కమలాపురం శాసనసభ్యుడి నిరాహారదీక్ష

గాలేరు-నగరి సుజల స్రవంతిలో భాగమైన సర్వరాయసాగర్ పనులు తక్షణం పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరు అందించాలని కోరుతూ కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాద్ రెడ్డి ఆదివారం మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో  నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.

దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడుతూ … ‘ఇప్పటికే మన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. తాగడానికి నీరు లేదు.  తినడానికి తిండి లేదు.. రబీ సీజన్ కూడా మోసం చేసింది.. చంద్రబాబు సీఎం అయితే ఆయనతో పాటు కరువు కూడా వస్తుందని నిరూపించారు. ఇలాంటి సమయంలో చేతులు కట్టుకొని ఉండకూడదనుకున్నాను.. ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది’ అన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో నైనా అవసరమైన నిధులు కేటాయించి గాలేరు నగరిని సుజల స్రవంతి సాగునీటి పథకాన్ని పూర్తి చేయాలనే డిమాండ్‌తో నిరాహార దీక్ష చేస్తున్నానన్నారు. వైఎస్ లాంటి నాయకులు ఉంటే ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉండేది కాదని, కాని ప్రస్తుతం భవిష్యత్ తరాల కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్కరూ ఉద్యమించక తప్పదని ఆయన పిలుపునిచ్చారు.

చదవండి :  రాజంపేట పార్లమెంటు స్థానంలో ఎవరికెన్ని ఓట్లు

ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కటీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా, రైతు రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. విదేశాల్లో అయితే వాగ్ధానాలు ఇచ్చి అమలు చేయకపోతే ఉరిశిక్ష విధిస్తారని, గల్ఫ్ దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపుతారని, అలాంటి చట్టాలు ఇండియాలో లేకనే చంద్రబాబును ప్రజలు వదిలేశారని స్పష్టం చేశారు.

రవీంద్రనాథ్‌రెడ్డి దీక్షకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, శాసనసభ్యులు అంజద్‌బాషా, రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో పాటు జిల్లా, మండల నాయకులు దీక్షా ప్రాంగణానికి హాజరై తమ సంఘీభావం తెలిపారు.డీసీసీబీ ఛెర్మైన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ మాజీ ఛైర్మన్ తులసిరెడ్డి సంఘీభావం ప్రకటించారు.

చదవండి :  గైర్హాజరుపై వైకాపా నేతల వివరణ

ఇదీ చదవండి!

kadapa district map

ఉద్దేశపూర్వకంగా జిల్లాను ఘోరీ కడుతున్నారు

విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో శాసనసభ్యులు మౌనముద్ర దాల్చిన కలెక్టర్ కడప: జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు అవసరమని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: