సూక్ష్మ సేద్య రాయితీలలోనూ కడప, కర్నూలులపై ప్రభుత్వ వివక్ష

సూక్ష్మ సేద్య పరికరాల (స్ప్రింక్లర్లు, బిందు సేద్య పరికరాలు మొదలైనవి) కొనుగోలు సబ్సిడీ విషయంలోనూ కడప, కర్నూలు జిల్లాలపై తెదేపా ప్రభుత్వం వివక్ష చూపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మసాగునీటి పథకం కింద వివిధ వర్గాల రైతులకు ప్రకటించిన సబ్సిడీల విషయంలో జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు జిల్లాలలో ఉన్న రైతులకు ఎక్కువ లబ్ది కలిగేలా ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబరు-34(https://www.kadapa.info/gos/go34/)ని విడుదల చేసింది. అదే సమయంలో రాయలసీమకే చెందినా కడప, కర్నూలు జిల్లాల రైతులకు రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటుగా సాధారణ సబ్సిడీ ప్రకటించి ప్రభుత్వం తన వివక్షను కొనసాగించింది.

సూక్ష్మ సాగు నీటి సేద్య పథకం అమలుకు సంబంధించి విధి విధానాలను మార్పులు చేసిన ప్రభుత్వం జులై 9న జీవో నెంబర్ 34ను విడుదల చేసింది.

చదవండి :  'సీమ కోసం సభలో నోరెత్తండి'

go34

ఇందులో ఎస్సీ, ఎస్టీ రైతుల్లో 2.5 ఎకరాల్లోపు భూమిని కలిగి ఉన్న రైతులకు 100 శాతం సబ్సిడీ (గరిష్టంగా ఒక లక్ష రూపాయలు), ఇతర వర్గాల్లో 2.5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు 90 శాతం (గరిష్టంగా ఒక లక్ష రూపాయలు), 5 నుంచి 10 ఎకరాల చేను కలిగిన రైతులకు 70 శాతం సబ్సిడీని  (గరిష్టంగా ఒక లక్ష రూపాయలు) అమలు చేస్తామని ప్రకటించింది.

రెండున్నర హెక్టారుకుపైగా భూమిని కలిగి ఉన్న రైతులకు 50 శాతం సబ్సిడీని (గరిష్టంగా రెండు లక్ష రూపాయలు) ప్రకటించారు.

ఈ జీవో ప్రకారం చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 5 నుంచి 10 ఎకరాల మెట్ట భూమిని కలిగిన రైతులకు 90 శాతం రాయితీని దక్కుతుంది. అదే కడప,కర్నూలు జిల్లలో 5 నుండి 10 ఎకరాలలోపు భూమి ఉండి పథకాన్ని వినియోగించుకునే రైతులకు కేవలం 70 శాతం మాత్రమే రాయితీ దక్కుతుంది.

చదవండి :  పువ్వు పార్టీలో చేరిన ఆదినారాయణ

సగటున 934 మి.మీ వర్షపాతం, 23,500 రూపాయల వ్యవసాయ ఉత్పాదకతా కలిగిన చిత్తూరు జిల్లా(మూలం: శ్రీ కృష్ణ కమిటీ నివేదిక)లో 5  నుంచి 10  ఎకరాల మెట్ట భూమి కలిగిన రైతులకు సూక్ష్మ సేద్య పరికరాలపై 90 శాతం రాయితీ కల్పిస్తున్న ప్రభుత్వం పక్కనే ఉన్న కడప, కర్నూలు జిల్లాలలోని రైతులకు 70 శాతం రాయితీ కల్పించడంలో ఉద్దేశం ఏమిటి?

వ్యవసాయ ఉత్పాదకతా, సగటు వర్షపాతాల విషయంలో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు చిత్తూరు జిల్లా కన్నా అట్టడుగునే ఉన్నాయి. సూక్ష్మ సేద్య పరికరాల రాయితీ విషయంలో అనతపురం జిల్లాతో సమానంగా చిత్తూరుకు ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వం చిత్తూరు కన్నా అధ్వాన్నమైన పరిస్తితులు కలిగి ఉన్న కడప, కర్నూలు జిల్లాల రైతాంగాన్ని ఎందుకు చిన్న చూపు చూస్తోంది? ఇప్పటికైనా తెదేపా నేతలూ, ప్రభుత్వం స్పందించి తప్పును సరిదిద్దాలి.

చదవండి :  రాయదుర్గం నుండి బ్రౌన్ దుర్గం దాక...

తెదేపా ప్రభుత్వం రైతాంగానికి కల్పించే రాయితీల విషయంలోనూ ఒకే ప్రాంతంలోని నాలుగు జిల్లాల విషయంలో రెండు రకాలైన ధోరణులను ఎంచుకోవడం వెనుక సామాజిక/రాజకీయ ప్రయోజనాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తవచ్చు. అంతిమంగా ఇటువంటి చర్యలు కడప, కర్నూలు జిల్లాలలో పీకల్లోతు కష్టాలలో ఉన్న తెదేపా ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తాయి.

ఇదీ చదవండి!

పచ్చని విషం

పోతిరెడ్డిపాడును నిరసిస్తూ అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం

2008 శాసనసభ సమావేశాలలో ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా తెలుగుదేశం పార్టీ పోతిరెడ్డిపాడు వెడల్పు కారణంగా అవిశ్వాసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: