Tag Archives: రారా

సాహిత్యంలో నిబద్ధత అంటే ఏమిటి? ఎంతమేరకు? : 1

రారా వర్ధంతి

సాహిత్యంలో రచయితకు ఉండాల్సిన నిబద్ధత (commitment) గురించి సోదాహరణంగా వివరిస్తూ రారాగా పరిచితులైన సుప్రసిద్ధ విమర్శకులు కీ.శే. రాచమల్లు రామచంద్రారెడ్డి గారు రాసిన వ్యాసమిది. రారా గారు చాలా కాలం క్రితం రాసిన ఈ వ్యాసాన్ని రారా స్మారక సమితి సౌజన్యంతో ‘మిసిమి’ మాసపత్రిక  1992 మే నెల సంచికలో పునః ప్రచురించింది. …

పూర్తి వివరాలు

ఈ మట్టి పరిమళాల నేపథ్యం…కేతు విశ్వనాథరెడ్డి

కడప జిల్లా కథాసాహిత్యం

“విపరీతమైన ఉద్వేగ స్వభావం ఉండీ నేను కవిని ఎందుకు కాలేకపోయాను? వచన రచనే నన్నెందుకు ఆకర్షించింది? ఈ రెండు ప్రశ్నల గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను. బహుశా మన సమాజంలో కవిత్వానికీ కవులకీ ఉన్న అగ్రవర్ణాధిక్యత గుర్తొచ్చినప్పుడెల్లా. వీటిని గురించి నేను కావాలని ఆలోచించడం కాదుగానీ నాకు బాల్యంలో పాఠం చెప్పిన వొక గురువు …

పూర్తి వివరాలు

కథానికా, దాని శిల్పమూ – రాచమల్లు రామచంద్రారెడ్డి

రారా వర్ధంతి

‘జీవితంలో చూసి ఉపేక్షించే విషయాలనే యీ కథలలో చదివి షాక్ తింటాం.’ అని నా కథల గురించి కుటుంబరావు అన్నారు. షాక్ (దిమ్మరపాటు) మాట యేమైనా పాఠకుని హృదయం మీద గాఢమైన అనుభూతి ముద్ర వేయాలనే ఉద్దేశంతోనే నేనీ కథానికలు రాసినాను. కథానికను గురించే కాదు. మొత్తం సాహిత్యం గురించే నా అవగాహన …

పూర్తి వివరాలు

ఆ రోజుల్లో రారా..

సాహిత్య ప్రయోజనం

ఒక రోజు చండ ప్రచండంగా వెలిగిన రారా (రాచమల్లు రామచంద్రారెడ్డి) ఈ రోజు మన మధ్యలేరు. ఆయన సహచరుడైన నాకు ఆయన జ్ఞాపకాలు (రారా జ్ఞాపకాలు) మిగిలాయి. కడపోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకాన్ని మననం చేసుకోవడం మంచిదన్న అభిప్రాయంతో, నా జ్ఞాపకాల్ని పాఠకుల ముందుంచుతున్నాను. కడప జిల్లాకు సంబంధించి ఆధునిక కథానిక …

పూర్తి వివరాలు

మన జయరాం, మన సొదుం

సొదుం జయరాం

మధ్య తరగతి ఆలోచనల్ని భూ మార్గం పట్టించిన కథాశిల్పి సొదుం జయరాం. వీరికి 2004లో రాచకొండ రచనా పురస్కారం శ్రీకాకుళంలోని కథానిలయం వార్షికోత్సవ సభలో ఫిబ్రవరి 15న అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి మిత్రుడు జయరాం గురించి అందిస్తున్న రచన… నాలుగైదు దశాబ్దాల …

పూర్తి వివరాలు

‘నాది పనికిమాలిన ఆలోచన’

Sodum Jayaram

“జ్ఞాపకశక్తికీ నాకూ చుక్కెదురు. విశ్వం, నేనూ ఎప్పుడు దగ్గరయ్యామో నాకు సరిగ్గా గుర్తు లేదు. ఇద్దరం ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూల్లో చదువుకున్నాం. కానీ ఆ రోజుల్లో మా ఇద్దరికీ స్నేహం అయినట్టు లేదు. నేను ఇంటర్మీడియేట్ చదువుతున్న రోజులలో రా.రా గారు కడపకొచ్చారు. ఆయన ఎక్కడెక్కడి వాళ్ళను ఒకచోట చేర్చారు. గజ్జల మల్లారెడ్డి, …

పూర్తి వివరాలు

హృదయమున్న విమర్శకుడు – రారా!

రాచమల్లు రామచంద్రారెడ్డి

రా.రా .గా ప్రసిద్ధుడయిన విమర్శకుడూ, సంపాదకుడూ, కథకుడూ, అనువాదకుడూ సిసలయిన మేధావీ – రాచమల్లు రామచంద్రారెడ్డి (1922-88) హృదయమున్న రసైకజీవి! స్వపరభేదాలు పాటించని విమర్శకుడు. పిసినారి అనిపించేటంత పొదుపరి కథకుడు. ముళ్లలోంచి పువ్వులను ఏరే కళలో ఆరితేరిన సంపాదకుడు. మూలరచయిత మనసును లక్ష్యభాషలోని పాఠకుడికి సమర్థంగా చేర్చిన అనువా దకుడు. అక్షరాంగణంలో నిలువెత్తు …

పూర్తి వివరాలు

ఓడిపోయిన సంస్కారం (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా )

ఓడిపోయిన సంస్కారం

సుందరమ్మకంతా కలలో ఉన్నట్లుంది. పెండ్లంటే మేళతాళాలూ, పెద్దల హడావుడీ, పిల్లల కోలాహలం, మొదలైనవన్నీ వుంటాయనే ఆమె మొదట భయపడింది. మూడేండ్లనాడు తన మొదటి పెండ్లి ఆ విధంగానే జరిగింది. ఈ రెండవ పెండ్లి యే ఆర్భాటమూ లేకుండా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో నవనాగరిక పద్ధతిలో జరుగుతుందని వారం రోజులనాడు తెలిసినప్పుడు ఆమె కెంతో …

పూర్తి వివరాలు
error: