పద్యాలు

వేమన శతకం (వేమన పద్యాలు)

వేమన శతకం

వేమన శతకం ఈ-పుస్తకం రెడ్డి సేవా సమితి కడప మరియు వందేమాతరం ఫౌండేషన్,హైదరాబాద్ ల ప్రచురణ. జూన్ 2011లో ప్రచురితం.  పద్యాల సేకరణ : కట్టా నరసింహులు, సంపాదకత్వం: ఆచార్య జి.శివారెడ్డి

పూర్తి వివరాలు

బడి పిల్లోళ్ళు రాయాల్సిన భాగవత పద్యాలివే!

భాగవత పద్యార్చన

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి1, 2015న ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో నిర్వహిస్తున్న పోతన భాగవత పద్యార్చనకు వచ్చే 9,10 తరగతులు చదువుతున్న బడి పిల్లోళ్ళు నేర్చుకొని రాయవలసిన పద్యాలు ఇవే అని బమ్మెర పోతన సాహితీ పీఠం సభ్యులు విద్వాన్ కట్టా నరసింహులు తెలియచేశారు. భాగవత పద్యార్చనకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే కింది నెంబర్లలో సంప్రదించి …

పూర్తి వివరాలు

కాలచక్ర మెరుగగాలేక ఎప్పుడు సంధ్య జపము సేయు జాణలార!

ఋషులదెట్టి జాతి ఇంపుగా వెలసిన బ్రహ్మకిష్టులైరి బ్రహ్మలైరి తుదిని ఎవ్వరైన సొదమునుటేనయా! విశ్వదాభిరామ వినురవేమ ఋషులకు కూడా కులభేదాలు అంటగడితే ఎలా? అంటున్నాడు వేమన ఈ పద్యంలో. ఋషుల కులం, వంశం, తెగ, వర్గం, పుట్టుక లాంటి వాటిని గురించి ఆలోచించడం శుద్ధ అనవసరం.

పూర్తి వివరాలు

హిమధాముడు లేని రాత్రి హీనములు సుమతీ

పికము వనములోన విలసిల్ల పలికిన భంగి ప్రాజ్ఞజనుల పలుకు గులుకు కాకి కూత బోలు కర్మబద్ధుల కూత విశ్వదాభిరామ వినురవేమ బుద్ధిమంతుల మాటలు తోటలోని కోకిల స్వరంలాగ మనోహరంగా ఉంటాయి. కాని అల్ప బుద్ధుల మాటలు అట్లా కాదు. కాకి కూతల్లా కర్ణ కఠోరంగా ఉంటాయంటున్నాడు వేమన. ప్రాజ్ఞుడు అంటే పండితుడు. అతడు …

పూర్తి వివరాలు

ఇంటి యాలి విడిచి యెట్లుండవచ్చురా..

తుంట వింటి వాని తూపుల ఘాతకు మింటి మంటి నడుమ మిడుక తరమె? ఇంటి యాలి విడిచి యెట్లుండవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ   కుటుంబ వ్యవస్థ లోపల గాని, బయటగాని విరహం విరహమే. ఈ భూమ్యాకాశాల మధ్య విరహమంతటి దుస్తర బాధ లేదని అంటున్నాడు వేమన. వేమన జీవితంలోని పరిణామాన్ని ఈ పద్యం …

పూర్తి వివరాలు

ముక్క వంకజూచి ముకురంబు దూరుట

తనకు ప్రాప్తిలేక దాతలివ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల ముక్క వంకజూచి ముకురంబు దూరుట విశ్వదాభిరామ వినురవేమ దాత తనకు ద్రవ్య సహాయం చెయ్యటం లేదనే ఆక్రోశంతో అతన్ని నిందించటం అవివేకం. నిజానికి తనకా అదృష్టం ఉందా లేదా అని ఆలోచించాలి. ఇలా ఆలోచించకపోవడం ఎట్లా ఉంటుందంటే, తన ముక్కు వంకరగా ఉందని మర్చిపోయి, …

పూర్తి వివరాలు

వేమన వెలుగులు

ఆశల తెగ గోసి అనలంబు చల్లార్చి గోచి బిగియ బెట్టి కోపమడచి గుట్టు మీరువాడు గురువుకు గురువురా విశ్వదాభిరామ వినురవేమ కోరికలను మొదలంటా నరికేసుకోవాలి. మనసులో చెలరేగే మోహమనే నిప్పును ఉపశమింపజేసుకోవాలి. కామ ప్రక్రియతో పనిలేకుండా అంటే గోచిని విప్పే పనిలేకుండా చేసుకోవాలి. అయినదానికీ కానిదానికీ వచ్చే కోపాన్ని నిర్మూలించుకోవాలి. అప్పుడే బ్రహ్మ …

పూర్తి వివరాలు

వేమన శృంగార పద్యాలు

వెర్రి వానికైన వేషధారికినైన రోగికైన పరమ యోగికైన స్ర్తీల జూచినపుడు చిత్తంబు రంజిల్లు విశ్వదాభిరామ వినురవేమ అతడు పిచ్చివాడు కావొచ్చు, సందర్భానికో వేషం మార్చేవాడు కావొచ్చు, వ్యాధిగ్రస్తుడు కావొచ్చు. చివరికి గొప్ప యోగి కావొచ్చు, వీరున్నారే, వీరు నలుగురూ స్ర్తీలను చూసినప్పుడు మాత్రం ఎంతో కొంత కామ వికారానికి లోనవుతారు అని వేమన …

పూర్తి వివరాలు
error: