'రాయలసీమ'కు శోధన ఫలితాలు

జుట్టుమామ (కథ) – ఎం.వి.రమణారెడ్డి

ఇన్నేళ్లైనా నా జ్ఞాపకాలనుండి జుట్టుమామ తొలగిపోలేదు. ఎప్పుడూ కాకపోయినా, సినిమానుండి తిరిగొచ్చే సమయంలో తప్పకుండా గుర్తొస్తాడు. గుర్తుకొస్తే మనసు బరువెక్కుతుంది. ఏదో అపరాధం చేసిన భావన నన్ను వెంటాడుతుంది. నేను చేసిన తప్పు ఇదీ అని ఇదమిత్తంగా తేల్చుకోనూలేను; దులిపేసుకుని నిశ్చింతగా ఉండనూలేను. అప్పట్లో నాది తప్పూ, నేరం తెలిసిన వయసేగాదు. అతడు …

పూర్తి వివరాలు

తెలంగాణను జగన్ కోణంలో చూస్తారా!

కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణ సమస్యను మళ్లీ వాయిదా వేయడానికే మొగ్గు చూపింది. ట్రబుల్ షూటర్ గా పేరొందిన గులాం నబీ అజాద్ ను రంగంలో దింపి కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటనను పూర్వపక్షం చేయించింది. షిండే నిజంగానే తెలంగాణ అంశానికి ఒక ముగింపు పలకాలని అనుకున్నారో, లేక సోనియాగాందీ వద్ద వీర …

పూర్తి వివరాలు

‘విజయ’ సామ్రాజ్యాధీశుడు నాగిరెడ్డి – పులగం చిన్నారాయణ

b-nagi-reddy

పాతాళభైరవి… మాయాబజార్… మిస్సమ్మ… జగదేకవీరుని కథ… గుండమ్మ కథ…. ఈ అయిదు సినిమాలూ మనకు రాలేదనే అనుకుందాం. అప్పుడేంటి పరిస్థితి? జస్ట్! ఒక్కసారి ఊహించుకోండి. కిరీటం కోల్పోయిన ఛత్రపతిలా, జాబిల్లి లేని గగనంలా, పరిమళం తెలియని జాజిపూల మాలలా… తెలుగు సినిమా కనిపించదూ! ఎవరైనా ఒక్క మేలు చేస్తేనే మనం గుండెల్లో పెట్టి …

పూర్తి వివరాలు

కడప జిల్లాలో బృహత్ శిలాయుగంనాటి ఆనవాళ్లు

కడప: వైఎస్సార్ కడప జిల్లాలో బృహత్ శిలాయుగం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. జిల్లాలోని సుండుపల్లె మండలం రాయవరం పంచాయతీ పరిధిలోని దేవాండ్లపల్లికి ఉత్తరాన మూడు కిలోమీటర్ల దూరంలో బృహత్ శిలాయుగం నాటి సమాధులు బయటపడ్డాయి. ఇవి క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నాటివని భావిస్తున్నారు. దాదాపు 20 బృహత్ శిలాయుగం సమాధులను దేవాండ్లపల్లి వద్ద …

పూర్తి వివరాలు

‘ఎంజే’ ఇక లేరు

మైదుకూరు : పేద ప్రజల గొంతుక  తానై నిరుపేదల, కార్మికుల, మహిళల హక్కులకోసం వారి పక్షాన అవిశ్రాంత పోరు సల్పిన రాయలసీమ పౌరహక్కుల సంఘం కన్వీనర్ ఎంజే సుబ్బరామిరెడ్డి(60) గురువారం కన్నుమూశారు. వీరు ఎంజేగా సుపరిచితులు. నమ్మిన సిద్ధాంతాల కోసం బతికిన ఎంజే మరణించాడన్న వార్త అయన సన్నిహితులకే కాక, రైతులు, పేద ప్రజలందరినీ కలతకు గురిచేసింది. …

పూర్తి వివరాలు

నవ వసంతం (కథ) – తవ్వా ఓబుల్ రెడ్డి

విజయరాఘవరెడ్డి మొగసాలలో అరుగుపై కూర్చుని గంగులయ్యతో గడ్డం గీయించుకుంటున్నాడు. గేటు దగ్గర ఇద్దరు అంగరక్షకులు పరిసరాలను గమనిస్తున్నారు. ఇస్త్రీ బట్టల మోదతో వచ్చిన రామన్న వాటిని మంచంపై పెట్టి రెడ్డెమ్మ కోసం ఇంట్లోకి కేక వేసినాడు. ”గడ్డం గీకేటప్పుడు సేతులెందుకు వణికిచ్చవురా? పిరికి నాయాలా” అద్దంలో మొహాన్ని చూసుకుంటూ గంగులయ్యను మందలించినాడు విజయరాఘవరెడ్డి. …

పూర్తి వివరాలు

సొంత జిల్లాకు తరలించుకుపోతున్నా….

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్ జిల్లాలోని అభివృద్ధి పథకాలను సొంత జిల్లాకు తరలించుకుపోతున్నారు. ఈ విషయమై కడప జిల్లా కాంగ్రెస్ నేతలు మౌనం వహిస్తుండడం విశేషం. తరతరాలుగా వెనుకబాటుకు గురైన జిల్లాకు మంజూరైన ప్రాజెక్టులను చిత్తూరుకు తీసుకెళ్ళే బదులు ముఖ్యమంత్రి అక్కడికి కొత్త ప్రాజెక్టులను తీసుకువస్తే బాగుండేది. ఈ చర్యల వల్ల అంతిమంగా …

పూర్తి వివరాలు

కడుపాత్రం (కథ) – తవ్వా ఓబుల్‌రెడ్డి

కడుపాత్రం

”కేబుల్‌టీవీలు, గ్రాఫిక్‌సినిమాలతో హోరెత్తిపోతున్న ఈ కాలంలో ఇంకా బొమ్మలాటలు ఎవరు జూచ్చారు? మీకు ఎర్రిగాని… ఊళ్ళోకి వచ్చినందుకు అంతో ఇంతో లెక్క అడుక్కోని దోవ బట్టుకోని పోర్రి… ఎందుకింత సెమ!” నిన్నరాత్రి పొరుగూర్లో గ్రామపెద్దలు అన్నమాటలు, రోడ్డు గతుకుల్లా బండిలోని వెంకటరావును కుదిపివేస్తున్నాయి. ఆ రాత్రికి ఆ వూర్లోనే గడిపి, ఆటాడకుండా తెల్లవారుజామున్నే …

పూర్తి వివరాలు

బ్రహ్మణి స్టీల్స్‌ను ఆపొద్దు …

కడప: రాయలసీమ ప్రజల ఉపాధికి అవకాశాలున్న బ్రహ్మణి స్టీల్స్‌ను రాజకీయాలతో ముడిపెట్టి అడ్డుకోవద్దని రాయలసీమ కార్మిక, కర్షక సమితి డిమాండ్ చేసింది. వెనుకబడిన రాయలసీమ, ప్రత్యేకించి వైఎస్సార్ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో నిర్దేశించిన ఈ ప్రాజెక్టును రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమితి ఆరోపించింది. స్థానిక ప్రజల ఉపాధి కోసం తలపెట్టిన …

పూర్తి వివరాలు
error: