భక్త కన్నప్పది మన కడప జిల్లా

కడప: భక్త కన్నప్ప కడప (వైఎస్సార్) జిల్లా వాడే. కైఫీయతుల్లో ఇందుకు స్పష్టమైన ఆధారం ఉందని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో కన్నప్ప కర్నాటకవాడనీ, తమిళుడని, ఆ ప్రాంతాల వారు చేసిన వాదనలో నిజం లేదని స్పష్టమైంది. కన్నప్ప వైఎస్సార్ జిల్లావాడేననడానికి రుజువుగా ఆయన ప్రతిష్టించిన శివలింగం రాజంపేట మండలం ఊటుకూరులో నేటికీ ఉందని  పండిత పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

ఉడుమూరులో కన్నప్ప నిర్మించినట్లుగా చెబుతున్న శిధిల శివాలయం
ఉడుమూరులో కన్నప్ప నిర్మించినట్లుగా చెబుతున్న శిధిల శివాలయం

భక్త కన్నప్ప గురించి అందరికీ తెలుసు. మూఢ భక్తుడే అయినా శివభక్తుల్లో శ్రేష్టునిగా పేరొందాడు. ఆ మహనీయుని జన్మ స్థలి గురిం చి ఇప్పటి వరకు తమిళ, కర్నాటకతో పాటు మన రాష్ట్ర పండితులు, సాహితీవేత్తల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కడప కైఫీయతుల పరిష్కర్త, సాహితీవేత్త, విద్వాన్ కట్టా నరసింహులు కన్నప్ప మన జిల్లాకు చెందిన వాడేనని పేర్కొంటున్నారు. రాజంపేట మండలం ఊటుకూరులో నాడు కన్నప్ప ప్రతిష్టించిన శివలింగం ఆ సమీపంలోని ఉడుమూరులో ఆ శివలింగానికి చెందిన శివాలయం శిధిలాలను దీనికి నిదర్శనంగా చూపుతున్నారు.

చదవండి :  కడపకు తొలి విమానమొచ్చింది

జన్మ సమాచారం

కన్నప్ప జన్మ స్థలం ఉడుమూరు అని శివభక్తుల చరిత్ర గురించి తెలిపే తమిళ గ్రంధం పెరియ పురాణంలో ఉంది. కానీ అందులో ఆ విషయంగా అంతకు మించిన వివరాలు లేవు. కానీ ధూర్జటి కవి తన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో తిన్నడు (కన్నడు) ఉడుమూరికి చెందినవాడేనని ప్రస్తావించాడు. ఆ ఉడుమూరు ఎక్కడుందో కూడా..

 ‘పొత్తపి నాటిలో విపిన భూమి,
కిరాతుల కాటపట్టు,
లోకోత్తర వన్య వస్తువు,
ఉడుమూరను పక్కణ మొప్పు.. ’

అని స్పష్టంగా వివరించాడు.

కైఫీయతుల్లో..

ఊటుకూరు శివాలయం

ఉడుమూరు ఉనికి కైఫీయతుల్లో లభించింది. ‘పోలి’గ్రామానికి సమీపంలోని కొండూరు, దానికి తూర్పున ‘దశ శృంగ పర్వతం’ వద్ద ఉడుమూరు ఉండేది. వెయ్యేళ్ల క్రితం కొండూ రు, ఉడుమూరు ప్రసిద్ధి గ్రామాలు. కొన్ని కారణాల వల్ల ఆ గ్రామ ప్రజలు ఒకరి గ్రామాన్నొకరు ధ్వంసం చేసుకున్నారు. మిగిలిన ఉడుమూరువాసులు సమీపంలోని ‘ఊటుకూరు’కు వచ్చి స్థిరపడ్డారు. అక్కడ ఒక శివాలయం నిర్మించుకున్నారు.

చదవండి :  ఉక్కు పరిశ్రమను తరలిస్తే అడ్డుకుంటాం : సిపిఎం

కన్నప్ప ఉడుమూరులో ప్రతిష్టించిన శివాలయంలోని శివలింగాన్ని ఊటుకూరు ఆలయానికి తెచ్చారు. కన్ను చిత్రం గల ఆ శివలింగాన్ని కన్నప్ప గుర్తుగా ఆ కొత్త ఆలయంలో ప్రతిష్టించాలని ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆ శివలింగం కొద్దిగా పగిలి ఉండడంతో పాత పానిమట్టం మాత్రమే ఉంచి,శివలింగం శిరసు స్థానంలో కొత్త దాన్ని ఏర్పాటు చేసి ప్రతిష్టించా రు. ప్రస్తుతం పగిలిన స్థితిలో ఉన్న కన్నప్ప ప్రతిష్టగా పేర్కొంటున్న శివలింగం శిరసుకు కొత్త పానిమట్టం అమర్చి పగిలిన మేర మరమ్మత్తులు చేసి ఆలయ ప్రాంగణంలోనే ఉంచారు. ఊటుకూరు శివాలయంలో నేటికీ కన్నప్ప ప్రతి ష్టించిన ఆ శివలింగాన్ని మనం చూడవచ్చు. ధ్వంసమైన ఉడుమూరు ప్రాంతంలో కన్నప్ప ని ర్మాణంగా చెబుతున్న శివాలయం శిధిలాలు ఈ చరిత్రకు సాక్ష్యాలుగా నేటికీ నిలిచి ఉన్నాయి.

చదవండి :  విభజనోద్యమం తప్పదు

స్పష్టమైన అధారాలు ఉన్నాయి

మహా శివభక్తుల్లో అత్యంత ముఖ్యునిగా చెప్పుకునే కన్నప్ప తమిళనాడుకు చెందినవాడని ఆ ప్రాంతం వారు, తమ వాడని కన్నడిగులు వాదిస్తున్నారు. ఈ క్రమంలో కన్నప్ప వైఎస్సార్ జిల్లాకు చెందినవాడని ఇక్కడి సాహిత్య పరిశోధకులు చెప్పారు. అదేం కాదు తమవాడేనని శ్రీకాళహస్తి తమిళనాడు ప్రాంతానిదని వాళ్లు వాదించారు. కానీ వాళ్లెవరూ అంతకు మించిన ఆధారాలేవీ చూపలేకపోయారు. ఈ నేపథ్యంలో కన్నప్ప మన జిల్లావాడేనని స్పష్టమైన ఆధారాలు లభించాయి. శ్రీమాన్ అన్నమాచార్యులు, వేమన , పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, పోతన, అల్లసాని పెద్దన, మొల్లమాంబ తదితర ఎందరో కవులు పుట్టిన గడ్డగా మన జిల్లాకు ఎంతో పేరుంది. ఇక కన్నప్ప కూడా మనవాడేనని స్పష్టం కావడంతో మన జిల్లా కీర్తి కిరీటంలో మరొక కలికితురాయి చేరినట్లవుతుంది.

– విద్వాన్ కట్టా నరసింహులు, సాహిత్య పరిశోధకులు, కడప

ఇదీ చదవండి!

వైకాపా-లోక్‌సభ

కడప జిల్లా వైకాపా లోక్‌సభ అభ్యర్థుల జాబితా – 2019

కడప: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ …

4 వ్యాఖ్యలు

  1. I liked…..

  2. శివ భక్తుల్లో చాలా గొప్పవాడైన కన్నప్ప మన జిల్లాకు చెందిన వాడని తెలియడం చాలా ఆనంద దాయకం. ఈ జిల్లాలో పుట్టినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను.

  3. Great News. Thanks for Vidwan Katta Narasimhulu Garu.

  4. భక్త కన్నప్ప కడప వాసి కావడం కడప జిల్లాకే గర్వకారణం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: