సోనియా, రాహుల్‌ ఫొటోలు లేకుండానే వివేకా ప్రచారం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ముందుగానే ప్రకటించినట్లు ఉప ఎన్నికలు సోనియా- వైఎస్‌ రాజశేఖరరెడ్డి మధ్య జరుగుతు న్నాయా?… సోనియా, రాహుల్‌ ఫొటోలు పెడితే ఓట్లు పడవని కాంగ్రెస్‌ అసెంబ్లీ అభ్యర్ధి భయపడుతున్నారా? సోనియా కంటే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫొటోకే ఎక్కువ ఓట్లు పడతాయని భావిస్తున్నారా?

తాజాగా జరుగుతున్న ప్రచార తీరు గమనిస్తే ఈ అనుమానం నిజమనిపించక తప్పదు. కడప జిల్లాలో జరుగుతున్న పార్లమెం టు- శాసనసభ ఉప ఎన్నికల ప్రచారంలో సోని యా- వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫొటోలే పోటాపో టీగా కనిపిస్తున్నాయి. అయితే.. కాంగ్రెస్‌ అభ్య ర్ధులుగా బరిలో ఉన్న వివేకా-డీఎల్‌ రవీంద్రారెడ్డి ఇద్దరూ చెరొకరి ఫొటోలు వాడుకోవడం సొంత పార్టీ వారినే విస్మయానికి గురిచేస్తోంది. పులివెం దుల కాంగ్రెస్‌ అభ్యర్ధి వైఎస్‌ వివేకానందరెడ్డి ప్రచారంలో అనుసరిస్తున్న వైఖరి కాంగ్రెస్‌ శ్రేణులను ఆశ్చర్యపరుస్తోంది.

చదవండి :  మైదుకూరు శాసనసభ బరిలో 12 మంది

ఆయన తన పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, యువ నేత రాహుల్‌ గాంధీ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షు డు డీఎస్‌ ఫొటో లేకుండానే ప్రచారం నిర్వహిస్తున్నారు. వివేకా తన సోదరుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫొటోను మాత్రమే వాడుకోవడం కనిపిస్తోంది. బహుశా సోనియాగాంధీ ఫొటో పెడితే ఓట్లు రావన్న ముందు జాగ్రత్తతోనే ఆయన తన సోదరుడి ఫొటో వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. వివేకా తన ‘వివేకా ప్రచార రథం’పై కూడా వైఎస్‌, తన ఫొటో మినహా సోనియాగాంధీ, రాహుల్‌ ఫొటో కూడా ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. చివరకు తన ఎన్నికల ప్రచారం, ఇంటింటి పాదయాత్రలో సైతం ఆయన కేవలం తనను మాత్రమే గెలిపించమని ఓటర్లను అభ్యర్ధిస్తుండటం మరో ఆశ్చర్యకర అంశం.

చదవండి :  ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

సహజంగా పార్లమెం టు-అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంపీ అభ్యర్ధి ఒక ఓటు తనకు మరొక ఓటు తన పార్టీకి చెందిన అసెంబ్లీ అభ్యర్ధికి ఓటు వేయాలని కోరుతుంటారు. అదే సమయంలో అసెంబ్లీ అభ్యర్ధి కూడా ఒక ఓటు తనకు, మరొక ఓటు తన పార్టీ ఎంపీ అభ్యర్ధికీ ఓటు వేయమని అభ్యర్ధిస్తుండటం రివాజు. కానీ, వివేకా మాత్రం తనకు మాత్రమే ఓటు వేయాలని, మిగిలిన ఓటు మీ ఇష్టమని చెబుతుండటం ప్రస్తావనార్హం. కొన్ని చోట్ల ఆయన అసలు ఎంపీ అభ్యర్ధి డీఎల్‌ గురించే ప్రస్తావించడం లేదు. ఇక ఎంపీ అభ్యర్ధి డీఎల్‌ రవీంద్రారెడ్డి తన ఎన్నికల ప్రచారంలో సోనియా, రాహుల్‌, కిరణ్‌, డీఎస్‌ ఫొటోలనే ఎక్కువగా వినియోగించుకుం టున్నారు.

చదవండి :  పశుగణ పరిశోధనా కేంద్రాన్నిఉపయోగంలోకి తీసుకురండి

వైఎస్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకుండా, ఆయన ఫొటో అందరి మధ్యలో ఉంచుతున్నారు. డీఎల్‌ తన ప్రచారంలో కూడా గతంలో వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన అభి వృద్ధి, సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్‌ పార్టీ చేసిన వేనని, సోనియా అనుమతితోనే వాటిని చేపట్టామని ప్రచారం చేస్తున్నారు.

అంటే.. కిలో 2 రూపాయల బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజులరీ ఇంబర్స్‌మెంట్‌ ఇత్యాది ప్రజాదరణ పొందిన పథకాలన్నీ సోనియా అనుమతితోనే అమలవుతు న్నాయే తప్ప, అందులో వైఎస్‌ గొప్పతనమేదీ లేదని ప్రజలకు ప్రచారం చేస్తున్నారు. డీఎల్‌ తన ప్రచారంలో సోనియా-రాహుల్‌-కిరణ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, వైఎస్‌ పేరును ప్రచారంలో వాడుకోకపోవడం గమనార్హం. ఈవిధంగా ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అభ్య ర్ధులు పరస్పర విరుద్ధమైన రీతిలో తమ పార్టీ నేతలను వినియోగించుకోవటం చర్చనీయాం శమయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: