మాటలేలరా యిక మాటలేల

మాటలేలరా యిక మాటలేల – అన్నమయ్య సంకీర్తన

పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. వాని అందచందాలు చూసి కన్నెలు పరవశించినారు. వాని చేతలకు బానిసలైనారు. కడపరాయని వశీకరణకు గురైన ఒక నాయిక  ఆ ‘మాయగాడి’ని మోహిస్తూ.. వచ్చి వలపులందుకొమ్మని ఇట్లా పిలుస్తోంది…

వర్గం: శృంగార సంకీర్తన
రాగము: శంకరాభరణం
రేకు: 1610-4
సంపుటము: 26-58

మాఁటలేలరా యిఁక మాఁటలేల
మాఁటలేలరా మాయకాఁడా ॥పల్లవి

చూచి చూచే చొక్కించితి
యేచి నీ చేఁత కేమందురా
కాచెఁ బూచెను కాఁగిట చన్నులు
లోఁచి చూడకు లోనైతి నీకు ||మాఁటలేలరా ||

చదవండి :  ఆడరాని మాటది - అన్నమయ్య సంకీర్తన

నవ్వి నవ్వే నమ్మించితి
ఎవ్వరును నిఁక నేమనేరు
రవ్వసేసెను రాఁపగు వలపులు
తవ్వ కిఁక జోలిదక్కితి నేను ||మాఁటలేలరా ||

చేరి చేరి చేకొంటివి యింత
దూరఁబోతే దోసమిఁక
యేరా శ్రీ వేంకటేశ్వరుడా
రార కడపలో రతికెక్కెఁ బనులు ||మాఁటలేలరా ||

ఇదీ చదవండి!

సింగారరాయుడ

కరుణించవయ్య యిఁక కడు జాణవౌదువు – అన్నమయ్య సంకీర్తన

ప్రొద్దుటూరు చెన్నకేశవుని స్తుతించిన అన్నమాచార్య సంకీర్తన ప్రొద్దుటూరు లేదా పొద్దుటూరు, వైఎస్ఆర్ జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణము. రెండవ బొంబాయిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: