Tag Archives: kadapa sahityam

కూలిన బురుజు (కథ) – కేతు విశ్వనాధరెడ్డి

కడప జిల్లా కథాసాహిత్యం

కూలిన బురుజు ఊరు దగ్గరికొచ్చింది. అంతకు ముందు లేని పిరికితనమూ, భయమూ నాలో. రెండు వారాల కిందట ఖూనీ జరిగిన ఊళ్ళోకి అడుగుపెట్టబోతున్నాను. పుట్ట చెండ్లాట మాదిరి నాటుబాంబుల్తో ఆడుకున్న గ్రామ పార్టీల ప్రపంచంలోనికి ప్రవేశిస్తున్నాను. కక్షలూ, కార్పణ్యాల అడవిలోకి వెళుతున్నాను. కొత్త అనుభవం. పదేళ్ళ కిందట జ్ఞాపకాల్లో నిలిచిన ఊరు ఇది …

పూర్తి వివరాలు

పోతన మనుమలు స్తుతించిన ‘వరకవి సార్వభౌముడు’

బమ్మెరపోతన మనుమలు కేసన, మల్లనలు. వీరు పోతనకు ముమ్మనుమలనియు తెలుస్తున్నది. వీరు జంటకవులు. విష్ణు భజనానందం, దాక్షాయణీ పరిణయం అను రెండు కావ్యాలు రచించారు. దాక్షాయణీ పరిణయంలోని ‘సుకవి స్తుతి’లో తమ తాత పోతరాజును, ఇతర కవులను ప్రశంసించారు. ఆ గ్రంథం అముద్రితం. వావిళ్ల వారి శ్రీమదాంధ్ర భాగవత ముద్రణలోని శేషాద్రి రమణ …

పూర్తి వివరాలు

ఏటుకాడు (కథ) – రామకృష్ణా రెడ్డి.పోసా

etukadu

ఎహె… జరగండి అవతలికి అంటాడు ఏసోబు. ఒరే… బాబ్బాబూ…. అంటారు పెద్దమనుషులు. స్నానానికి వేన్నీళ్లు పెట్టవే బోసిడీ… అని పెళ్లాన్ని తిడతాడు ఏసోబు. ఇదిగో… పెడుతున్నాను స్వామో అని పరుగు తీస్తుంది పెళ్లాము. ఇప్పుడు కాదు వెళ్లండి… రేపు అంటాడు ఏసోబు. నువ్వు ఎప్పుడంటే అప్పుడే దేవరా… అంటారు కామందులు. బీడీ- అడుగుతాడు …

పూర్తి వివరాలు

తరం-అంతరం (కథ) – చెన్నా రామమూర్తి

ఎడ్లబండి కదిలింది. చెరువు కానుకొని ఉండే దట్టమైన చీకిచెట్ల నుంచి కీచురాళ్లు రొద చేస్తానే ఉండాయి ఆగకుండా! చుక్కలు లేని ఆకాశం చినుకులు కురిపించడానికి సిద్దమవుతున్నట్లుగా ఉంది. కందెన తక్కువై ఇరుసు చేస్తున్న శబ్దం… రాయి ఎక్కి దిగినపుడు చక్రం మీదున్న కమీ చేస్తున్న శబ్దం… ఎద్దుల గిట్టల శబ్దం… సుతారంగా కదిలే …

పూర్తి వివరాలు

ఓడిపోయిన సంస్కారం (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా )

ఓడిపోయిన సంస్కారం

సుందరమ్మకంతా కలలో ఉన్నట్లుంది. పెండ్లంటే మేళతాళాలూ, పెద్దల హడావుడీ, పిల్లల కోలాహలం, మొదలైనవన్నీ వుంటాయనే ఆమె మొదట భయపడింది. మూడేండ్లనాడు తన మొదటి పెండ్లి ఆ విధంగానే జరిగింది. ఈ రెండవ పెండ్లి యే ఆర్భాటమూ లేకుండా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో నవనాగరిక పద్ధతిలో జరుగుతుందని వారం రోజులనాడు తెలిసినప్పుడు ఆమె కెంతో …

పూర్తి వివరాలు
error: