Tag Archives: కట్టా నరసింహులు

చెన్నయ్ భవిష్యం చెప్పిన ఆ రెండు పద్యాలు

chennai

గుడికూలును నుయి పూడును వడి నీళ్లం జెఱువు తెగును వనమును ఖిలమౌ చెడనిది పద్యం బొక్కటి కుడియెడమల చూడకన్న గువ్వలచెన్నా! వంటి పద్యాలతో గువ్వల చెన్న శతకం శతకసాహిత్యంలో వన్నె కెక్కింది. ఆ నాటి సామాజికాంశాలను ప్రస్ఫుటంగా ప్రకటించి అధిక్షేపశతకాల్లో ఒకటిగా నిలిచింది. ఢిల్లీ, కలకత్తా, బొంబాయి వంటి నగరాల చరిత్రలు వందల …

పూర్తి వివరాలు

అల్లసాని పెద్దన చౌడూరు నివాసి

అల్లసాని పెద్దన

ఆంధ్ర సాహిత్య ప్రబంధాలలో మనుచరిత్ర కున్నంత స్థానం మరే ప్రబంధానికీ లేదు. అల్లసాని పెద్దనామాత్యుడీ ప్రబంధాన్ని రచించాడు. ఈయన నందవరీక బ్రాహ్మణుడు. చొక్కనామాత్యుని పుత్రుడు. అహోబలం మఠం పాలకుడు శఠగోపయతి వల్ల చతుర్విధ కవిత్వాలు సంపాదించుకొన్నాడు. అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల కొలువులో ప్రవేశించక మునుపే హరికథాసారం రచించాడు. ఈ గ్రంథం లభ్యం కాలేదు. …

పూర్తి వివరాలు

పోతన మనుమలు స్తుతించిన ‘వరకవి సార్వభౌముడు’

బమ్మెరపోతన మనుమలు కేసన, మల్లనలు. వీరు పోతనకు ముమ్మనుమలనియు తెలుస్తున్నది. వీరు జంటకవులు. విష్ణు భజనానందం, దాక్షాయణీ పరిణయం అను రెండు కావ్యాలు రచించారు. దాక్షాయణీ పరిణయంలోని ‘సుకవి స్తుతి’లో తమ తాత పోతరాజును, ఇతర కవులను ప్రశంసించారు. ఆ గ్రంథం అముద్రితం. వావిళ్ల వారి శ్రీమదాంధ్ర భాగవత ముద్రణలోని శేషాద్రి రమణ …

పూర్తి వివరాలు

భక్త కన్నప్పది మన కడప జిల్లా

భక్త కన్నప్ప

భక్త కన్నప్ప కడప (వైఎస్సార్) జిల్లా వాడే. కైఫీయతుల్లో ఇందుకు స్పష్టమైన ఆధారం ఉందని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో కన్నప్ప కర్నాటకవాడనీ, తమిళుడని, ఆ ప్రాంతాల వారు చేసిన వాదనలో నిజం లేదని స్పష్టమైంది. కన్నప్ప వైఎస్సార్ జిల్లావాడేననడానికి రుజువుగా ఆయన ప్రతిష్టించిన శివలింగం రాజంపేట మండలం ఊటుకూరులో నేటికీ ఉందని పండిత పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

పూర్తి వివరాలు

“.. తెలుగు లెస్స ”అన్నది ” మోపూరు ” వల్లభరాయలే!

తెలుగు లెస్స

జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు దెనుగు లెస్స జగతి దల్లి కంటె సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలుగాదె ( క్రీడాభిరామం -రచన వినుకొండ వల్లభరాయుడు.) కడప జిల్లా పులివెందుల ప్రాంతంలోని మోపూరు గ్రామంలోని భైరవేశ్వర ఆలయం నేటికీ  వుంది. ఇది వీరశైవులకు ప్రసిద్ధ క్షేత్రం. (క్రీ.శ.1423 -1445) ప్రాంతంలో …

పూర్తి వివరాలు
error: