శ్రీశైలం నుంచి 150 టిఎంసిలున్న సాగర్‌కు నీటిని తరలించడం దుర్మార్గం: సిపిఎం

రాయలసీమ అవసరాలను పట్టించుకోకుండా కిందకు వదలడం సరికాదు

కడప: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్‌కు నీటి విడుదల చేయాలని ఎపి, తెలంగాణా ప్రభుత్వాలు నిర్ణయించడం దుర్మార్గమనీ, దీన్ని సిపిఎంగా వ్యతిరేకిస్తున్నామని ఆపార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బి.నారాయణ అన్నారు. ఆదివారం పాతబస్టాండ్‌లోని పార్టీ కార్యా లయంలో విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ…తీవ్రమైన కరువు పరిస్థితుల నుంచి వర్షాల వల్ల సీమ రైతులు ఉపశమనం పొందుతున్నారని తెలిపారు.

గోరుచుట్టుపై రోకలిపోటు లాగా తెలంగాణా, ఎపి ప్రభుత్వాలు రాయలసీమకు తీవ్రమైన నష్టం కలిగించే చర్యలు చేపట్టడం అన్యాయమన్నారు. నిన్నటి వరకు వర్షాలు లేక వెలవెల బోయిన శ్రీశైలం రిజర్వాయర్‌లో ఇప్పుడిప్పుడే 789 నుంచి 820 అడుగులకు నీరు చేరుకున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం నీరు తాగునీటి అవసరాలకు వదలాలని ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పుకోవడాన్ని సిపిఎం వ్యతిరే కిస్తోందన్నారు.

చదవండి :  కొత్తసీమ (పాట) - సడ్లపల్లె చిదంబరరెడ్డి

నాగార్జునసాగర్‌లో 150 టిఎంసిలు నీరు ఉన్నాయి, సాగర్‌ ప్రాంతం సంవృద్ధిగా భూగర్భ జలాలు ఉన్న ప్రాంతమనీ, మంచినీటికి ఎలాంటి ఎద్దడి లేదని చెప్పారు.

శ్రీశైలంలో 854 అడుగులు డెడ్‌ స్టోరేజిగా ఉంటే దానిని 1996లో అప్పటి ప్రభుత్వం 834 అడుగులలోతుకు డెడ్‌స్టోర్‌గా చేసి రాయలసీమకు తీరని ద్రోహం చేశారని తెలిపారు.

రాయలసీమలో నాలుగువేల గ్రామలకు పైగా మంచినీరు దొరకక ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు. మూడేళ్లుగా ఇక్కడ కరువు విలయతాండవం చేస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం నీటిని రాయలసీమ అవసరాలకోసం నిలువచేయకుండా కిందికి పంపించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

చదవండి :  ఆ అంశాన్ని ఎందుకు చేర్చలేదు? - బి.వి.రాఘవులు

శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడు గులనీ, అంతకంటే పైకి నీరు వస్తే కిందకు నీరువ దలాలి గాని, అలాకాకుండా ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆందోళన చేయా ల్సి వసు ్తందని హెచ్చరించారు.

టిడిపి ప్రభుత్వం జూన్‌ నాటికే గండికోటకు, బి.మఠం రిజర్వాయర్‌కు నీరు రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పిందని తెలిపారు. నేటికీ కాలువలు పూర్తి కాకపోవడం, రిపేర్లు చేయకపోవడం తో నీరురాని పరిస్థితి ఏర్పడి ందన్నారు. తెలు గుగంగ, వెలుగోడు నుంచి అనేక రిపేర్లు ఉన్నాయని చెప్పారు. దీనివల్ల గతయేడాది రెండువేల క్యూసెక్కుల నీరు వదలితే కేవలం 150 నుంచి 200 క్యూసెక్కుల నీరు చేరిందని తెలిపారు. కాలు వలు లేక 1,800 టిఎంసిల నీరు మధ్యలోనే వృధాగా పోయాయన్నారు.

చదవండి :  వరదరాజులురెడ్డి అందుకే దేశంలోకి వచ్చారా!

కలెక్టర్‌ కె.వి.రమణ బి.మఠం రిజర్వాయర్‌కు పూర్తి స్థాయిలో నీటిని నింపుతామని చెప్పారని, అయితే కాలువలు పూర్తి కాకుండా నింపడం అసాధ్యమని అన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌ నిండేలోపు యుద్ధ ప్రాతి పదికన కాలువల రిపేర్లు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఐదువేల క్యూసెక్కుల నీటి సామర్థ్యం ఉన్న కాలువలో కనీసం నాలుగువేల క్యూసెక్కులు వదలి బి.మఠం రిజర్వాయర్‌కు పంపాలని కోరారు.

ఇదీ చదవండి!

రాయలసీమ జీవన్మరణ సమస్య

ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య

ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాల వినియోగంలో సమస్యలు రాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: