'పుట్టపర్తి'కు శోధన ఫలితాలు

అలాంటి ప్రశ్న అడగవచ్చునా?

ramana ias

కడప జిల్లాకు కలెక్టర్ గా నియమితులైన కే.వీ. రమణ గారిని ఒక పాత్రికేయ మిత్రుడు అడిగిన ప్రశ్న చూడండి. ఇలాంటి ప్రశ్నలు అడగడం ద్వారా సదరు పాత్రికేయుడు రాయలసీమలో రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువని ముందే తేల్చేస్తున్నారు. ఈ ప్రశ్న ఒక ప్రాంతంపైన దురభిప్రాయం కలిగించేదిగా ఉంది.   మరోరకంగా చెప్పాలంటే ఈ ప్రశ్న అడిగిన …

పూర్తి వివరాలు

చంద్రబాబు కోసం వైఎస్ రెకమండేషన్

కడప జిల్లాపై బాబు

కాంగ్రెసు సంస్కృతి పూర్తిగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న రోజులలో కేంద్రం తన ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రులను పేకముక్కలవలె మార్చేసింది. చెన్నారెడ్డిని తొలగించి అంజయ్యను, ఆయనను పక్కన పెట్టి భవనం వెంకట్రామ్ ను ముఖ్యమంత్రిగా చేశారు. అదంతా ఇందిరాగాంధీ అధిష్ఠాన వర్గం చదరంగంలో భాగమే. 1978లో భవనం వెంకట్రామ్ విద్యామంత్రి అయ్యాడు. చెన్నారెడ్డి ఆయనను తరువాత …

పూర్తి వివరాలు

సహృదయ శిరోమణి డాక్టర్ బాలశౌరిరెడ్డి

balashowri Reddy - Ravoori Bharadvaaja

అమానుషమయిన పరిస్థితులలో జన్మించి, ముసురుకొంటున్న అవరోధాలన్నింటినీ దోహదాలుగా మలుచుకొంటూ జీవించడమే అద్భుతమనుకొంటున్న దశలో ఆ జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడం వెనుకగల కృషి, ఆ రంగంలో ఉన్నవారికి లోతుగా తెలుస్తుంది. ఇతరులకు ఉపరితల దర్శనం మాత్రమే అవుతుంది. అలాంటి ఆదర్శజీవులు, మనదేశంలోనూ ఉన్నారు. మన రాష్ట్రంలోనూ ఉన్నారు – మన రాష్ట్రంలోనూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ …

పూర్తి వివరాలు

కడప జిల్లా రంగస్థల నటులు

రంగస్థల నటులు

అది క్రీ.శ 1895 ప్రాంతం – శ్రీ వనారస సోదరులు రాయచోటి తాలూకా సురభి గ్రామంలో నివాసం ఏర్పరుచుకొని ప్రప్రధమంగా ‘కీచకవధ’ నాటకం ప్రదర్శించారు. ఆ సమయంలో చంద్రగిరి నుండి వలస వచ్చిన శ్రీ సుబ్బదాసు గారు ఈ వనారస సోదరుల తోడ్పాటుతో సురభి గ్రామంలో ‘శ్రీ శారదా మనోవినోదినీ సంగీత నాటక …

పూర్తి వివరాలు

ఎద్దుల ఈశ్వరరెడ్డి

ఎద్దుల ఈశ్వరరెడ్డి

ఎద్దుల ఈశ్వరరెడ్డి (1986 ఆగస్టు 3) అంతిమ శ్వాస విడిచి, 27 సం||లు అయ్యింది. 27వ వర్థంతి సందర్బంగా ఆయన గురించిన స్మృతులను నెమరు వేసుకోవడం, నేటి పరిస్థితులను మదింపు చేసుకోవడం అత్యంత అవసరం. ఈశ్వరరెడ్డిగారు నిజంగా కీర్తిశేషులే. ”గాడ్‌ ఈజ్‌ క్రియేటెడ్‌ బై మాన్‌” (దేవుడు మానవ సృష్టి) అన్న స్వామి …

పూర్తి వివరాలు

వైసివి రెడ్డి (ఎమ్మనూరు చినవెంకటరెడ్డి)

అప్పుదెచ్చి కవులకిచ్చును, తప్పక ఋణదాతకిచ్చు తానేమగునో – ఉప్పలపాటి వెంకట నరసయ్య భావకవితోద్యమ స్రవంతి వొరిగి పొరిలేవేళ రాయలసీమలో ”తొలకరి చినుకులు” కురిపించి, సెలయేరై విజృంభించి సంగమింప చేసిన అభ్యుదయ కవితావేశ మూర్తి వైసివిరెడ్డి. వైసివి రెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి – కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల …

పూర్తి వివరాలు

మన కలమళ్ళ శాసనం (తొలి తెలుగు శాసనం) ఎక్కడుంది?

కలమళ్ళ శాసనం

కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనాన్ని 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. నేటికి లభించిన తొలి తెలుగు శాసనాల్లో కలమళ్ళ శాసనమే ప్రప్రథమ మనడానికి అందులో వాడిన ప్రాచీన లిపి-భాషలే ప్రమాణం. …

పూర్తి వివరాలు

కడప ప్రాంత శాసనాలలో రాయల కాలపు చరిత్ర !

మాలెపాడు శాసనము

విజయనగర చరిత్రలో కడప ప్రాంతానికి కూడా విశిష్టమైన స్థానం ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వివిధ చోట్ల లభించిన శాసనాల వల్ల అవగతం అవుతోంది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన గండికోట సీమ, సిద్దవటం సీమ, ములికినాటి సీమ, సకిలిసీమ ప్రాంతాలలోని దేవాలయాలూ, బురుజులూ, శాసనాలూ, కైఫీయతుల ద్వారా కడప జిల్లా చారిత్రక విశేషాలు వెలుగుచూస్తున్నాయి. …

పూర్తి వివరాలు

రాయలసీమ జానపదం – తీరుతెన్నులు:అంకె శ్రీనివాస్

రాయలసీమ జానపదం

రాయలసీమ జానపదం రాయలసీమ సాంస్కృతికంగా చాలా విలక్షణమైనది. తొలి తెలుగు శాసనాలు రాయలసీమలోనే లభించాయి. తెగల వ్యవస్థలనుండి నాగరిక జీవనానికి పరిణామం చెందే దశలో స్థానిక భాషకు ఆ నాటి స్థానిక నాయకులు రాజగౌరవం ఇచ్చారు. ఇదే సమయంలో రాయలసీమను పాలిస్తున్న శూద్రరాజులు బ్రాహ్మణుల సంస్కృత భాషను తిరస్కరించి రాజభాషగా తెలుగు భాషను …

పూర్తి వివరాలు
error: