Tag Archives: కలిమిశెట్టి మునెయ్య

ఏమే రంగన పిల్లా – జానపదగీతం

అందమైన దాన

ఒక పడుచు పిల్లగాడు తన అందమైన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయిదేశం పోయినాడు. వాడు చెప్పిన సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన మగడిని చూసి అలిగింది ఆ అందాలభామ. ఆ మగడు ఆమెను ఎలా అనునయించాడో, అలుక తీర్చాడో చూడండి. వర్గం: జట్టిజాం పాట (బృందగేయం) పాడటానికి అనువైన రాగం:తిలకామోద్ …

పూర్తి వివరాలు

బుంగ ఖరీదివ్వరా పిల్లడ – జానపదగీతం

బుంగ ఖరీదివ్వరా

అందమైన ఆ పల్లె పిల్ల ఆకు వేసి, తమ్మ పుక్కిట పెట్టి చెంగావి రంగు సీర కట్టుకొని బుంగ తీసుకుని ఒయ్యారంగా నడుస్తూ నీటి కోసం ఏటికి వచ్చింది. ఏటి దగ్గర ఒక కొంటె కోనంగి సరదాపడి రాయి విసిరినాడు. ఆ రాయి గురి తప్పి ఆ గడుసు పిల్ల కడవకు తగిలి …

పూర్తి వివరాలు

వదిమాను సేనుకాడ : జానపదగీతం

దూరం సేను

అత్త కూతురుతో మనువు కుదిరింది మల్లన్నకు. ఆ చనువుతో మల్లన్న మరదలిని తనతో కోతకు రమ్మని పిలిచినాడు. పెళ్లి కాకుండా ఇద్దరం కలిసి తిరిగితే నిన్నూ, నన్నూ ఛీ కొడతారంది మరదలు. అందుకతడు నేను ధర్మం తప్పేవాన్ని కాదు అన్నాడు. ఎన్నో ఆశలు చూపినాడు. ఏది ఏమైనా పెళ్ళైన పెళ్లి తర్వాతనే నీ …

పూర్తి వివరాలు

భరతుడా! నా చిన్ని తమ్ముడా (చెక్కభజన పాట)

రామభద్ర రఘువీర

ఒకప్పుడు రామాయణ, భారత, భాగవత కథలు జానపదుల జీవితంలో నిత్య పారాయణాలు. వారికి ఇంతకంటే ఇష్టమైన కథలు మరేవీ ఉండవేమో! పితృవాక్య పరిపాలనకై శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యాలకు వచ్చినాడు. ఆ సమయంలో భరతుడు అక్కడ లేడు. వచ్చిన తర్వాత జరిగిన ఘోరానికి బాధపడి తల్లి కైక దురాశను నిందించి అడవిలో …

పూర్తి వివరాలు

కసువు చిమ్మే నల్లనాగీ… జానపదగీతం

నేను - తను

సంసారమనే  శకటానికి భార్యాభర్తలు రెండు చక్రాలు. ఆ రెండు చక్రాలలో దేనికి లోపమున్నా బండి నడవదు. దానిని సరిచేయటానికి ఒక మనిషంటూ అవసరం. సరసము విరసము కలబోసిన వారి సంభాషణ పాట రూపంలో… వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: హిందుస్తాన్ తోడి రాగస్వరాలు (ఏకతాళం) భర్త: కసువు చిమ్మే నల్లనాగీ                 …

పూర్తి వివరాలు

సుక్కబొట్టు పెట్టనీడు… జానపదగీతం

సుక్కబొట్టు పెట్టనీడు

అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు. విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు అతని సూటిపోటి మాటలు భరించలేకపోయింది.  సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా, సహించలేని తన భర్తను గురించి ఆమె ఇలా చెప్తోంది… వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: శుద్ధ సావేరి స్వరాలు (దేశాది తాళం) …

పూర్తి వివరాలు

కల్లు గుడిసెల కాడ – జానపదగీతం

కల్లు గుడిసె

వాడు వ్యసనాలకు బానిసై చెడ తిరిగినాడు. ఇల్లు మరిచినాడు. ఇల్లాలిని మరిచినాడు. తాగుడుకు బానిసైనాడు. చివరకు అన్నీ పోగొట్టుకుని చతికిల పడినాడు. వాడి (దు)స్థితిని జానపదులు హాస్యంతో కూడిన ఈ జట్టిజాం పాటలో ఎలా పాడుకున్నారో చూడండి. వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: శంకరాభరణం స్వరాలు (తిశ్ర ఏకతాళం) కల్లు …

పూర్తి వివరాలు

చెక్కభజన

రాయలసీమ జానపదం

రెండు చెక్కలను లయాత్మకంగా కొట్టడం ద్వారా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి దానికి అనుగుణంగా అడుగులు వేసే కళ చెక్కభజన . చెక్క భజనలో అడుగులకు అనుగుణంగా పాటలో వేగం, ఊపు, ఉంటాయి. చాలారకాల అడుగులున్నాయి . ఆది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్పకొట్టడం, కులుకు వంటివి ప్రత్యేకమైన అడుగులు. ఈ అడుగులకు …

పూర్తి వివరాలు

కదిరి చిన్నదానా …. జానపదగీతం

అందమైన దాన

వర్గం: యాలపాట పాడటానికి అనువైన రాగం: మాయా మాళవ గౌళ (త్రిశ్ర ఏకతాళం) కదిరి చిన్నదానా కదిరేకు నడుముదానా నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| నీ సిల్కు సీరెకు రేణిగుంట్ల రేయికాకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా ||కదిరి|| నీ సైజు చేతులకు సైదాపురం గాజులకు నిన్నెట్ల మరచుందునే మరదల మాణిక్యమా …

పూర్తి వివరాలు
error: