బాబు రాజానామా కోరుతూ రోడ్డెక్కిన వైకాపా శ్రేణులు

ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాలని కోరుతూ మంగళవారం జిల్లా వ్యాప్తంగా వైకాపా శ్రేణులు ర్యాలీలు, ఆందోళనలు  నిర్వహించాయి.

కడపలో…

కడప కలెక్టరేట్ దగ్గర మేయర్ సురేష్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ధర్నా చేశారు. అనంతరం మాట్లాడుతూ…తన అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఓటుకు నోటు వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూస్తున్నారని పేర్కొన్నారు.

ysr congress

పులివెందులలో…

అవినీతి చంద్రబాబు గద్దె దిగాలంటూ వైకాపా నేతలు, కార్యకర్తలు పులివెందులలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ కూడలి నుంచి పాత బస్టాండ్, పూలంగళ్లు, పాతగంగిరెడ్డి ఆసుపత్రి మీదుగా తహసీల్దార్ కార్యాలయంవరకు ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు డైరెక్షన్లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఓ ఎమ్మెల్యేకు డబ్బులు ఇస్తూ పట్టుపడ్డారన్నారు. ఫోన్ సంభాషణలు బయటకు రావడంతో… అవి నా మాటలు కాదని బాబు అంటున్నారని విమర్శించారు. ఇలాంటి ముఖ్యమంత్రిని వెంటనే అరెస్టు చేసి, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడలేని చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

చదవండి :  'గండికోట'కు నీల్లేయి సోమీ?

మైదుకూరులో…

మైదుకూరులో శాసనసభ్యుడు రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిరహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం ఉన్నా చంద్రబాబు తన పదవికి రాజీనామా చేసి నిజాయతీ చాటుకోవాలన్నారు. అవినీతికి పట్టం కట్టాలని తెలుగుతమ్ముళ్లు రోడ్లపైకి రావడం సిగ్గుచేటన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏమిసాధించారని సంబరాలు చేసుకున్నారంటూ రఘురామిరెడ్డి ప్రశ్నించారు. ఏడాది గడచినా కేసీకాల్వ, తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరునగరికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.

చదవండి :  అధికారిని తిట్టిన తెదేపా నేత లింగారెడ్డి

బద్వేలులో…

బద్వేలులో స్థానిక నాలుగురోడ్ల కూడలి నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు మంగళవారం వైకాపా నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. నాలుగురోడ్ల కూడలిలో ఎమ్మెల్యే టి.జయరాములు, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ… ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అసలు సూత్రధారని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణాలో ఒక ఎమ్మెల్సీ సీటు కోసం ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు ఇవ్వబోయి అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. చంద్రబాబే తన ఫోన్‌ట్యాప్ చేశారని స్వయంగా ఒప్పుకుంటుంటే తెదేపా నాయకులు మాత్రం ఆ మాటలు సీఎంవి కావని, చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికే తెరాస ప్రభుత్వం అనుకరణ చేయించిందనడం సిగ్గుచేటన్నారు.

చదవండి :  ముఖ్యమంత్రి సుముఖంగా లేరు

రాజంపేటలో…

రాజంపేటలో ఆకేపాటి అమర్నాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకేపాటి భవన్ నుంచి మార్కెట్ మీదుగా పాత బస్టాండు వరకూ ప్రదర్శన  నిర్వహించారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటు వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తున్నా.. బాబు తనకేమీ తెలియదని చెప్పడం తెలుగు ప్రజలను మోసం చేయడమేనన్నారు. తప్పు చంద్రబాబు చేసి, జగన్‌ను నిందించడం దారుణమన్నారు. తెదేపా అవినీతి వ్యవహారం తేలేవరకూ తాము పోరాటం చేస్తామన్నారు.

ఇదీ చదవండి!

మైసూరారెడ్డి

వైకాపాకు మైసూరారెడ్డి రాజీనామా

కడప : వైకాపాలో సీనియర్ నేతగా ఒక వెలుగు వెలిగిన మైసూరారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: