శ్రీభాగ్ ఒప్పందం
శ్రీభాగ్ బంగాళా (చిత్ర సహకారం: ది హిందూ దినపత్రిక)

శ్రీభాగ్ ఒడంబడిక కుదిరిన రోజు

మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా వున్న తెలుగు వారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1913 లో ఆంధ్రమహాసభను ఏర్పాటు చేసుకున్నారు, ఉద్యమించారు. రాయలసీమ వారికి సర్కార్‌ జిల్లాల వాళ్ళు భాషా సంస్కృతుల పరంగా తమను తక్కువ చూస్తున్నారనే అనుమానం ఉండేది.

రాయలసీమ వాసుల అనుమానాల్ని తీర్చడానికి, అగాధాల్ని తగ్గించడానికి ఆంధ్ర మాహాసభ ఉపసంఘము ఏర్పాటు చేసినారు. ఈ ఉపసంఘము పలు దఫాలుగా చర్చలు జరిపి 16 -11 -1937 లో నాటి మద్రాసు నగరంలోని కాశీనాధుని నాగేశ్వర రావు ఇంటి(శ్రీభాగ్)లో తుది తీర్మానము చేయుటకు సమావేశమైంది. ఆ సమావేశములో పాల్గొన్న రాయలసీమ, కోస్తా నాయకులు ఒక ఒడంబడికను కుదుర్చుకొని సంతకం చేసినారు. ఆ ఒప్పందమే శ్రీభాగ్‌ ఒడంబడికగా ప్రసిద్ది చెందింది.

1947 రాయలసీమ మహాసభలో నీలం సంజీవరెడ్డి ఈ విషయం ప్రస్తావించి ఆవేదన వెలిబుచ్చినారు. ఆ తరువాత 1953లో ఆంధ్రరాష్ట్రం, 1956 ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక కూడా శ్రీభాగ్‌ ఒప్పందం అమలు కాలేదని, సీమ వెనుక బాటుకు గురైందని, అన్ని రంగాల్లో సీమ వివక్షకు గురౌతున్నదనీ సీమ వాసులు అసంతృప్తితో ఉంటూ వచ్చారు.

ఈ శ్రీభాగ్ ఒప్పందం ఇప్పటి వరకూ అమలు కాలేదు. ఈ ఒప్పందం బయటకు రాకుండా కోస్తా నేతలు సీమ వాసులకు ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టారనే ఒక ఆరోపణ కూడా ఉంది.

శ్రీభాగ్ ఒప్పంద పత్రం కోసం ఈ వ్యాసం చదవండి: http://wp.me/p4r10f-12p

 

ఇదీ చదవండి!

మనమింతే

కడపలో రాజధానితోనే రాయలసీమ సమగ్రాభివృద్ధి

రాయలసీమ ప్రాంతంలో కడప లాంటి నగరంలో రాజధాని నెలకొల్పకుంటే, సమీప భవిష్యత్తులోనే ప్రత్యేక తెలంగాణా తరహా మరో వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రోత్సహించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినట్లవుతుంది. కాబట్టి అటు అభివృద్ధి పరంగాను, ఇటు శాంతిభద్రతల పరంగాను ఈ ప్రాంతాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిరక్షించదలచుకుంటే కడప నగరంలో రాజధాని ఏర్పాటు ప్రభుత్వపరంగా ఒక చారిత్రక బాధ్యత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: