వార్తలు

కడపలో గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ

కడప : అభ్యర్థులు ఎంతకాలంగానో కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్ పరీక్ష తేదీలను ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటించింది. ఈ సంవత్సరం అక్టోబరు 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థుల ప్రిపరేషన్‌కు బాగా సమయం ఉండడం కొంత సౌలభ్యం. ఇంతకుమునుపు అభ్యర్థులు కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాదు …

పూర్తి వివరాలు

ఎలాంటి బాధలేదు : వివేకా

వేంపల్లె : గవర్నర్‌ కోటా కింద తనకు ఎమ్మెల్సీ ఇవ్వనందుకు ఎలాంటి బాధ లేదని మాజీ మంత్రి వివేకానందరెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లెలో 20సూత్రాల ఆర్థిక అమలు కమిటి ఛైర్మన్‌ తులసిరెడ్డి, కాంగ్రెస్‌ నేత కందుల రాజమోహన్‌రెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ఓటమిచెందితే ఎమ్మెల్సీ, మంత్రి పదవి తీసుకోకుండా సాధారణ …

పూర్తి వివరాలు

పుష్పగిరిలో సినిమా చిత్రీకరణ

కడప : జిల్లాలోని పవిత్రపుణ్యక్షేత్రం పుష్పగిరిలో శనివారం సాయంత్రం శ్రీజ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న (ఇంకాపేరుపెట్టని) ప్రొడక్షన్‌నెంబరు1 సినిమా చిత్రీకరణ జరిగింది.  నిర్మాణంలో భాగంగా హీరో రోహిత్‌, హీరోయిన్‌ శ్రీలపై సన్నివేశాన్ని చిత్రీకరించారు. పీఎన్‌రెడ్డి దర్శకత్వంలో నిర్మాత మదన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సుకుమార్‌ కాగా మగధీరా సినిమాలో నటించిన సంపత్‌రాజు ఈ సినిమాలో …

పూర్తి వివరాలు

వైభవంగా ఎర్రదొడ్డిపల్లి పురిగమ్మ వేల్పు

గాలివీడు: గాలివీడు మండలంలోని చీమలచెరువుపల్లి పంచాయతీ ఎర్రదొడ్డిపల్లిలో పురిగమ్మ వేల్పు శుక్ర, శనివారం ఘనంగా జరిగింది. 15 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేల్పునకు ప్రజలు భారీగా హాజరయ్యారు. శుక్రవారం రాత్రి వివిధ గ్రామాల నుంచి 12 నాణములు వేల్పులో పాల్గొన్నాయి. ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేశారు. శనివారం సాయంత్రం నిర్వహించిన దేవతా …

పూర్తి వివరాలు

కడప నగరంలో తితిదే ఈ-సేవ కౌంటర్

కలియుగ ప్రత్యక్షదైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, శ్రీ వెంకటేశ్వరస్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు. అందుకే ఆయన సన్నిధి ఎప్పుడూ జనసంద్రమే. ఆ స్వామిని సులభంగా దర్శించుకునే అవకాశం కల్పించడానికి, ఆయన సన్నిధిలో ఆర్జిత సేవలందించడానికి, తిరుమల గిరిపై శ్రమ లేకుండా ఒకరోజు సేద తీరేందుకు గదిని సంపాదించేందుకు తిరుమల తిరుపతి …

పూర్తి వివరాలు

కడప జిల్లాలో భారీగా తహశీల్దార్ల బదిలీ

కడప  : జిల్లాలో పనిచేస్తున్న 25 మంది తహశీల్దార్లను వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తూ బుధవారం రాత్రి కలెక్టర్ శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ జి.శ్రీనివాసులును ప్రొద్దుటూరు తహశీల్దార్‌గా నియమించారు. కలెక్టరేట్ ఎఫ్ సెక్షన్ సూపరింటెండెంట్ కె వెంకటరెడ్డిని మైదుకూరు తహశీల్దారుగా నియమిం చారు. రాజంపేట ఆర్డీఓ …

పూర్తి వివరాలు

ప్రొద్దుటూరు మున్సిపాలిటికీ 96 వసంతాలు !

ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పురపాలక సంఘాన్ని  ఏర్పాటు చేసి 96 సంవత్సరాలు గడిచాయి. 1915వ సంవత్సరంలో రామేశ్వరం, మోడంపల్లె, నడింపల్లె, బొల్లవరం గ్రామాలను కలిపి ప్రొద్దుటూరు మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు.  2014 సంవత్సరంతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ శత వసంతాలు పూర్తి చేసుకోనుంది. తృతీయ శ్రేణి పురపాలక సంఘం నుంచి ప్రత్యేక స్థాయి మున్సిపాలిటీకి …

పూర్తి వివరాలు

నిరాదరణకు గురైంది తెలంగాణా కాదు, రాయలసీమే -శ్రీ కృష్ణ కమిటీ

రాయలసీమలో 1993-94 నుంచి 2004-05 మధ్య కాలంలో మూడు ప్రాంతాలను పోల్చి చూసినట్లయితే జీవనప్రమాణాలు బాగా దిగజారాయని,నిరాదరణకు గురయిన ప్రాంతం తెలంగాణా కాదనీ రాయలసీమేనని శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర అభివృద్ధి పై దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి అవలంభించిన దృక్ఫధాన్నే శ్రీ కృష్ణ కమిటీ కూడా …

పూర్తి వివరాలు

” సీమ” భూమి పుత్రుడు “మాసీమ”కు జోహార్..!

రాయలసీమ ఉద్యమనేత, సీనియర్ పాత్రికేయుడు మాసీమ రాజగోపాల్ రెడ్డి గురువారం (19-05-2011) తెల్లవారుఝామున కడపలోని తమ స్వగృహంలో కన్ను మూశారు. రాయలసీమ జనబాహుల్యంలో “మాసీమ” గా ప్రసిద్ధుడైన రాజగోపాల్ రెడ్డి  వయస్సు 80 సంవత్సరాలు. వెనుకబడిన రాయల సీమ అభివృద్ధి పట్ల, ఈ ప్రాంత ప్రజ సమస్యల పట్ల ఎనలేని శ్రద్ధతో పోరు …

పూర్తి వివరాలు
error: