దేవుని కడప రథోత్సవం

కిటకిటలాడిన దేవునికడప

వైకుంఠ ఏకాదశి(ముక్కోటి దేవతలు వేచి దర్శనం పొంది స్వామి అనుగ్రహం పొందిన రోజు)ని పురస్కరించుకుని గురువారం దేవునికడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ఏకాదశి కావడంతో గురువారం తెల్లవారుజామున 4 గంటలకే స్వామి దర్శనానికి భక్తులు తరలివచ్చారు.

గోవిందనామస్మరణల నడుమ కడపరాయుడిని ఉత్తరద్వారం వద్ద దర్శించి తరించారు. ఆలయప్రధాన అర్చకులు శేషాచార్యులు పూజలు చేసిన అనంతరం భక్తులను స్వామి దర్శనానికి అనుమతించినారు.

వైకుంఠ ఏకాదశి అంటే?

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాబారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.

చదవండి :  బడ్జెట్‌పై ఎవరేమన్నారు?

విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. అందుజేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. తిరువతిలో కూడా ఈ రోజును వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.

చదవండి :  అల్లుడికి ఘనంగా భత్యం సమర్పించిన కడప ముస్లింలు

ఇదీ చదవండి!

సింగారరాయుడ

సింగారరాయుడ వౌదు చెన్నకేశా – అన్నమయ్య సంకీర్తన

మాచనూరు చెన్నకేశవుని సంకీర్తనలు – 1 పదకవితా పితామహుడు దర్శించిన క్షేత్రాలు అనేకం కడప జిల్లాలో ఉన్నాయి. ఆయా వైష్ణవ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: