఈ ప్రాంతం గోల్కొండ సుల్తానులు, నిజాం ప్రభువులు, తర్వా కొన్నాళ్ల పాటు టిప్పు సుల్తాన్‌, మహారాష్ట్రులు, తిరిగి నిజాం ప్రభువులు, వారి తర్వాతకాలంలో ఈస్టిండియా కంపెనీ అధీనంలోకి వచ్చింది.ఈ మధ్య కాలంలో ఈ పాలెగాళ్లు బ లపడి స్థానిక ప్రజలను దోచుకోవడంతో పాటు అరాచకంగా పాలించారు. జిల్లా కలెక్టర్‌ రుగా థామస్‌ మన్రో రావడంతోనే ప్రధానంగా వీరిపైనే దృష్టి పెట్టి, దాదాపు 80మంది పాలెగాళ్లను నిర్ధాక్షిణ్యంగా అణచివేశారు. కొంత మంది లొంగిపోయిన పాలెగాళ్లకు పింఛన్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు. దీంతో ఈ పాలెగాళ్ల వ్యవస్థ పూర్తిగా అం తరించింది. ఇందులో భాంగా దుర్గంకోట కూడా అంతరించిపోయింది.

చదవండి :  రాజధాని వాడికి...రాళ్ళ గంప మనకు

దుర్గం కోట చరిత్ర :

ఈ ప్రాంతంలో ప్రముఖ పాలగాడు వేముల మండలంలోని మీదిపెంట్ల పాలెగాళ్లు వీరికి 600మంది సైన్యం, 26 గ్రామాలు వీరి ఏలుబడిలో ఉండేవి, వీరి అధీనంలోపులివెందుల, దుర్గంకోట, నెరుచుపల్లె, లక్కిరెడ్డిపల్లె, కోమన్నూతల, లోపట్నూతల పాలెగాళ్లు ఉండేవారు. దుర్గంకోటను మల్లప్పనాయుడును నిర్మించారు. ఈ కోట పులివెందుల మండలం కనంపల్లె గ్రామ సమీపంలోని పులివెందుల నుంచి కదిరివెళ్లే మార్గంలో నామాలగుండు ఆలయానికి పశ్చిమ దిశలో సముద్రమట్టానికి రెండు వేల ఎత్తులో పాలకొండల మధ్యలో నిర్మించారు. ఈ ప్రాంతం పెనుగొండ నుంచి గండికోట పోవుటకు ప్రధాన మార్గంగా ఉండేది. రెండు కొండల మధ్య పోయే దారిలో మనుషులు, సైన్యం పోయే దారికావడంతో ఈ మార్గం కాపు దారి చేయుటకు కొండపైన కోటను నిర్మించారు. నామాల గుండు వద్ద ఓ కోనేరు వద్ద శివాలయాన్ని నిర్మించారు. దీంతో మల్లప్ప కొండగా పిలుస్తారు. ఈ కోటను ఎత్తయిన కొండ మధ్య నిర్మించారు. ఈ కొండ పైభాగం నుంచి చూస్తే చుట్టు పది కిలోమీటర్ల దూరం నుంచి చూస్తే వచ్చిపోయే వారిని గమనించవచ్చు. దూరం నుంచి శత్రువులను కూడా సులువుగా గుర్తించవచ్చు. అయితే కొండపైన ఉన్న కోటను చాలా కష్టంతో కూడిన పని, కొండపైకి వెళ్లడనికి సరైన దారిలేదు. గుర్రాలు కూడా అక్కడికి వెళ్లడం కష్టమనిపిస్తుంది.

చదవండి :  దేవుని కడప

కోట నిర్మాణం:

కోట చుట్టూ రక్షణ గోడలు నిర్మించారు. ఈ గోడ కిలోమీటర్ల దూరం వ్యాపించి నేటికి కనిపిస్తోంది. కోట నిర్మాణం మూడంచెలుగా ఉంది. ఇందులో తొలి నిర్మాణంలో సామాన్య ప్రజల కోసం నిర్మించినట్లు తెలుస్తోంది. వీరి నిత్యావసరా కోసం 50 అడుగులవిస్తీర్ణంతో చదరంగా దిగుడి బావిని ఏర్పాటు చేశారు. ఇందులో పది అడుగుల లోతులోనే నీరు నేటికి కనిపిస్తుంది. రెండవ అంచెలో ఇసుక, సున్నం(గార)తో నిర్మించిన గోడలను నేటికి చూడవచ్చు. మూడవ భాగం చుట్టూ బురుజుల లోపలి భాగం ప్రధానమైన వ్యక్తులు ఉండేవారని తెలుస్తోంది. మొత్తం ఈ ప్రాంతంలో నాలుగు అడుగుల బావులు ఉన్నాయి. అవి నేటికి చెక్కు చెదరకుండా ఉపయోగపడుతున్నాయి. తాగునీరు ఉంది. బావులు విశాలమైనవి. అన్ని బావుల్లోనూ పది అడుగుల లోపలే ఉన్నాయి. అలాగే అలనాడు నిర్మించిన చెరువు ఉంది. ఆ చెరువు నేటికి చెక్కుచెదరలేదు. ఇందులో కూడా నీరు ఉంది. మరోవైపు కుంట కూడా ఉంది. పాలెగాళ్లు కొలిచిన గ్రామ దేవత గంగమ్మ ఆలయం శిధిలావస్థలో ఉంది. కోట చుట్టు బురుజులు, బండరాళ్లు చూడముచ్చటగా కనిపిస్తాయి. ఎత్తయిన కొండల్లో నిటారుగా పెరిగిన వృక్ష సంపద నడుమ పక్షుల కిలకిల రావములతో ఈ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.

చదవండి :  కడప (వైఎస్ రాజారెడ్డి) క్రికెట్ స్టేడియం

దుర్గంకోట పర్యాటక ప్రాంతం:

దుర్గంకోట నేటికి చూడటానికి ఎంతో అద్బుతంగా ఉంది. ఆహ్లాదకరంగా ఉంది. కదిరి, పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉన్నందున ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం గుర్తించాలని, అందుకు నామాలగుండు నుంచి దుర్గంకోటకు దారి ఏర్పాటు చేయాలని, దుర్గంకోటలో పుష్కలంగా నీటి వనరులు ఉన్నందున ప్రధానంగా అటవీ కాబట్టి అరుదైన మొక్కలు, కనుమరుగవుతున్న చెట్లను గుర్తించి వాటిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రాచీన కట్ట డాలను మరమ్మతులు చేసి, ఈ కట్టడాలను పాడు చేయకుండా బావి తరాల వారికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని పలువురు పర్యాటకలు కోరుతున్నారు. నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు. అందువల్ల ఈ ప్రాంతంలో చాలా కట్టడాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకుని తవ్వకాలను నిలిపి వేసి పురాతన కోటను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సిందిగా ఈ ప్రాంత వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: