కడప: దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును కేంద్రం తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాయలసీమ మహాసభ తీర్మానించింది. స్థానిక సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో సీమ జిల్లాలకు చెందిన రచయితలు, కళాకారులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమ సమగ్రాభివృద్ధి సాధనే ధ్యేయంగా ఉద్యమాన్ని …
పూర్తి వివరాలురేపు వేంపల్లెలో ‘తలుగు’ పుస్తకావిష్కరణ
కడప: వేంపల్లెలో బేస్తవారం (ఫిబ్రవరి 5వ తేదీన) ‘వేంపల్లె షరీఫ్’ రాసిన ‘తలుగు’ కథ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. లిటిల్‌ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో 5వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, …
పూర్తి వివరాలురాచమల్లు తరువాత రాచపాళెం
కడప: ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి శైలి విలక్షణమని విమర్శల్లో రాచమల్లు తరువాత రాచపాళెం అని జిల్లా సాహితీవేత్తలు కొనియాడారు. మన నవలలు, మన కధానికల పుస్తకానికి గాను చంద్రశేఖర్ రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా జిల్లా జనవిజ్ఞానవేదిక సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో అభినందన సభను నిర్వహించారు. ఇందులో …
పూర్తి వివరాలురాచపాళెంకు అభినందనలు
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆచార్య డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డిని పలువురు ఆదివారం సన్మానించి అభినందనలు తెలిపారు. సీపీ బ్రౌన్ భాషాపరిశోధన కేంద్రం పూర్వ బాధ్యులు విద్వాన్ కట్టా నరసింహులు, యోవేవి లలిత కళల విభాగం సహాయాచార్యులు డా.మూల మల్లికార్జునరెడ్డి, సిబ్బంది శివారెడ్డి, భూతపురి గోపాలకృష్ణ, హరిభూషణ్ రావు, రమేష్, …
పూర్తి వివరాలురాచపాలెం చంద్రశేఖరరెడ్డికి కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు
ప్రముఖ సాహితీ విమర్శకులు, సాహితీవేత్త ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు ఈ ఏడాది కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రచించిన “మన నవలలు, మన కథలు” అనే విమర్శనా గ్రంథానికి ఈ అవార్డు ఇస్తున్నట్లు శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రకటించింది. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ప్రస్తుతం కడపలోని సి.పి.బ్రౌన్ భాషా …
పూర్తి వివరాలు27న కడప జిల్లా భవిష్యత్ పై సదస్సు
నగరంలోని సీపీ బ్రౌన్ లైబ్రరీలో జులై 27వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ‘కడప జిల్లా భవిష్యత్? ‘ అనే అంశంపై జిల్లా స్థాయి సదస్సు నిర్వహించనున్నామని జనవిజ్ఞానవేదిక (జవివే) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక సీపీ బ్రౌన్ లైబ్రరీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్సీలు …
పూర్తి వివరాలు‘వాళ్ళు సీమ పేరు పలకడానికి భయపడుతున్నారు’
రాయలసీమ అనే పేరు చెప్పడానికి నాయకులు భయపడుతున్న పరిస్థితి దాపురించడం హేయంగా ఉందని కేతువిశ్వనాథరెడ్డి అన్నారు. గురువారం స్థానిక సీపీబ్రౌన్ భాషాపరిశోధనకేంద్రంలో జరిగిన మాచిరెడ్డి వెంకటస్వామి స్మారకోపన్యాసాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తాగునీరు, సాగునీరు, విద్యాప్రయోజనాలు కలిగించే ప్రాజెక్టు రూపకల్పన, నగరాభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ వంటి మాటలు నాయకుల నోటి …
పూర్తి వివరాలు21వ శతాబ్ది తెలుగు సాహిత్యం.. తీరుతెన్నులు
యోగివేమన విశ్వవిద్యాలయంలో ’21వ శతాబ్ది తెలుగు సాహిత్యం.. తీరుతెన్నులు’ అనే అంశంపై జాతీయ సదస్సు రెండో రోజు సి.వి.రామన్ విజ్ఞాన భవన్లో కొనసాగింది. ఈ సదస్సులో తెలుగుశాఖ సమన్వయకర్త ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ సంప్రదాయాలను, విలువలను జీవన మార్గాలనే మార్చివేసేంతగా సాహిత్యం ప్రభావం చూపిందన్నారు. రైతులు నేత కార్మికులు ఇతర వృత్తి కారులు …
పూర్తి వివరాలుతెలుగు సాహిత్యం తీరుతెన్నులపై జాతీయ సదస్సు
యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో ’21వ శతాబ్దిలో తెలుగు సాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై జాతీయ సదస్సు సి.వి.రామన్ విజ్ఞాన భవన్‌లోని సదస్సుల గదిలో బుధవారం మొదలైంది. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ సమాజ కోణం నుంచి సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆచార్య కుసుమకుమారి …
పూర్తి వివరాలు