Tag Archives: కేతు విశ్వనాథరెడ్డి కథలు

కూలిన బురుజు (కథ) – కేతు విశ్వనాధరెడ్డి

కడప జిల్లా కథాసాహిత్యం

కూలిన బురుజు ఊరు దగ్గరికొచ్చింది. అంతకు ముందు లేని పిరికితనమూ, భయమూ నాలో. రెండు వారాల కిందట ఖూనీ జరిగిన ఊళ్ళోకి అడుగుపెట్టబోతున్నాను. పుట్ట చెండ్లాట మాదిరి నాటుబాంబుల్తో ఆడుకున్న గ్రామ పార్టీల ప్రపంచంలోనికి ప్రవేశిస్తున్నాను. కక్షలూ, కార్పణ్యాల అడవిలోకి వెళుతున్నాను. కొత్త అనుభవం. పదేళ్ళ కిందట జ్ఞాపకాల్లో నిలిచిన ఊరు ఇది …

పూర్తి వివరాలు

శ్రుతి (కథ) – డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

సిద్దేశ్వరం ..గద్దించే

జీవితంలో ముందు ముందు ఎవరిదారి వాళ్ళదనుకున్నాము. నలుగురం ఎప్పుడైనా, ఎక్కడైనా కలవడం కూడా అంత సాధ్యం కాదేమో అని నిరుత్సాహపడ్డాము. కాన్పూరు ఐ.ఐ.టిలో బి.టెక్ చదివిన నాలుగేళ్లూ ఎంతో ఆత్మీయంగా గడిచాయి. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఒకచోట పనిచేసే అవకాశం వస్తుందని ఎవరూ కలగనలేదు. అబ్దుల్లాది జమ్ము, సేతు మాధవన్‌ది తంజావూరు, దేశపాండేది …

పూర్తి వివరాలు

దాపుడు కోక (కథ) – డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

కడప జిల్లా కథాసాహిత్యం

చెన్నమ్మ నాగరిక నాయిక కాదు. కాబట్టి ఆమె ఆర్తనాదంలో విపంచీ కలస్వరాలు పలకలేదు. బస్సు యింజను రొదలో ప్రయాణీకుల రణగొణ ధ్వనుల్లో, చెన్నమ్మ గోడు ఎవరికీ అర్థం కాలేదు. కాని చెన్నమ్మ వులికిపాటు చూసి కొందరు గొల్లుమన్నారు. చెన్నమ్మ తీరు తెన్నుల్లో కొందరు సెక్సును చూస్తున్నారు, కండక్టరు ద్రోణుడు సృష్టించిన పద్మ వ్యూహంలో చిక్కుకుని వొక మూల నలిగిపోతున్న వీరయ్య, ఆ అరిచింది తన కూతురని గుర్తించాడు.

పూర్తి వివరాలు
error: